Don't Miss!
- News
ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ: తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Sports
అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే: ఏబీ డివిలియర్స్
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Guppedantha Manasu: ఎమోషనల్ గా ఎపిసోడ్.. అవమానాల మధ్య నలిగిపోయిన వసుధార!
జగతి ముందు వసుధారను అనరాని మాటలు అంటుంది దేవయాని. దీంతో ఆ మాటలు భరించలేక వసుధార వెళ్లిపోవడంతో చాలా సంతోషంగా ఉంటుంది దేవయాని. హాయిగా సోఫాలో కూర్చుని ధరణిని పిలుస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానంటూ ధరణితో మాట్లాడుతుంది. ఎందుకు అత్తయ్య అని ధరణి అడిగితే ఎందుకో ఉన్నాను అంటూ చెబుతుంది. అత్త ఆనందమే కోడలు ఆనందమని చెబుతుంది దేవయాని. సరే ఇప్పుడు ఏం చేయను స్వీట్స్ తీసుకురావాలా అని ధరణి అడుగుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 16, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 635లో ఏం జరిగిందో చదివేసేయండి.

పెద్దమ్మా వసుధార ఎక్కడ..
ధరణి స్వీట్స్ తీసుకురమ్మాంటారా అని అడిగితే.. వద్దు.. ఈ స్వీట్స్ తినేలోపు ఆ సంతోషం ఆవిరైపోతోంది. స్వీట్స్ అచ్చి రాలేదు. ఈసారి ఏదైనా హాట్ గా తీసుకురా అని చాలా సంతోషంగా మురిసిపోతూ అంటుంది దేవయాని. వసుధారను పంపించినందుకే ఇంత హ్యాపీగా ఉంది. నాకు అర్థమైందిలే అని మనసులో అనుకుంటుంది ధరణి. ఇంతలో ఇంట్లోకి రిషి వస్తాడు. బొకే తీసుకుని వచ్చిన రిషి.. పెద్దమ్మా వసుధార ఎక్కడ అని అడుగుతాడు. సడెన్ గా రిషి వచ్చి అలా అడిగేసరికి ఏం చెప్పాలా అని కంగారు పడుతుంది దేవయాని. వసుధార కోసం ఇల్లంతా అటు ఇటు చూస్తుంటాడు రిషి.

ఇల్లు వద్దు మీరు వద్దు..
ఇంకెక్కడి వసుధార రిషి అని అంటుంది దేవయాని. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెబుతుంది. దీంతో షాక్ అయి చూస్తాడు రిషి. ఎక్కడికి అని అడిగితే.. వాళ్లందరు నాకు చెప్పి వెళ్తారా ఏంటీ నాన్న రిషి అని డ్రామా ప్లే చేస్తుంది దేవయాని. కాలేజీలో ఎవరో ఏదో అన్నారంట. దాంతో కోపంగా వచ్చి ఇల్లు వద్దు మీరు వద్దు అని నా మొహంపైనే చెప్పేసి వెళ్లిపోయిందని చెబుతుంది దేవయాని. నాకైతే కాదు రిషికైనా చెప్పి వెళ్లి అని ఎంతో నచ్చజెప్పాను రిషి అయినా వినిపించుకోకుండా వెళ్లిపోయిందని లేనిపోనివి చెబుతుంది దేవయాని. చూశావా నీకైన కనీసం చెప్పకుండా వెళ్లింది. ఆమెకు చెప్పి వెళ్లడం అలవాటు లేదేమో అని అంటుంది దేవయాని.

వసుధారను ఎవరు అన్నారో చెప్పండి..
జగతి దగ్గరికి వెళ్లింది వసుధార. అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏమో ఏడుస్తూ వచ్చి వెళ్లిపోయిందని దేవయాని చెబితే వెంటనే జగతి గదిలోకి వెళతాడు రిషి. కోపంగా తలుపు తడతాడు. రా రిషి అని జగతి అంటే.. మేడమ్.. వసుధార ఎక్కడ అని అడుగుతాడు. ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మా చెప్పింది. ఏం జరిగింది చెప్పండి మేడమ్.. వసుధారను ఎవరు ఏమన్నారు అని రిషి అడిగితే.. అక్కయ్య గారు తనకు అనుగుణంగా చెప్పుకుని ఉంటుంది అని మనసులో అనుకుంటుంది జగతి. వసుధారను ఎవరు ఏం అన్నారో చెప్పండి.. వాళ్ల సంగతి చెబుతాను అని కోపంగా అంటాడు రిషి. ఎంతమందికని చెబుతావ్ రిషి అని జగతి అనడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు.

ఆడ మగ సంబంధం గురించి..
ఎంతమంది పని అని చెబుతావ్. ఏం చేస్తావ్. ఒకవేళ నేను జరిగింది మొత్తం చెబితే వాళ్ల మీద పోయి అరుస్తావ్. ఇప్పుడు నలుగురు, తర్వాత 20 మంది, తర్వాత.. ఇలా అనేవాళ్ల సంఖ్య పెరుగుతూనే పోతుంది. వాళ్లందరిపైనా అరుస్తావా అని జగతి అంటుంది. దీంతో ఆలోచనలో పడిపోతాడు రిషి. అసలు ఆడ మగ మధ్య సంబంధం గురించి ఎదుటివారికి చెప్పుకోవాల్సిన అవసరమే రాకూడదు. అలా అడిగిన వాళ్లకు సమాధానం చెప్పుకుంటూ పోతే అది బంధమే కాదు రిషి. ఒకరు అనేదాకా ఏ బంధాన్ని తెచ్చుకోకూడదు అని అనేసరికి షాక్ అవుతాడు రిషి.

నువ్ తిరిగి వస్తావనే నమ్మకంతో..
మళ్లీ వసుధార ఎక్కడికి వెళ్లింది మేడమ్ అని అడుగుతాడు రిషి. ఎక్కడైతే తన బంధాలను వదులుకుని వచ్చిందో.. ఎక్కడైతే తన రక్త సంబంధీకులను వదులుకుని వచ్చిందో అక్కడికే వెళ్లింది. వసుధారను అన్నవాళ్లును కాదు.. వసుధారను కన్నవాళ్లను కలుసుకో రిషి. తను వెళ్లిపోయిందని బాధపడకు.. నువ్ తిరిగి వస్తావనే నమ్మకంతో వెళ్లిపోయిందని ఆలోచించు అని జగతి చెబుతుంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు వసుధార ఓనర్ తన గురించి హేళనగా, అసభ్యకరంగా మాట్లాడుతుంది. నువ్ ఎప్పుడు వస్తావో, ఎప్పుడు వెళ్తావో తెలియదు. నీకోసం ఎవరో పెద్ద పెద్ద వాళ్లు కార్లలో వస్తారు అంటూ చాలా మాటలు అంటుంది. వసుధార లగేజ్ బయట పారేస్తుంది.

ఏవేవో ఊహించుకుంటారు..
లగేజ్
తీసుకుని
అమ్మవారి
గుడి
దగ్గరికి
వెళ్లి
ఏడుస్తుంటుంది
వసుధార.
కాలేజీ
స్టాఫ్,
ఇంటి
ఓనర్
అన్న
మాటలు
తలుచుకుని
బాధపడుతుంటుంది.
ఇంతలో
అక్కడికి
రిషి
వస్తాడు.
ఇల్లు
ఖాళీ
చేశావా
అని
అడిగితే..
లేదు
సార్
చేయించారు.
మీరు
అడిగారు
కానీ,
ఎందుకు
అన్నది
మాత్రం
నేను
చెప్పలేను.
కానీ
మాటలతో
చాలా
బాధ
పెట్టారు
సార్.
టెక్నాలజీ
మారింది,
డెవలప్
అయింది
అంటున్నారు.
కానీ,
ఆడపిల్ల
మాత్రం
సమాజం
దృష్టిలో
అలాగే
ఉంది
సార్.
ఆడమగ
కనిపిస్తే
నోటికి
ఏది
వస్తే
అది
మాట్లాడుతుంటారు.
ఏవేవో
ఊహించుకుంటారు
అని
చెబుతుంది
వసుధార.
వసుధార
మాటలకు
మౌనంగా
ఉన్న
రిషి..
ఇంటికి
పదా
వెళదాం
అని
రిషి
అంటే..
ఆ
ఇంటికి
నాకు
ఏంటీ
సార్
సంబంధం.
ఏ
అర్హతతో
నేను
ఆ
ఇంట్లోకి
అడుగు
పెట్టాలి.
ఆ
ఇంటికి
ఏ
హక్కుతో
రావాలో
చెప్పండి
సార్.
అతిథిగా
అయితే
3
రోజులు
ఉండొచ్చు.
ప్రతిసారీ
ఇంటికి
వచ్చి
కూర్చుంటే
చాలా
మందికి
అనుమానాలు
వస్తాయి
సార్.
నేను
వాళ్లందరికి
సమాధానం
చెప్పాలనుకోవట్లేదు
సార్..
మా
ఊరికే
వెళ్లిపోతున్నాను
అని
వసుధార
అంటుంది.