Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu: గౌతమ్ ను క్షమించిన రిషి, షాక్ లో మహేంద్ర.. వసును ఇరికించే పనిలో దేవయాని!
గౌతమ్ గురించి తండ్రి మహేంద్ర చెప్పుకుంటూ బాధపడతాడు రిషి. మహేంద్ర చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు. కానీ రిషి వినిపించుకోడు. గౌతమ్ నిజం దాచడం తప్పని చెప్పి వెళ్లిపోతాడు రిషి. తర్వాత గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. గౌతమ్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండగా వసుధార కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రిషి సర్ కోపం పోయి ఉంటుందా.. అని మనసులో అనుకుంటుంది వసుధార. రిషి వసుధారను చూసి ఏంటీ అని అడుగుతాడు. మరోవైపు మహేంద్రతో ఫోన్ లో మాట్లాడుతుంటాడు గౌతమ్. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 5, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 625లో ఏం జరిగిందో చదివేసేయండి.

అది మోసం కాదు గౌతమ్..
బ్యాగ్ సర్దుకుని అమెరికా వెళ్లిపోతున్నా అని మహేంద్రకు ఫోన్ లో చెబుతాడు గౌతమ్. వద్దని మహేంద్ర ఎంత చెప్పినా కూడా వినకుండా బాధపడతాడు గౌతమ్. మిమ్మల్ని నా ఫ్లాట్ లో ఉంచినందుకు వాడు నాతో ఇక మాట్లాడడు. అందుకే వెళ్లిపోతున్నా అని చెబుతాడు గౌతమ్. రిషి.. నన్ను అసహ్యించుకుంటున్నాడు. ఒక మోసగాడిలా చూస్తున్నాడు. నిజం దాచిపెట్టి వాడిని మోసం చేశాను కదా అందుకే దూరంగా వెళ్తున్నా అని గౌతమ్ అంటాడు. అది మోసం కాదు గౌతమ్.. మాకు సాయం అని మహేంద్ర చెప్పినా వినకుండా గౌతమ్ మాత్రం వెళ్లిపోతాను అని ఫోన్ పెట్టేస్తాడు.

పరిస్థితి ఎలా ఉండేదో..
గౌతమ్ బ్యాగులు తీసుకుని గది నుంచి బయటకు రాగానే.. ఎదురుగా రిషి, వసుధార ఉంటారు. ఎక్కడికో బయల్దేరావ్ ఎక్కడికి అని రిషి అడుగుతాడు. అమెరికాకు వెళ్తున్నావా అని అడుగుతాడు రిషి. నాకు చెప్పకుండా ఎలా వెళ్తావ్.. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ, ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే.. నేను నీకు ఏం కానా అని గౌతమ్ ని హగ్ చేసుకుంటాడు రిషి. దీంతో గౌతమ్ హ్యాపీ అవుతాడు. నిజాన్ని దాచిపెట్టి ఎంత బాధపడ్డానో అని గౌతమ్ మాట్లాడబోతుంటే.. నాకేమీ చెప్పొద్దు నాకు కోపం ఎంతో.. అంతకి వందరెట్లు ప్రేమ ఉంటుంది. డాడ్ వాళ్లు నీ దగ్గర కాకుండా వేరే వాళ్ల దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా అని రిషి అంటాడు.

షాక్ అయిన మహేంద్ర..
డాడ్ వాళ్లను నువ్ బాగా చూసుకున్నావని డాడ్ చెప్పారు. నిజం దాచడం తప్పు అందులో కోపం ఉంది. కానీ డాడ్ వాళ్లని బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్. కోపంలో చాలా తిట్టేశాను సారీ అని చెబుతాడు రిషి. అనంతరం రిషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర. అప్పుడే రిషి, వసుధారలు గౌతమ్ ను తీసుకుని ఇంటికి రావడంతో మహేంద్ర షాక్ అవుతాడు. గౌతమ్ ఇంట్లో మహేంద్ర మర్చిపోయిన వాచ్ ను తీసుకొచ్చి తండ్రికి పెడతాడు రిషి. డాడ్ వాళ్లు ఇల్లు వదిలి వెళ్లి గౌతమ్ వాళ్ల ఫ్లాట్ లో ఉన్నారని ఇంట్లో అందరికీ చెబుతాడు రిషి. ఇదే అవకాశంగా తీసుకున్న దేవయాని మీ ఇంట్లోనే పెట్టుకుని ఇలా చేయడం పద్ధతేనా అని సీరియస్ అవుతుంది.

నిజాన్ని దాయడం పెద్ద తప్పు..
గౌతమ్ ని దేవయాని తిట్టబోతుంటే.. రిషి అడ్డుపడతాడు. డాడ్ వాళ్లు ఇంకెక్కడో ఉండి ఉంటే ఎంతో కష్టపడే వాళ్లని అంటాడు రిషి. ఏంటీ గౌతమ్ ఇది నిజమేనా.. రిషి చిన్నప్పటి ఫ్రెండ్ వి నిజాన్ని దాచడం తప్పు కదా అని దేవయాని మళ్లీ తిట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో మేడమ్ వాళ్లు గౌతమ్ సర్ దగ్గర ఉండటం మనం సంతోషించాలి అని వసుధార అంటుంది. సంతోషం ఏంటి.. వీళ్లు వెళ్లడమే తప్పు నిజాన్ని దాయడం ఇంకా పెద్ద తప్పు అని దేవయాని అంటుంది. మేడమ్ వాళ్లు గౌతమ్ సర్ దగ్గర కాకుండా వేరే చోట ఉంటే క్షేమంగా వచ్చే వాళ్లు కాదేమో అని వసుధార అంటుంది.

ఇదంతా జగతి ప్లానా..
అంతా ప్లాన్ చేసుకుని వెళ్లారు. ఈ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. ఎవరికీ తెలుసు అని వసుధారను అంటుంది దేవయాని. అయిందేదో అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నాం. అక్కడ గౌతమ్ చూసుకున్నాడు అని రిషి అంటాడు. ఏంటో అన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారని అంటుంది దేవాయని. ఇదంతా జగతి ప్లాన్ అయి ఉంటుందని మనసులో అనుకుంటుంది దేవయాని. అలా అనుకుని జగతి దగ్గరకు వెళ్తుంది దేవయాని. జగతి వాటర్ బాటిల్ తీసుకుంటుంటే దేవయాని వచ్చి దాన్ని తీసుకుంటుంది. ఆరోగ్యం బాగుందా అని వెటకారంగా అడుగుతుంది దేవయాని.

మీ టూర్ గురించి వసుధారకు తెలుసా..
ఇంట్లో నుంచి వెళ్లిపోయి గౌతమ్ ఇంట్లో మకాం వేశారు. చాలా తెలివిగా చేశారని దేవయాని అంటుంది. ఆ మాట విని జగతి షాక్ అవుతుంది. అంతా తెలిసిందిలే.. మీ టూర్ గురించి వసుధారకు కూడా తెలిసే ఉంటుందని దేవయాని అంటే.. రిషి ఏమన్నాడని అడుగుతుంది జగతి. పెద్ద మనసుతో గౌతమ్ ను రిషి క్షమించేశాడని దేవయాని చెప్పేసరికి జగతి సంతోషపడుతుంది.