Don't Miss!
- News
‘భారత్ నెంబర్ 1 కావాలంటే.. రాజకీయ నేతలు, యువత ఆ దిశగా ఆలోచించాలి’
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu: కన్నీళ్లు పెట్టుకున్న వసుధార.. జగతి ఇచ్చిన సలహా ఏంటంటే?
వనభోజనాల్లో దేవయాని అరేంజ్ చేసిన కాలేజ్ స్టాఫ్ కావాలని వసుధారను టార్గెట్ చేస్తారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. ఆ మాటలు తలుచుకుంటూ చెట్టు కింద నిలబడి బాధపడుతుంది. గౌతమ్ ఇచ్చిన వార్నింగ్ తో కాలేజీ స్టాఫ్ వచ్చి వసుధారను క్షమాపణ అడిగి వెళతారు. ఇంతలో అక్కడికి ధరణి వెళ్లి ఏంటీ వసుధార ఇక్కడ ఉన్నావని అడిగితే.. ఏం లేదు మేడమ్ అని చెబుతుంది. తర్వాత మినిస్టర్ గారు వస్తున్నారంట రిషి పిలుస్తున్నాడు వెళ్దాం పదా అని అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 9, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 629లో ఏం జరిగిందో చదివేసేయండి.

వసుధార డల్ గా ఉండటంతో..
వన భోజనానికి వచ్చిన మంత్రిని రిషి, గౌతమ్ వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ రాలేదా అని మంత్రి అడిగితే.. కొన్ని పరిస్థితుల వల్ల రాలేదు సార్ అని చెబుతాడు రిషి. ఇంతలో అక్కడికి వసుధార రావడంతో.. ఏమ్మా నువ్వే కనిపించడం లేదని అనుకుంటున్నాను అని మినిస్టర్ అంటాడు. అప్పుడు వసుధార డల్ గా ఉండటాన్ని గమనిస్తాడు రిషి. మరోవైపు వసుధార నువ్ అన్నింట్లోనూ ముందు ఉంటావు కదా.. ఆటపాటలను నువ్వే చూసుకో అని మంత్రి అంటాడు. దీంతో సరే సార్ అని వసుధార అంటుంది. తర్వాత ఎందుకు అంత డల్ గా కనిపిస్తున్నావ్ అని రిషి అడిగితే.. ఏం లేదు సార్ అని వసుధార చెబుతుంది.

వసుధారను పట్టుకున్న రిషి..
వసుధార హుషారుగా ఉండాలి అంటే ఆటపాటలు మొదలు పెట్టాలని ధరణి అంటుంది. ఆ తర్వాత వసుధార ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా.. అక్కడికి గౌతమ్ వస్తాడు. వసుధార నువ్వు బాధలో ఉన్నావని తెలుసు.. కానీ స్టూడెంట్స్ కోసం, రిషి కోసం నువ్వు ఆడాలి. లేకపోతే.. రిషి బాధపడతాడు అని వసుధారకు నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళతాడు. తర్వాత అందరూ కలిసి తాడు లాగుతూ ఉంటారు. అమ్మాయిలు ఒకవైపు.. అబ్బాయిలు మరోవైపు తాడు లాగుతూ ఉంటారు. తాడు పోటీలో అబ్బాయిలు గెలుస్తారు. వసుధార కిందపడిపోతూ ఉండగా రిషి పట్టుకుంటాడు. మళ్లీ కాలేజ్ స్టాఫ్ గుసగుసలు పెట్టుకోవడం మొదలు పెడతారు. ఇలా బల ప్రదర్శన చేస్తే మగవారే గెలుస్తారు అందులో వింతేముంది అంటుంది ధరణి.

లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు..
పోటీల తర్వాత అందరినీ భోజనానికి రమ్మని పిలవడంతో అంతా వెళతారు. తినకుండా వసుధార ఆలోచిస్తూనే ఉంటుంది. అది గమనించిన గౌతమ్.. వసుధార బాధపడకు.. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. తిను అని చెబుతాడు. భోజనాల తర్వాత వసుధారను గమనించిన రిషి కూడా ఏమైంది ఎప్పటిలా లేవని అడుగుతాడు. తలనొప్పిగా ఉందని చెప్పడంతో టాబ్లెట్ తెప్పించమంటావా అన్నా వసుధార వద్దు అంటుంది. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు అని నచ్చజెపుతూ ఉంటాడు రిషి. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి.. త్వరగా వచ్చేయండి అని చెప్పేసి వెళ్లిపోతాడు.

నాతో శత్రుత్వం ఏంటీ..
అనంతరం వసుధార వచ్చి ఈ ఉయ్యాల్లో కూర్చో అని రిషి అనడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. వసుధారకు ఏమైంది, ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తాడు రిషి. వన భోజనాల తర్వాత అందరూ ఇంటికి వెళతారు. ఇంటికి వెళ్లాక వసుధార ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని జగతి అడుగుతుంది. ఎందుకు మేడమ్ ఎదుటి వ్యక్తుల గురించి ఇలా తప్పుగా మాట్లాడతారు అని వసుధార అంటే.. అవేమీ పట్టించుకోవద్దని జగతి అంటుంది. వాళ్లకు నాతో శత్రుత్వం ఏంటీ మేడమ్.. గుండెలు కోసేసేలా మాట్లాడుతారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార.

ఇంకా ఆలస్యం చేయకు వసుధార..
ఒకరి గురించి మాట్లాడేందుకు శత్రుత్వం ఏం అవసరం లేదు వసుధార. ఒక ఒంటరి అమ్మాయి వాళ్లకు టాపిక్ మాట్లాడుకోవడానికి దొరికింది. ఏమైనా మాట్లాడుకుంటారు. దానికి నువ్వు బాధపడకు. నువ్వు మీ ఊరికి వెళ్లు. మీ అమ్మా నాన్నలతో ధైర్యంగా మాట్లాడు. జరిగింది చెప్పు అని జగతి అనడంతో.. వసుధార షాక్ అవుతుంది. నేను ఎందుకు వెళ్లమంటున్నానో నాకు స్పష్టత ఉంది. ఇంకా ఆలస్యం చేయకు. ఊరికి వెళ్లు అని వసుధారకు చెబుతుంది జగతి. దీంతో వసుధార ఆలోచనలో పడిపోతుంది.