Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Guppedantha Manasu: వసుధారను అవమానించిన కాలేజీ స్టాఫ్.. దేవయానితో వసు ఛాలేంజ్!
కాలేజీలో స్టాఫ్ తో దేవయాని మాట్లాడుతుంటుంది. ఒక్కొక్కసారి మనం ఓడిపోయి ఎదుటివారిని గెలిపించాలి. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇప్పుడు గెలిచింది వసుధార కాదు నేను అని దేవయాని అంటుంది. ఆ మాటలు కాలేజీ స్టాఫ్ కు అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రిషిపై ప్రేమ చూపించినట్లు నటిస్తాను. కానీ, నేను చేసేది నేను చేస్తానని దేవయాని అంటే.. జగతి మేడమ్ స్థానంలో వసుధార కూర్చుంటే మనం కూర్చుని చప్పట్లు కొడదామా అని కాలేజీ స్టాఫ్ అడగుతారు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 15, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్ 634లో ఏం జరిగిందో చదివేసేయండి.

ఊహించని దెబ్బ కొట్టాలి..
వసుధార గెలుపు చూసి చప్పట్లు కొడదామా అని కాలేజీ స్టాఫ్ అడగడంతో గెలుపు వచ్చిందనే సంతోషంలో వాళ్లుండగా మనం ఊహించని దెబ్బ కొట్టాలని చెబుతుంది దేవయాని. తర్వాత వసుధార-జగతి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. కంగ్రాచ్యులేషన్స్ వసు. ఇది నీకు పెద్ద విజయం అని జగతి అంటే.. ఇది నా విజయం కాదు మేడమ్.. మీది, రిషి సార్ ది అని అంటుంది వసుధార. నా గెలుపు ఆపాలని లోపల చాలామంది ప్రయత్నాలు చేశారులేండీ అని వసుధార అంటే నేనూ చూశాను అంటుంది జగతి. దేవయాని అక్కయ్య ఆలోచన రిషి మనసులో గొప్పదానిగా నిలిచిపోయేలా చేసింది. నీ పనిని నువ్ సమర్ధవంతంగా పూర్తి చేయి అని చెబుతుంది జగతి.

భలేగా బుట్టలో వేసుకున్నావ్..
ఇంతలో కాలేజీ స్టాఫ్ వసుధార దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెబుతారు. నా గెలుపును ఆపాలని చాలామంది కష్టపడ్డారు అని వసుధార అంటే అభిప్రాయాలు చెప్పమన్నారు అంతే కదా. అయినా నీ తెలివితేటల చూస్తుంటే ముచ్చటేస్తోంది. నువ్వు ఎంత తెలివైనదానివంటే భలేగా బుట్టలో వేసుకుంటావ్.. రిషి సార్ ని.. బుట్టలో వేసుకోకపోతే నీ ఆటలు ఇలా సాగుతాయా చెప్పు అని కాలేజీ స్టాఫ్ అంటారు. దీంతో మేడమ్ మర్యాదగా మాట్లాడండి అని వసుధార అంటుంది. నేను మర్యాదగానే మాట్లాడుతున్నా.. నువ్వు ఈ కాలేజీలో పేరుకే స్టూడెంట్ వి, కానీ ఎండీ తర్వాత ఎండీ లాంటి దానివి కదా.. నీతో వైరం పెట్టుకుంటే మాకు మనుగడ లేదని ఇప్పుడే తెలుసుకున్నాం అని కాలేజీ స్టాఫ్ అంటారు.

కారులో షికారు చేయడం..
నువ్ ఇంత చిన్న వయసులో ఇంతలా ఎదిగిపోయావ్.. నీకు ఎలా సాధ్యమైంది. ఎదుటి వారి బలహీనత తెలుసుకోవడమే బలం అన్నట్లు రిషి సార్ బలహీనతలు వసుధార కనిపెట్టేసి ఇలా ఎదిగింది అని కాలేజీ స్టాఫ్ మేడమ్స్ అంటే.. మేడమ్ ఆపుతారా అని అరుస్తుంది వసుధార. నీకు రిషి సార్ సపోర్ట్ లేదా.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీరు కారులో షికార్లు చేయడం తెలిసిన విషయమే కదా.. లివింగ్ టుగెదర్ మాటలు వినడమే కానీ, ప్రత్యక్షంగా ఇక్కడే చూస్తున్నాం అని కాలేజీ స్టాఫ్ అంటారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీరు లెక్చరర్లు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను వెళ్లండి అని వసుధార అంటుంది.

అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..
కోపం ఎందుంకు.. నీ విజయాలు, నీ గొప్పలు, నీ ఆదర్శాలు వెనుక రిషి సార్ లేరా.. ఓ స్త్రీ విజయం వెనుక రిషి సార్ ఉన్నారు.. నువ్వు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతారు కాలేజీ స్టాఫ్. ఆ తర్వాత వసుధార ఆటోలో వెళుతూ కాలేజీ స్టాఫ్ అన్న మాటలు తలుచుకుని తీవ్రంగా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి వసుధార కోసం వెతుకుతూ ఉండగా ఇప్పుడే కాలేజీ బయటకు వెళ్లడం చూశాను అని మహేంద్ర అంటాడు. జరిగిన విషయం మొత్తం జగతికి చెప్పుకుని బాధపడుతుంది వసుధార. కాలేజీ స్టాఫ్ కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో.. వాళ్ల వెనుకాల ఎవరున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అని అనడంతో దేవయాని ఎంట్రీ ఇస్తుంది.

మర్యాదగా మాట్లాడండి అక్కయ్య..
మీ గురు శిష్యులు ఇలా ఉంటే.. నాకు చూడటానికి ఎంత సంతోషంగా ఉందో అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. వసుధార ఇప్పటికే బాధలో ఉంది. తనను మీరు ఏం అనకండి అని జగతి అంటుంది. సిగ్గు లేకుండా ఇక్కడికి వస్తావని అనుకోలేదు వసుధార అనడంతో.. మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అని జగతి అంటుంది. దీనికి మర్యాద అంటే ఏంటి జగతి.. అర్ధరాత్రి అపరాత్రులు కలిసి తిరగడమేనా మర్యాద అంటే అని అడుగుతుంది దేవయాని. నేను ఎక్కడికి వెళ్లిన నా హద్దుల్లో నేను ఉంటాను అని వసుధార అంటే.. హద్దుల గురించి నువ్వు మాట్లాడకు అని సీరియస్ గా అంటుంది దేవయాని.

మీ బుద్ధులేంటో తెలిసేలా..
దేవయాని మాటలకు సీరియస్ అయినా వసుధార. తర్వాత దేవయాని అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నావ్.. నేను నీపై కరెక్ట్ గా దృష్టిపెడితే.. ఏమవుతుందో తెలుసా.. అని దేవయాని అంటే.. మేడమ్ నేను ఇంటికి వస్తే మీకేంటి ఇబ్బందని వసుధార అంటే.. నీకున్న హక్కు ఏంటి.. ఈ ఇంటికి రావడానికి నీకు ఏం హక్కు ఉందని రివర్స్ గా క్వశ్చన్ చేస్తుంది దేవయాని. ఏ అర్హత గురించి అడుగుతున్నారో.. అదే అర్హతతో ఇదే ఇంట్లో నేను అడుగు పెడతాను అంటుంది వసుధార. మీరేంటో మీ బుద్దులేంటో రిషి సార్ కి తెలిసేలా చేస్తాను అనేసి వెళ్లిపోతుంది వసుధార. ధరణి పిలుస్తుండగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు కాలేజీ నుంచి గులాబీల బొకే తీసుకుని బయలు దేరతాడు రిషి.