twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఇంట్లో వాళ్లకు పెద్ద షాక్ ఇచ్చిన రిషి.. పరువు తీస్తున్నాడన్న దేవయాని!

    |

    రిషి, వసుధార ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ బాధపడతారు. నువ్ నన్ను బాధపెట్టావ్ అంటే నమ్మలేకపోతున్నా. నాకన్న ఎక్కువ బాధపడతావ్ అనుకున్నా అని రిషి అంటాడు. తర్వాత తన చేతిపై డార్లింగ్ రిషి సార్ అని రాసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు రిషి. చేతి మీద రాతలు అంటే నీటి మీద రాతలు అని తెలుసుకోలేకపోయాని అని రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. అటువైపు వసుధార తన మెడలో ఉన్న తాళి దానికి ఉన్న వీఆర్ అక్షరాల ఉంగరం చూసి బాధపడుతుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 16 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 661లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఈ ఇంటికి ఇక రావా..

    ఈ ఇంటికి ఇక రావా..

    వీఆర్ అనే అక్షరాలు ఉన్న ఉంగరాన్ని కారులో రిషి తొడగటాన్ని గుర్తు చేసుకుంటుంది వసుధార. గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. మరోవైపు దూరం ఇంత భారమా వసుధార.. ఈ భారాన్ని భరించడం తన వల్ల కావడం లేదని రిషి అంటాడు. తర్వాత ల్యాప్ ట్యాప్ తీసుకుని ఏదో చేస్తాడు రిషి. తర్వాత తెల్లవారతుంది. ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అక్కడ బాల్కనీలో వసుధారతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటాడు. ఈ ఇంటికి ఇక రావా అని అనుకుంటాడు రిషి. ఇంతలో అక్కడికి జగతి కాఫీ తీసుకొస్తుంది. రిషి అని పిలిస్తుంది. ఇద్దరికి ఏం మాట్లాడాలో తెలియదు. అలా మౌనంగా ఉండిపోతారు. కాఫీ కప్పును టీపాయ్ పై పెట్టిన జగతి.. నువ్ పంపిన మెయిల్ చూశాను రిషి అని చెబుతుంది జగతి. తర్వాత వెళ్లిపోతుంది జగతి.

    కాలేజీ స్టాఫ్ ఇంటికొస్తున్నారు..

    కాలేజీ స్టాఫ్ ఇంటికొస్తున్నారు..

    ఇంట్లోకి జగతి వెళ్లేటప్పుడు దేవయాని ఎదురుపడుతుంది. అలా కొద్దిసేపు జగతిని.. రిషిని చూస్తుంది. తర్వాత రిషి దగ్గరికి వెళుతుంది దేవయాని. జగతి తీసుకొచ్చిన కాఫీ చూసి.. ఇలా కాఫీలు ఇచ్చి రిషికి దగ్గరవ్వాలని చూస్తున్నావా జగతి అని మనసులో అనుకుంటుంది దేవయాని. తర్వాత నాన్న రిషి రమ్మని పిలిచావ్ అని అడుగుతుంది. అప్పుడు కాలేజీ స్టాఫ్ ఇంటికి వస్తున్నారు. వాళ్లతో మీరు మాట్లాడండి పెద్దమ్మ అని దేవయానికి చెబుతాడు రిషి. కాలేజీ స్టాఫ్ ఇప్పుడు ఇంటికి ఎందుకు రిషి అని కంగారుగా అడుగుతుంది దేవయాని. అప్పుడు వాళ్లు వచ్చాక తెలుస్తుంది పెద్దమ్మ అని రిషి అంటాడు.

    ఈవిడే కదా మాట్లాడమంది..

    ఈవిడే కదా మాట్లాడమంది..

    అనంతరం రిషి ఇంటికి వాళ్ల కాలేజీ స్టాఫ్ అయిన ఇద్దరు మేడమ్స్ వస్తారు. వీళ్లిద్దరు రిషి, వసుధార గురించి తప్పుగా మాట్లాడినవారు. అప్పుడు ఈ భూషణ్ ఫ్యామిలీనే అంతా అని మేడమ్స్ మాట్లాడింది చూపిస్తారు. మీరు కాలేజీ లెక్చరర్స్.. అలాంటిది రిషి, వసుధార గురించి నోటికొచ్చినట్లు మాట్లాడరంట అని దేవయాని వాళ్లను తిడుతున్నట్లు నటిస్తుంది దేవయాని. ఒక అబ్బాయి, అమ్మాయి అలా కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు మాటలు అనేస్తారా. వసుధార, రిషి ఒక్కటి అవ్వాలనుకున్నారు. అయితే అది ఇప్పుడు కుదర్లేదు. దానికే అనరాని మాటలు అంటారా.. మనిషి బాధలో ఉంటే మీకు నచ్చినట్లు అనేస్తారా. మా రిషి మంచోడు కాబట్టి మిమ్మల్ని ఏం అనట్లేదు. వేరేవాళ్లు రిషి స్థానంలో ఉంటే మీ ఉద్యోగాలు తీసేసేవారు అని దేవయాని అంటుంది. దీంతో వసుధార గురించి అలా మాట్లాడమని చెప్పింది ఈవిడే కదా.. మళ్లీ ఇలా మాట్లాడుతుంది ఏంటని స్టాఫ్ మేడమ్స్ అనుకుంటారు.

    నా పరువు తీసేస్తున్నాడు..

    నా పరువు తీసేస్తున్నాడు..

    ఇంతలో జగతి కలుగజేసుకుని వీళ్లని పిలిపించి అడగటం వల్ల ప్రయోజనం ఏంటి. వసుధార కూడా ఇక్కడ లేదు అని అంటుంది. వసుధార ఇక్కడ లేకపోయినా తను అనుభవించిన బాధ నాకు గుర్తుంది. ఆ బాధేంటో నాకు తెలుసు. కాలేజీలో ఇంకా ఏ ఆడపిల్ల కూడా అలాంటి మాటలు పడకూడదు. అందుకే పిలిపించానని రిషి అంటాడు. నేనే వీళ్లను అలా మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు నేనే తిడుతున్నాను. ఇక వాళ్లకు నాపై ఏం నమ్మకం ఉంటుంది. రిషి తనకు తెలియకుండానే నా పరువు తీసేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది దేవయాని. తర్వాత క్షమాపణలు చెప్పి కాలేజీ స్టాఫ్ వెళ్లిపోతారు. వసుధారను అనే ధైర్యం వాళ్లకు లేదు.. వాళ్లతో ఈ మాటలు ఎవరు అనిపించారో నాకు తెలుసు అక్కయ్య అని మనసులో అనుకుంటుంది జగతి.

    వచ్చి అక్షింతలు వేస్తాం..

    వచ్చి అక్షింతలు వేస్తాం..

    మరోవైపు ఇంట్లో అమ్మా నాన్నలకు భోజనం తినిపిస్తుంటుంది వసుధార. చక్రపాణి తను చేసిన తప్పులను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటీ నాన్న ఇది అంటే సంతోషానికైనా, బాధకైన దేవుడి ఇచ్చింది కన్నీళ్లేనమ్మా అని చక్రపాణి అంటాడు. నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి నాకు ఇంత కాలం పట్టింది. వసుధార విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని చక్రపాణి అంటే.. వసు విషయంలో దేవుడు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు అని తల్లి సుమిత్ర అంటుంది. తర్వాత వసుధార బ్యాగ్ పక్కన కవర్ ఉంటుందని చెప్పి తీసుకురమ్మంటాడు చక్రపాణి. ఆ కవర్ లో టికెట్ ఉంటుంది. రిషి దగ్గరికి వెళ్లమని తండ్రి చెబుతాడు. పెళ్లి చేసుకుని పిలవాలని అనిపిస్తే పిలువు. వచ్చి అక్షింతలు వేస్తాం. లేదా పెళ్లయిందని కబురు పంపినా.. ఇక్కడ నా కూతురికి పెళ్లి అయిందని గొప్పగా చెప్పుకుంటాను అని చక్రపాణి అంటాడు.

    నా మనసు నుంచి ఎక్కడికి వెళ్లగలను..

    నా మనసు నుంచి ఎక్కడికి వెళ్లగలను..

    మట్టిలో మాణిక్యంలాగా పుట్టావ్. చదువులో గెలిచావ్. జీవితంలో గెలిచావ్. వెళ్లి నీ రిషి సార్ ని గెలువు అని చెబుతాడు చక్రపాణి. మరోవైపు లగేజ్ బ్యాగ్ తో ఇంట్లో వాళ్లందరికి షాక్ ఇస్తాడు రిషి. ఎక్కడికి రిషి అని దేవయాని అడుగుతుంది. వెళ్తున్నాను అని చెబుతాడు రిషి. ఎక్కడికి వెళ్తావ్ రిషి అని బాధగా తండ్రి మహేంద్ర అడుగుతాడు. కొన్నాళ్లు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను రిషి అంటే.. ఎక్కడికి రిషి.. పారిపోతున్నావా అని మహేంద్ర అంటాడు. మనుషుల నుంచి అయితే పారిపోగలను.. నా మనసు నుంచి ఎక్కడికి వెళ్లగలను అని రిషి అంటాడు. ఎవరో మోసం చేశారని దేవయాని అంటే.. పెద్దమ్మా.. ఎవరో మోసం చేశారని పారిపోయేంత పిరికివాడిని కాదు. నాకు నేనే నచ్చడం లేదు. నేను ఎవరో తెలియని చోటుకు వెళ్లి చెక్కిన శిల్పంలా వస్తాను. నేనే శిల్పం.. నేనే శిల్పిని అని అంటాడు రిషి.

    వస్తానో రానో తెలియదు..

    వస్తానో రానో తెలియదు..

    మరి కాలేజ్ ఎవరు చూసుకుంటారని ఫణీంద్ర అంటే.. జగతి మేడమ్ చూసుకుంటారు అని రిషి అంటాడు. ఈ విషయం గురించి జగతి మేడమ్ కి ఆల్రెడీ మెయిల్ చేశాను అని రిషి అంటే.. మెయిల్ చేస్తే సరిపోతుందా.. మినిస్టర్ గారు ఒప్పుకోవద్దా.. అని దేవయాని అంటుంది. అందుకు మినిస్టర్ గారికి కూడా మెయిల్ చేశాను. ఓకే అన్నారు అని రిషి చెబుతాడు. వెళ్లడం అవసరమా రిషి అని మహేంద్ర అడిగితే.. అత్యంత అవసరం డాడ్. నా గుండె బరువును మోయలేకపోతున్నాను. నేను ఎవరో తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాను. మళ్లీ కొత్తగా పుట్టినట్లు తిరిగివస్తాను అని రిషి చెబుతాడు. ఎప్పుడు వస్తావ్ అని మహేంద్ర అడిగితే.. ఏమో తెలియదు.. అసలు వస్తానో రానో కూడా తెలియదు అని రిషి సమాధానం చెబుతాడు.

    English summary
    Guppedantha Manasu Serial January 16 2023 Today Full Episode 661
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X