twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Weekly : వసు, రిషి ప్రేమ దోబుచులాట..ఆపరేషన్ రిషిధార స్టార్ట్, దేవయానికి మహేంద్ర వార్నింగ్

    |

    యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

    సెప్టెంబర్ 26వ ఎపిసోడ్​లో..

    సెప్టెంబర్ 26వ ఎపిసోడ్​లో..

    వసుధారను సాక్షి కిడ్నాప్ చేయించడం గురించి ఎందుకు చెప్పలేదని వసుధారను రిషి అడుగుతాడు. సాక్షి విషయం నా దగ్గర ఎందుకు దాచావ్. అసలు ఏంటి వసుధార నువ్వు.. ఇంత జరిగినా నా దగ్గర దాస్తావా.. అని బాధగా అడుగుతాడు రిషి. దాయడానికి కారణం ఉంది సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. వారిద్దరి మధ్య సాక్షి విషయం సద్దమణిగాక ఇంటికెళ్లిన రిషి వసుధారతో నాకు కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే.. నా కోసం వచ్చేస్తావా.. నువ్వు ఈ ఇంటికి నా కోసం రావడానికి సిద్ధమా అని అంటాడు రిషి.

    దీంతో ఏం మాట్లాడకుండా వసుధార ఉండటంతో.. సరే నువ్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదన్నమాట అని రిషి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి దగ్గరికి జగతీ వస్తుంది. వచ్చి ప్రేమ బంధం గురించి కొన్ని మాటలు చెబుతుంది. అటువైపు నుంచి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది కదా మేడం, తన (వసుధార) కోసం వెనుకడుగు వేయలేను అని రిషి అంటాడు.

    సెప్టెంబర్ 27వ ఎపిసోడ్​లో..

    సెప్టెంబర్ 27వ ఎపిసోడ్​లో..

    రిషి అన్న మాటలతో ఇక చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది జగతి. తర్వతా వసుధార దగ్గరికి వెళ్లి నేను రిషితో మాట్లాడాను. ఏదో తుది నిర్ణయం నీదే అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏమైందో చెప్పు వసు. అని కోపంగా అడుగుతుంది జగతి. మేడమ్.. గురు దక్షిణ విషయాన్ని రిషి సార్ మరిచిపోమంటున్నారు అంటూ మూడు రోజుల గడువు గురించి చెబుతుంది వసుధార.

    దీంతో జగతి షాక్ అవుతుంది. తర్వాత బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోతుంది జగతి. అది చూసిన రిషి.. ఏంటి మేడమ్ ఈ ఇల్లు వదిలి పెట్టి వెళ్తున్నారా.. గుడ్ మేడం, గుడ్ డెసిషన్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు వెళ్లిపోతే వసుధార నా జీవితంలోకి వస్తుందని మీరేలా అనుకుంటున్నారు. ఆ వసుధారకు పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు పొగరు కూడా ఎక్కువే. మీకు మా డాడ్ అసరం లేదు వసుధారకు నేను అవసరం లేదు. మీ పంతాలు, పట్టింపులే కావాలి.

    వెళ్లండి మేడమ్ వెళ్లండి. బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, ప్రేమలు ఇవన్నీ బాగా వివరిస్తారు కదా మీరిద్దరూ. మరి మీరిలా వెళ్లడం ఏంటీ. మీరు వెళ్లానుకుంటే డాడ్ తో కలిసి వెళ్లండి. మీ ఇద్దర్నీ విడదీసిన పాపం నాకెందుకు మేడం. తల్లి లేకుండా బతికినవాడిని తండ్రిని దూరం చేసుకుని బతకడం కూడా అలవాటు చేసుకుంటాను వెళ్లండి అని అంటాడు.

    సెప్టెంబర్ 28వ ఎపిసోడ్​లో..

    సెప్టెంబర్ 28వ ఎపిసోడ్​లో..

    దేవయాని ఈ అవకాశం వదులుకోవద్దు అనుకొని రిషి నువ్ ఇక్కడే ఆగు అంటుంది. గుమ్మం దగ్గర బ్యాగ్ తో ఉన్న జగతిని.. ఏంటీ జగతి నాటకాలు.. అని దేవయాని అంటే నాటకాలేంటి అక్కయ్యా అని సమాధానం ఇస్తుంది జగతి. అది విన్న మహేంద్ర కోపంగా వదినగారు దయచేసి ఈ విషయంలో మీరు కలుగజేసుకోకండి అంటాడు.

    దీంతో ఏడుపు స్టార్ట్ చేస్తుంది దేవయాని. దేవయాని దగ్గరకు వెళ్లి.. పెద్దమ్మా ఏంటీ మీరు అంటూ ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తాడు రిషి. ఆ తర్వాత జగతి మేడమ్ ని రిషి సార్ అమ్మా అని పిలవలాని కోరుకోవడం తప్పా అని అంటుంటే.. తప్పే.. ముమ్మాటికీ తప్పే అంటాడు అప్పుడే వచ్చిన రిషి. తన దగ్గరికి జగతి వెళ్లిన విషయం అడిగుతూ వసుధారను నిలదీస్తాడు రిషి. ఏంటీ సార్ మీరు.. జగతి మేడమ్ ఎప్పుడూ మీ సౌకర్యం కోసమే ఆలోచిస్తారు తెలుసా.

    అసలు మేడమ్ ఏమన్నారో తెలుసా సార్. రిషి నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు. నా ఆశని చంపుకుంటాను కానీ. నా వల్ల మీ ఇద్దరూ దూరం కావొద్దు అన్నారు సార్. ఓ కన్న తల్లి గండెల నిండా దుఃఖాన్ని మోసుకుంటూ కళ్లల్లో కన్నీళ్లు దాచుకుని నాకోసం ఆలోచించొద్దు అన్నారు సార్. రిషి ఏం చెబితే అది విను అన్నారు. ఎంత గొప్ప మనసు సార్ మేడమ్ ది అని చెబుతుంది వసుధార.

    సెప్టెంబర్ 29వ ఎపిసోడ్​లో..

    సెప్టెంబర్ 29వ ఎపిసోడ్​లో..

    కాలేజ్ గెస్ట్ హౌజ్ లో ఉన్న రిషి చేతికి వసుధార కట్టుకడుతుంది. నా మనసేం బాలేదు.. నేను తర్వాత వస్తా నువ్ వెళ్లు అని వసుధారతో రిషి అంటాడు. మీకేనా మనసుంది.. నాకు కూడా ఉంది కదా అంటుంది వసుధార. నాతో నీకేంటీ అని రిషి అంటే.. మీరు నేను ఒకటే కదా సార్ అంటుంది వసుధార. ఆ తర్వాత మీరు వెళితేనే నేను వెళ్తా అని మొండిపట్టు పడుతుంది వసుధార.

    ఏంటీ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని రిషి అనడంతో బ్లాక్ మెయిల్ కాదు.. ఓ మనసు కోసం మరో మనసు పడే తపన ఇది అని వసుధార సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత రిషికి ఇంటికి వచ్చిన వసుధార పక్కన కూర్చొని రిషికి అన్నం తినిపిస్తుంది వసుధార. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటారు వీరిద్దరు. మరోవైపు జగతి, మహేంద్ర, గౌతమ్ ముగ్గురు వీళ్లిద్దరి గురించి డిస్కషన్ పెడతారు. ఇద్దరూ వదులుకోలేరు. ఇద్దరూ తగ్గడం లేదు. ఏం చేద్దాం అనుకుంటారు. దీంతో మిషన్ ఎడ్యుకేషన్ పేరుతో వసుధార, రిషి ఇద్దర్నీ ఒకే చోట చేర్చేందుకు వ్యూహం రచిస్తారు

    సెప్టెంబర్ 30వ ఎపిసోడ్​లో..

    సెప్టెంబర్ 30వ ఎపిసోడ్​లో..

    మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం విద్యాశాఖలో ఉద్యోగంలో చేరానని చెబుతుంది వసుధార. ఆ ప్రాజెక్ట్ గురించి అంతా వివరిస్తుంది వసుధార. జాబ్ లో జాయిన్ అయిన విషయం తనకు చెప్పలేదని అనుకుంటాడు రిషి. చెప్పలేదని ఫీల్ అవుతున్నారా అని మనసులో అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత తన కారు దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు రిషి.

    వసుధార అక్కడికి వస్తుంది. ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు అని వసుధార అడిగితే.. ఎలా వచ్చావ్.. కారేది అని రిషి అంటాడు. నాకు కారెందుకు ఇస్తారు.. క్యాబ్ లో వచ్చాను అని వసుధార అంటే నువ్ మినిస్టర్ గారి దగ్గర జాబ్ లో చేరడం ఏంటీ.. నాకు చెప్పాలి కదా అని అంటాడు రిషి. పరీక్షలు అయిపోయాయి.. ఖాళీగా ఉండటం ఎందుకు అని రిషి అంటే.. నాకు ఓ మాట కూడా చెప్పలేదు.. నా దగ్గర అసిస్టెంట్ గా చేసేదానివి గుర్తుందా అని రిషి అంటాడు. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది.. మొన్నటి వరకు జీతం తీసుకున్న అసిస్టెంట్ ను.. ఇప్పుడు జీతం తీసుకోని జీవితాంతం తోడుగా నడిచే అసిస్టెంట్ ను అని వసుధార సమాధానం ఇస్తుంది.

    అక్టోబర్ 1వ ఎపిసోడ్​లో..

    అక్టోబర్ 1వ ఎపిసోడ్​లో..

    రిషి జీవితంలోకి వసుధార రావడానికి కారణం నువ్వే కదా.. మొగుడు పెళ్లాలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అని దేవయాని మహేంద్ర, జగతిలను అంటుంది. ఈ మహాతల్లి రిషిని వదిలివెళ్లిపోతే.. రిషిని పెంచి పెద్ద చేసింది నేను. మీకు నచ్చిన వాళ్లని రిషికి అంటగడతానంటే నేను ఒప్పుకోను. తన జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను అని దేవయాని అంటుంది.

    అలా ఎలా వదినగారు.. రిషికి ఏం కావాలో మేం కదా డిసైడ్ చేయాల్సింది అని మహేంద్ర అంటాడు. రిషితో నాకు సంబంధం లేదా.. రిషి నీ కన్నకొడుకు అని నన్నుదూరం పెడుతున్నావా అని దేవయాని అంటే.. రిషి సంతోషాన్ని పాడుచేస్తే ఊరుకోనని మీరంటున్నారు.. ఆ మాట నేను అనాలి. రిషి నా కొడుకు. అవును రిషి మా కొడుకే.

    మా జీవితాన్ని గందరగోళం చేసారు. మా ఇద్దరి విషయంలో ఎన్నో కుట్రలు చేశారు. ఒక్క మాట మీ గురించి అన్నయ్యాకి చెప్పినా.. రిషికి చెప్పినా మీ స్థానం ఎక్కడో ఆలోచించుకోండి.. మన మంచితనం, సహనాన్ని చేతకాని తనంగా తీసుకుంటున్నారు. మీరు ఇక్కడితే ఆగండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. రిషి, వసుధార జీవితాలు వాళ్లకే వదిలేయండి. మధ్యలో జోక్యం చేసుకుంటే బాగుండదు జాగ్రత్త అని దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర.

    English summary
    Guppedantha Manasu Weekly Roundup
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X