For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: తాళి కట్టింది ఎవరో నిజం చెప్పేసిన వసుధార.. ఉక్కిరిబిక్కిరి అయిన రిషి!

  |

  అమ్మా నాన్నలను ఇద్దరిని హత్య చేసేందుకు ప్రయత్నించందన్న కారణంతో వసుధార పోలీసు స్టేషన్ లో ఉంటుంది. ఎస్సై ద్వారా విషయం తెలుసుకున్న రిషి, మహేంద్ర-జగతి వచ్చి ఏమైందని అడుగుతారు. వసుధారతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ బావ రాజీవ్ అక్కడే ఉండటం చూసి, ఏం చేయలేక వాళ్లను అయిష్టంగా, కోపంతో వెళ్లిపోమ్మంటుంది. రాజీవ్ తో రిషి గొడవపుడుతుండగా వసుధార మెడలోని తాళి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. ఇదే తలుచుకుంటూ తనలో తానే మదనపడుతూ ఉంటాడు రిషి. మరోవైపు మహేంద్ర-జగతిలు రిషి కోసం కంగారు పడుతుంటారు. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 9 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 655లో ఇంకా ఏం జరిగిందంటే?

  రావడం వెళ్లడం నీ ఇష్టమేనా..

  రావడం వెళ్లడం నీ ఇష్టమేనా..


  దాబాలో వసుధార గురించి తీవ్రంగా ఆలోచించిన రిషి తర్వాత హాస్పిటల్ కు వెళతాడు. తర్వాత ఒక చోట కారు ఆపి వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా.. ఎన్ని కబుర్లు చెప్పావ్. ఎన్నో అందమైన మాటలు చెప్పావ్. కొత్త జీవితాన్ని చూపించి ఇప్పుడు వెళ్లిపోమ్మంటున్నావ్. నా జీవితంలోకి రావడం వెళ్లడం అంతా నీ ఇష్టమేనా వసుధార.. నువ్వు నన్ను మోసం చేశావా.. రిషిధారలో నుంచి రిషిని వదిలేశావా.. అని బాధపడతాడు రిషి. అనంతరం ఒక్కసారిగా అరుస్తాడు. ఇదంతా అర్థం కానీ రిషి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు.

  నా ఇష్టంతోనే పెళ్లి జరిగింది..

  నా ఇష్టంతోనే పెళ్లి జరిగింది..


  అయితే తాజాగా సోమవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎలాగైనా జరిగింది ఏంటో తెలుసుకోవాలనుకుని మళ్లీ వసుధార కోసం పోలీస్ స్టేషన్ కి వెళతాడు రిషి. వసుధార దగ్గరకు వెళ్లిన రిషి.. "ఒకే ఒక్క మాట చెప్పు వసుధార. ఆ తాళి ఎవరు కట్టారో చెప్పు" అని రిషి ఎంతో ఆవేదనగా అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగింది అంతా తలుచుకుంటూ ఉంటుంది. రిషిని ఊహించుకుంటూ ఆ తాళిని తన మెడలో వేసుకోవడం గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత "నా ఇష్టంతోనే ఈ తాళి నా మెడలో పడింది. మనస్ఫూర్తిగానే నాకు ఈ పెళ్లి జరిగింది. ఇక ఇంతతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. మీకు దండం పెడతాను సర్.. ఇక రాకండి" అని వసుధార కూడా ఎంతో బాధగా చెబుతుంది.

  ఉక్కిరిబిక్కిరి అయిన రిషి..


  వసుధారకు తన మనస్ఫూర్తిగానే పెళ్లి జరిగింది అని చెప్పడంతో రిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. వసుధార చెప్పింది నిజమే అయినా తను చెప్పిన విధానంతో మాత్రం రిషికి గుండె పగిలినంత పని అవుతుంది. తడబడిన అడుగులతో వెనక్కి ఎంతో బారంగా, బాధగా వెళ్లిపోతాడు రిషి. అదంతా రాజీవ్ విన్నట్లు ప్రోమోలో చూపించారు. అయితే వసుధార చెప్పిన మాటలు నమ్మి నిజంగానే రిషి వెళ్లిపోతాడా.. లేదంటే వసుధారపై ప్రేమతో ఇంకేమైనా చేస్తాడా అనేది చూడాల్సింది ఉంది. ఇక వసుధారకు రిషి తాళి కట్టలేదని తెలుసుకున్న రాజీవ్ కి మరో అవకాశం వచ్చినట్లయింది. అప్పుడు రాజీవ్ ఏం చేస్తాడు. రిషి వెళ్లిపోతే హాస్పిటల్ లో ఉన్న వసుధార తల్లిదండ్రులకు రాజీవ్ ద్వారా ముప్పు పొంచి ఉందా. అంతా తనకు అనుకూలంగా జరగడంతో దేవయాని ఏం చేయబోతుంది అనే తదితర ఆసక్తిర విషయాలు పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

  శనివారం నాటి ఎపిసోడ్ లో..

  శనివారం నాటి ఎపిసోడ్ లో..


  ఆస్పత్రిలో సుమిత్రకు ఉన్న ఆక్సీజన్ మాస్క్ తీసేస్తాడు రాజీవ్. దీంతో సుమిత్ర కాళ్లు చేతులు కొట్టుకుంటుంది. అది చూసిన రిషి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెడతాడు. డాక్టర్స్ ని పిలిచి ఆక్సిజన్ మాస్క్ ఎందుకు పెట్టలేదు. పేషెంట్ ను సరిగా చూసుకోరా అని అడుగుతాడు రిషి. ఎంత ఖర్చు అయిన సరే ట్రీట్మెంట్ ఇవ్వండి. వీళ్లకు ఎవ్వరు లేరనుకోకండి. నేనున్నాను అని రిషి అంటాడు. ఇదంతా చక్రపాణి వింటాడు. రిషి సార్ వజ్రం.. మంచి మనసున్న మనిషి అని వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు తండ్రి చక్రపాణి. అప్పుడు చక్రపాణి కళ్లు కొద్దిగా కన్నీటితో కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే రిషి మంచితనం, రాజీవ్ నిజ స్వరూపం చక్రపాణికి తెలిసినట్లే అనిపిస్తుంది. డాక్టర్స్ తో రిషి మాట్లాడుతుండగా.. రాజీవ్ వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని రిషిని రాజీవ్ అడిగితే.. వీళ్లను చూసుకునే బాధ్యత నాకు ఉందని రిషి అంటాడు.

  నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా..

  నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా..

  ఆస్పత్రిలో రాజీవ్, రిషి ఇద్దరు గొడవపడతారు. నీ కారణంగానే వసుధార జైలుకు వెళ్లింది. నిన్ను చూస్తే మావయ్య గుండెపోటుతో.. అత్తయ్య ఉరి వేసుకుని చనిపోతుంది అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు రాజీవ్. తర్వాత ఇద్దరిని చూసి డాక్టర్ వారిస్తాడు. వీళ్ల దగ్గర ఇద్దరు సెక్యూరిటిలను పెట్టండి అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు హోటల్ రూమ్ లో రిషి పరిస్థితిని చూసి బాధపడిపోతుంటారు జగతి-మహేంద్ర. మహేంద్ర నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా రిషికి ఎవరు ధైర్యం చెబుతారని జగతి అంటుంది. వసుధార రావడంతో రిషి జీవితంలో చాలా మార్పు వచ్చింది. అన్ని గాయాలను వసుధార ప్రేమ నయం చేసింది అని మహేంద్ర అంటాడు. మరోవైపు ఒక దగ్గర నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు రిషి.

  English summary
  Guppedantha Manasu Serial January 9 2023 Today Full Episode 655
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X