Don't Miss!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- News
ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన నల్గొండవాసి అంశాల స్వామి కన్నుమూత; కేటీఆర్ ట్వీట్!!
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
Guppedantha Manasu: రిషిధార లవ్ జర్నీలో రొమాన్స్.. దేవయానిని చిత్రవధ చేసిన ధరణి!
వసుధార ఊరికి రిషితోపాటు కారులో కలిసి వెళ్తూ ఉంటుంది. రోడ్డు పక్కన కారు ఆపిన రిషి.. వాటర్ కోసం చూసుకుంటాడు. బాటిల్ లో నీళ్లు లేకపోవడంతో.. షాప్స్ వెతుక్కుంటారు. రిషి తొడిగిన రింగ్ చూసుకుంటూ మురిసిపోతూ రిషిని చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నావ్ అంటే.. నా రిషి సార్.. నా ఇష్టం అంటే రిషి కూడా అదే సమాధానం చెబుతాడు. ఆ తర్వాత మంచినీళ్ల కోసం ఓ షాప్ దగ్గర ఆగుతారు. నువ్ కూడా దిగు అని రిషి అంటే.. నాకేమైనా కొనిపెడతాను అంటేనే వస్తానంటుంది వసుధార. పర్స్ తీసి ఇచ్చేసి ఈ షాప్ మొత్తం కొనుక్కో అనగానే పర్సనే నావాడు అయినప్పుడు ఈ పర్స్ ఎందుకు సార్ అని నవ్వుతూ కారు దిగుతుంది వసుధార. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 23, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 641లో ఏం జరిగిందో చదివేసేయండి.

చరిత్ర ఆపు ఇవన్నీ తినేస్తాను..
వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత గోలీషోడా చూసి ఇది తాగుదాం అంటూ దాని చరిత్ర చెబుతుంది వసుధార. ఆ తర్వాత షోడా ఎలా కొట్టాలి. ఎలా తాగాలో క్లాస్ తీసుకుంటుంది. అనంతరం తాటితేగలు చూసి మురిసిపోయి మరోసారి క్లాస్ తీసుకుంటుంది వసుధార. దీంతో చేసేది లేక చరిత్ర ఆపు ఇవన్నీ తినేస్తానని చెబుతాడు రిషి. పల్లీలు, మొక్కజొన్న, కొబ్బరి బొండాలు, పానీ పూరీ, మిర్చీ బజ్జీ అంటూ ఇలా లెక్కపెడితే నా వేళ్లు అయిపోయాయని సెటైర్ వేస్తాడు రిషి. ప్రపంచంలో ఉన్నవన్నీ నాతో తినిపిస్తావా అప్పటివరకు నీకు ప్రశాంతత, మనశ్శాంతి ఉండదా అంటాడు రిషి. తర్వాత మళ్లీ కారులో ప్రయాణం సాగిస్తారు రిషిధార.

రగిలిపోయిన దేవయాని..
వసుధార ఊరు ఎంట్రన్స్ వద్ద కారు ఆపించి బోర్డ్ చూపిస్తూ మురిసిపోతుంది. అక్కడ సెల్ఫీలు దిగి ఎప్పటిలానే మళ్లీ రిషిని చూస్తూ మురిసిపోతుంటుంది వసుధార. చెరువుగట్టు, రాముడి గుడి, అడవి అంటూ గలగలా మాట్లాడుతుంటుంది. మళ్లీ కారులో బయలు దేరతారు. మరోవైపు వసుధారతో రిషి వెళ్లడం తలుచుకుని దేవయాని రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ధరణి. అది తాగి నేను టీ తాగుదాం అనుకున్నా నేను అని అంటుంది దేవయాని. అవునా, మీ మనసులో మాటలు నాకెల తెలుస్తాయి అత్తయ్యగారు. అన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు కదా అని సెటైర్ వేస్తుంది ధరణి.

సైలెంట్ గా చిత్రవధ చేస్తున్నావ్..
ధరణి మాటలకు నువ్వు కావాలని మాట్లాడుతున్నావో.. లేదో నాకు తెలియదు గానీ, ఈ కాఫీ కప్పు తీసుకుని వెంటనే వెళ్లిపో అని ఫైర్ అవుతుంది దేవయాని. ఎందుకు అంత చిరాకుగా ఉన్నారని ధరణి అడిగితే.. మరింత చిరాగ్గా మాట్లాడుతుంది దేవయాని. మరి టీ తీసుకుని రానా అని ధరణి అడిగితే.. నాకేం వద్దు.. నువ్వు సైలెంట్ గా చిత్రవధ చేస్తున్నావ్ వెళ్లిపో అని కసురుకుంటుంది దేవయాని. తర్వాత వసుధార ఎందుకు ఒక్కత్తే వెళ్లింది. పద్ధతిగా వెళ్లాలని ఆలోచించిందా.. గౌరవంగా పిలవాలని అనుకుందా.. లేదా నేను అనుకున్న ప్లాన్ వసుధార పసిగట్టిందా. అయినా నా మనసులో అనుకున్న ప్లాన్ వసుధారకు ఎలా తెలుస్తుందిలే. నేనంటే ఏంటో త్వరలో తెలిసేలా చేస్తాను అని అనుకుంటుంది దేవయాని.

అసలు బాలేదని ఎప్పుడైనా అన్నావా..
ఇక మరోవైపు కారులో వెళ్తున్న వసుధార సార్ ఈ అరటిపండు తింటారా అని అడగితే.. రెండు రోజుల వరకు నన్ను ఏం అడగొద్దు అంటాడు. ఇందులో గొప్పదనం అంటూ వసుధార మొదలు పెట్టగానే.. అరటి ఆకునుంచి మొదలు పెట్టి అన్నీ లిస్ట్ చెప్పేసిన రిషి.. ఇంకేమైనా ఉన్నాయా అని అంటాడు. అలా రిషి అంటే అరటి పీచు అని మొదలు పెడుతుంది వసుధార. దీంతో.. అమ్మా తల్లీ నువ్వు తిను అంటాడు. అరటిపండును ఆస్వాదిస్తూ బాగుంటుంది సార్.. అసలు బాలేదని ఎప్పుడైనా అన్నావా నువ్వు అని సెటైర్ వేస్తాడు రిషి. ఊర్లోకి ఎంటరైన వెంటనే తను చదువుకున్న కాలేజ్ చూపిస్తుంది. కాలేజీలో అరటి చెట్టు ఏమైనా నాటావా అక్కడకు వెళితే నాతో తినిపిస్తావా ఏంటీ అంటాడు రిషి. తర్వాత ఇద్దరూ చేయి చేయి పట్టుకుని కాలేజీ మొత్తం తిరుగుతారు.

అది ద్వేషం కాదు.. పెయిన్..
మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, కాలేజీని చాలా ఏళ్ల తర్వాత చూస్తే బాగుంటుంది కదా అని రిషి అంటే.. ఈ కాలేజీలో ఎన్నో జ్ఞాపకాలు అంటూ తన కలలు, జీవితం గురించి చెబుతుంది వసుధార. నా జీవితంలో అద్భుతమైన మలుపు జగతి మేడమ్ ని కలవడం అనగానే రిషి చేయి వదిలేస్తాడు. ఒక్కసారిగా డల్ అయిపోతాడు. జగతి మేడమ్ పై మీకు ఉన్న ద్వేషం పోదా సార్ అని అడుగుతుంది. వసుధార కోపం పోతుందేమో కానీ ద్వేషం అన్నావ్ చూడు.. అది ద్వేషం కాదు.. పెయిన్. కోపాలను, ద్వేషాలను కాలం కలిగిస్తుంది కానీ బాధను కాలం తగ్గించదు అంటాడు రిషి.

మనససు మార్చుకోలేను..
జగతి మేడమ్ మా డాడ్ కి ప్రాణం. డాడ్ అంటే నాకు ప్రాణం. డాడ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మేడమ్ పై నాకు కృతజ్ఞత ఉంది. ఎందుకంటే ఓ వైపు డాడ్ విషయంలో, ఇంకోవైపు ఈ ప్రేమబంధం పరోక్షంగా జగతి మేడమ్ ద్వారానే వచ్చింది కాబట్టి. ఓ బంధాన్ని వద్దనుకుంది. ఇంకో బంధాన్ని కలిపింది. ఈ విషయంలో మేడమ్ రుణం తీర్చుకోలేను. ఆ విషయంలో మనససు మార్చుకోలేను అని క్లారిటీగా ఇస్తాడు రిషి. జగతి ఇచ్చిన నల్ల పూసలు గుర్తుకు వచ్చి ఆ బాక్స్ వసుధారకు ఇస్తాడు రిషి. ఏంటీ సార్ అని వసుధార అడిగితే.. నేను చూడలేదని చెబుతాడు రిషి.