For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: అర్ధరాత్రి నలుగురితో రిషి ఫైట్.. మిత్రద్రోహి అంటూ గౌతమ్ పై ఫైర్!

  |

  మేడమ్ ని జాగ్రత్తగా చూసుకోండని ధరణికి చెప్పి బయటకు వెళతారు రిషి, వసుధార. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న రిషి.. వసుధారను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళతాడు. డాడ్ వాళ్లు ఇంటికి వచ్చారు కదా.. వసుధారా పార్టీ చేద్దాం అనుకున్నాను. కానీ డాడ్ వాళ్లకి అలా ఉండటంతో మౌనంగా ఉన్నానని రిషి అంటాడు. రిషి ఆనందం చూసి మురిసిపోతుంది వసుధార. ఇద్దరు సిటీలో షికారు కొడుతుంటారు. తర్వాత ఒక చోట కారు ఆపి ఇద్దరూ ప్రేమ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి నలుగురు కుర్రాళ్లు తాగివచ్చి అసభ్యంగా మాట్లాడతారు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 2, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 623లో ఏం జరిగిందో చదివేసేయండి.

  డ్రెస్ కోసం వచ్చాడని తెలిసి..

  డ్రెస్ కోసం వచ్చాడని తెలిసి..

  తమతో అసభ్యంగా మాట్లాడిన నలుగురితో రిషి చిన్నపాటి ఫైట్ చేస్తాడు. ఈ క్రమంలో రిషి షర్ట్ పై ఆల్కహాల్ పడుతుంది. దీంతో ఇలా ఇంటికి వెళితే దేవయాని మేడమ్ ప్రశ్నలు తట్టుకేలేమని వసుధార అంటుంది. తర్వాత గౌతమ్ సార్ ఇంటికెళ్లి డ్రెస్సు మార్చుకుని వెళ్దామని చెబుతుంది వసుధార. సరే అనుకుని గౌతమ్ ఇంటికి వెళ్తారు రిషి, వసుధార. అనుకోకుండా రిషి రావడంతో గౌతమ్ టెన్షన్ పడతాడు. వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటీ అని అనుకుంటాడు. ఆ తర్వాత డ్రెస్ కోసం వచ్చాడని తెలిసి హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకుంటాడు గౌతమ్. మరోవైపు రిషి ఇంట్లో జగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని.

  నన్ను చాలా తక్కువ అంచనా వేశావ్..

  నన్ను చాలా తక్కువ అంచనా వేశావ్..

  వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చి చేరింది అనుకుంటూ వెళ్లి జగతి రూమ్ డోర్ తీసి చూస్తుంది దేవయాని. అక్కడ ధరణి కనిపించడంతో వసుధార లేదేంటి అని అనుమానపడుతుంది దేవయాని. అదే డౌట్ తో బయటకు వచ్చి చూస్తే కారు కనిపించదు. గేట్లు తీసి ఉంటాయి. వసుధార కనిపించడం లేదు.. రిషి కారు లేదు.. అంటే.. ఇద్దరూ బయటకు వెళ్లారన్నమాట అని మండిపడుతుంది దేవయాని. రిషిదేం తప్పులేదు. వసుధారే చెడగొడుతోంది. నన్ను చాలా తక్కువ అంచనా వేశావ్.. నీ సంగతి త్వరలోనే చెబుతాను అని అనుకుంటుంది దేవయాని. ఇక గౌతమ్ ఇంట్లో డ్రెస్ మార్చుకునేందుకు గదిలోకి వెళ్తాడు రిషి.

  డాడ్ గిఫ్ట్ గా ఇచ్చుంటాడేమో..

  డాడ్ గిఫ్ట్ గా ఇచ్చుంటాడేమో..

  గౌతమ్ ఇంట్లో గదిలోకి వెళ్లిన రిషి డ్రెస్ మార్చుకుని వస్తాడు. అది బాలేదు. ఇంకేటి మార్చుకో అని గౌతమ్ అంటే.. నా ఇష్టం అంటాడు రిషి. ఇంతలో ఫోన్ మర్చిపోయాను అనుకుంటూ వెళతాడు రిషి. అక్కడ మహేంద్ర వస్తువులు కొన్ని ఉండిపోయిన విషయం తెలిసిందే. ఆ వస్తువులను (ఫొటో ఫ్రేమ్, పర్ఫ్యూమ్, వాచ్) చూసిన రిషికి డౌట్ వస్తుంది. మహేంద్ర వాచ్ చూసి.. ఇది డాడ్ కి నేనే గిఫ్ట్ గా ఇచ్చాను కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంది అనుకుంటూ ఆలోచిస్తాడు రిషి. అప్పుడు రిషి.. ఒకవేళ నేను ఇచ్చిన గిఫ్ట్ ని గౌతమ్ కి డాడ్ గిఫ్ట్ గా ఇచ్చుంటాడేమో అనుకుని ఊరుకుంటాడు. ఇంతలోనే అక్కడ మహేంద్ర, రిషి కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్ రిషికి కనిపిస్తుంది.

  షెల్టర్ ఇచ్చి ఎంత బాగా నాటకం ఆడావురా..

  షెల్టర్ ఇచ్చి ఎంత బాగా నాటకం ఆడావురా..

  మహేంద్ర ఫొటో ఫ్రేమ్ చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయంటే.. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారా అనకుంటూ బయటకు వెళ్తాడు రిషి. అప్పుడు గౌతమ్ కి మహేంద్ర వాచ్, ఫొటో చూపించి ఏంట్రా ఇది అని అడుగుతాడు రిషి. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా.. అని అడుగుతాడు. డాడ్ మేడమ్ వాళ్లకి షెల్టర్ ఇచ్చి ఎంత బాగా నాటకం ఆడావురా అని బాధతో అంటాడు రిషి. వీడు నా చిన్నప్పటి స్నేహితుడు.. అందుకే డాడీ వాళ్లు ఇక్కడే ఉన్నా కూడా నాకు చెప్పలేదని రిషి అనడంతో.. అది కాదురా అంటూ గౌతమ్ టెన్షన్ పడుతుంటాడు. ఇలా ఒక్కొక్క మాటను గౌతమ్ పై వదులుతుంటాడు రిషి.

  పిచ్చోడిలా మారిపోయాను కదరా..

  పిచ్చోడిలా మారిపోయాను కదరా..

  డాడ్ వాళ్లు ఎక్కడికి వెళ్లారని నేను అంతలా ఏడుస్తున్నా కూడా నువ్వు ఇంట్లోనే పెట్టుకుని.. తమాషా చూశావని గౌతమ్ పై రిషి ఫైర్ అవుతాడు. దీంతో గౌతమ్ అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయినా రిషి అది వినిపించుకోడు, మాట్లాడనివ్వడు. మిత్ర ద్రోహి ఇంత మోసమా.. డాడీ కోసం పిచ్చోడిలా మారిపోయాను కదరా.. నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా అని నిలదీస్తాడు రిషి. దీనికంటే నన్ను కత్తితో పొడిచి చంపేసింది ఇంకా బాగుండేది అని బాధపడతాడు రిషి. దీంతో గౌతమ్ కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా తలదించుకుని ఉండిపోతాడు.

  English summary
  Guppedantha Manasu Serial December 2 2022 Today Full Episode 623
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X