For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ప్రియురాలి ఊరికి బయలుదేరిన రిషి.. వసు తండ్రిని ఎదుర్కొంటాడా?

  |

  నేను ఒక్కదాన్నే వెళ్లాలనుకున్న నిర్ణయం నాది కాదు సార్.. జగతి మేడమ్-మహేంద్ర సర్ ది అని జరిగిన విషయం తలుచుకుంటుందు వసుధార. నువ్వు రిషి బాగుండాలి వసుధార. దీనికోసం మేం ఇద్దరం ఏం చేయమన్నా చేస్తామని జగతి-మహేంద్ర చెబుతారు. మీ ఊరికి మేము ఎవ్వరం రావట్లేదని జగతి చెబుతుంది. వసుధార నేను చెప్పేది పూర్తిగా విను. రాత్రి దేవయాని అక్కయ్య పోన్ మాట్లాడుతుంటే మహేంద్ర విన్నాడు అని వసుధారకు చెబుతుంది జగతి.

  శాశ్వతంగా విడిపోవాలి.. ఎంత డబ్బు ఖర్చు అయిన పర్వాలేదు అని దేవయాని అన్నమాటలను మహేంద్ర వింటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 21, 2022 బుధవారం నాటి తాజా ఎపిసోడ్​ 639లో ఏం జరిగిందో చదివేసేయండి.

  విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు..

  విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు..

  దేవయాని మేడమ్ అక్కడికి వచ్చి ఏం చేయలేరు. మా వాళ్లు ఎవరు తెలియదు కదా అని వసుధార అంటుంది. మీ నాన్న గురించి నాకు తెలుసు. ఆరోజు కాలేజీలో టీసీ విషయంలోనే అంత పెద్ద గొడవ చేశారు. చాలాసార్లు గొడవపడ్డాను. నా మీద తనకు చాలా కోపం ఉంటుంది. ఇక రిషి నా కొడుకు అని తెలిస్తే రిషి మీద కోపం చూపిస్తాడు. మొత్తానికి సంబంధం వద్దు అనుకునే అవకాశం ఉంటుంది.

  ఇక దేవయాని అక్కయ్యకు కూడా నువ్వు రిషి కలిసి ఉండటం. మీరిద్దరు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. మాకంటే ముందు నువ్వు వెళ్లు. అందరినీ అక్కడ ప్రశాంతంగా ఉంటూ అందరి మనసు మార్చి ఆ తర్వాత అసలు విషయం చెప్పు. అప్పుడు అందరం వస్తాం అని జగతి అన్న మాటలు తలుచుకున్న వసుధార నా కారణంగా రిషి సార్ అవమానపడకూడదు. రిషి సార్ గురించి నాన్నకు చెప్పిన తర్వాతే రమ్మని చెబుతాను అని అనుకుంటుంది.

  తలొంచుకుని పెళ్లి పీటలపై కూర్చోవాలని..

  తలొంచుకుని పెళ్లి పీటలపై కూర్చోవాలని..

  మరోవైపు వసుధార అన్న మాటలను తలచుకుని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇదే విషయంపై జగతి మహేంద్ర మాట్లాడుకుంటారు. ఆడపిల్లకు పుట్టింటివారు నా అనే వాళ్లు తోడుంటే ఆ ధైర్యం వేరు. కానీ, దురదృష్టవశాత్తూ వసుధారకు పుట్టింట్లో సరైన స్థానం లేదు. కారణం వాళ్ల నాన్న మూర్ఖుడు. కోపిష్టి. తను ఏమనకుంటే అదే జరగాలని పట్టుబట్టే మూర్ఖుడు. వసుధార సాధించిన విజయాల పట్ల సంతోషించడు.

  ఓ అమ్మాయి అంటే ఎంతో కొంత చదువుకుని తలొంచుకుని పెళ్లి పీటలపై కూర్చోవాలని ఆలోచించే వ్యక్తి. అందరం వెళితే వసుధార వాళ్ల నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాదు. అందుకే ముందు వసుధార వెల్లి పరిస్థితులు చక్కబడిన తర్వాత అందరం వెళ్లడం మంచిది అని జగతి అంటుంది.

  నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు..

  నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు..

  ఆడపిల్లకు పెళ్లి చేసే బాధ్యత తీరిపోతుందని భావించిన తండ్రిని ఎదిరించి.. ఇక్కడకు వచ్చ చాలా కష్టాలు పడింది. తాను అనుకుంది సాధించింది. వసుధార సాధించిన విజయాలకు పొంగిపోయేంత గొప్ప మనసు చక్రపాణికి ఉంటుందని నేను అనుకోను మహేంద్ర. కచ్చితంగా వాళ్ల నాన్న ఒప్పుకోడు. కానీ వసుధార ఒప్పిస్తుందనే నమ్మకం నాకుంది. వసుధార సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటుంది.

  ఇప్పుడు వసు చేస్తోంది అదే అని జగతి చెబుతుంది. జగతి మాట్లాడిన మాటలు మొత్తం విన్న రిషి.. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బయట ఉన్న మొక్క కాలికి తగిలి కిందపడుతుంది. ఆ సౌండ్ విని బయటకు వచ్చిన మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. వెళ్లాల్సిన సమయం వచ్చింది డాడ్. మేడమ్ చెప్పిన మాటలు విన్నాను. వసుధార పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపించింది. వసుధార వాళ్లింటికి వెళతాను అని రిషి అంటాడు.

  నేను వెళ్లొద్దు అనడం లేదు..

  రిషి నువ్ వెళ్లడమేంటి అని మహేంద్ర అడిగితే.. వసుధారకి ఎక్కడ కష్టం ఎదురవుతుందో అక్కడ నేనుండాలి. తను ఇంటికి పంపించానని నేను నిబ్బరంగా ఉన్నాను. కానీ, తను ఇంట్లో కష్టాలు ఎదుర్కొనేందుకు ఒంటరిగా వెళ్లిందని ఇప్పుడే తెలిసింది అని రిషి అంటాడు. రిషి.. నేను వెళ్లొద్దు అనడం లేదు. ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి.. నల్లపూసల గొలుసు తీసుకుని వచ్చి ఇస్తుంది జగతి.

  ఇది వసుకి ఇవ్వు అని చెబుతుంది. ఏంటిది అని రిషి అడిగితే.. నేనిచ్చానని చెప్పు అంటుంది జగతి. తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుని ఆగిపోతాడు రిషి. వసుధార ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. తనకి కష్టం ఉందని తెలిస్తే తనను ఒంటరిగా వదిలి ఉండలేను అని రిషి అంటే.. వసుధార వాళ్ల ఊరు వెళ్లు.. కానీ వాళ్లింటికి వద్దని జగతి చెబుతుంది.

  ఎన్నోసార్లు కథలు, కథలుగా చెప్పావు..

  ఎన్నోసార్లు కథలు, కథలుగా చెప్పావు..

  మరోవైపు వసుధార కారులో వెళ్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాను అన్న ఆనందం ఒకవైపు. మీరు పక్కన లేరు అన్న బాధ మరొకవైపు అనుకుంటుంది. రిషి సార్ నాతో పాటు రాలేదు. రావాలనిపించడం లేదా అనుకుంటూ ఉండగా ఇంతలో రిషి కారు వచ్చి ఆగుతుంది. రిషిని చూసిన వసుధార ఆశ్చర్యపోతుంది.

  అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీ ఊరు గురించి ఎన్నోసార్లు కథలు, కథలుగా చెప్పావు అని రిషి అంటే.. అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చూపిస్తాను సార్ అని అంటుంది వసుధార. అప్పుడు వసుధార చెప్పిన మాటలు రిషి అన్ని చెప్పడంతో వసుధార సంతోషపడుతుంది. వారిద్ధరు వెళ్తూ ఉండగా రిషికి దేవయాని ఫోన్ చేసి నువ్వు తొందరగా వెనక్కి వచ్చేసేయ్ అని అంటే.. సారీ పెద్దమ్మ వసుధారను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదని అంటాడు. దీంతో దేవయాని షాక్ అవుతుంది.

  English summary
  Guppedantha Manasu Serial December 21 2022 Today Full Episode 639..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X