twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ధరణి మాటలతో దేవయానికి టెన్షన్.. వసుధారకు నిజం చెప్పేసిన జగతి!

    |

    హాస్పిటల్ లో తనపై రిషి కోప్పడటం అంతా ఊహ అని తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు గౌతమ్. మరోవైపు ఇంట్లో సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటాడు ఫణీంద్ర. ఇంతలో అక్కడికి వచ్చిన ధరణి.. అత్తయ్యగారికి ఎలా ఉంది. డాక్టర్ ఏమంటున్నారు. ఎప్పుడు పంపిస్తామన్నారని అడుగుతుంది. డిశ్చార్జ్ చేశారంట ధరణి.. వస్తున్నారని చెబుతాడు ఫణీంద్ర. నేను బాగా ఎదురుచూస్తున్నాను అని ధరణి అంటే.. నేను కూడా అని ఫణీంద్ర అంటాడు. అందరికన్నా ఎక్కువగా నేను ఎదురుచూస్తున్నాను అంటూ ఎంట్రీ ఇస్తుంది దేవయాని. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 29, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 620లో ఏం జరిగిందో చదివేసేయండి.

     అసలు ఎందుకు వెళ్లారో..

    అసలు ఎందుకు వెళ్లారో..

    అందరికన్నా ఎక్కువగా తాను ఎదురచూస్తున్నాను అని చెప్పిన దేవయాని.. వాళ్లు ఇంటికొస్తున్నారంటే సంబరాలు చేస్తావా, ఉత్సవాలు చేస్తావా. ఎగిరిపోయిన పక్షులు గూటికి చేరుతున్నారు అని ధరణితో అంటుంది దేవయాని. అదేంటి అలా మాట్లాడతావు. అయినా వాళ్లు రాగానే అసలు ఎందుకు వెళ్లారో అడిగి తెలుసుకుంటాను. రిషిని ఇంత బాధపెట్టారు అని ఫణీంద్ర అంటాడు.

    మీరు అడిగితే మాత్రం చెబుతారా ఏంటీ.. అయినా వెళ్లిపోయిన వారని కారణాలు అడగటం అవసరమా అని దేవయాని అంటుంది. అందుకు కాలేజీలో అడుగుదామనుకున్నా ఇంటర్వ్యూ హడావుడిలో అడగలేదు. హాస్పిటల్ లో అడగలేను. ఇంటికి వచ్చాక అడిగి తెలుసుకుంటాలే అని ఫణీంద్ర అంటాడు.

    నిప్పు లేనిదే పొగ రాదు కదా..

    నిప్పు లేనిదే పొగ రాదు కదా..

    కొద్దిసేపటికి ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత చిన్నత్తయ, చిన్న మావయ్య వెళ్లడానికి కారణం మీరే అని తెలిస్తే అని అమాయకంగా అంటంది ధరణి. నావల్ల వెళ్లడం ఏంటి.. నావల్ల వెళ్లామని నీకు చెప్పారా.. ఏంటీ ధరణి నువ్వు.. వాళ్లు చెబుతారో లేదో తెలియదు కానీ, వాళ్లకన్నా ముందే నువ్వు చెప్పేలా ఉన్నావ్ అని దేవయాని అంటుంది. దీనికి నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా అని ధరణి అంటుంది. అత్తాకోడళ్లు అంటే ఎలా ఉండాలి.. ఫ్రెండ్స్ లా కలిసిపోయి ఉండాలి. అందులో నా ప్రమేయం లేదని సపోర్ట్ చేయాలి. కానీ, నువ్వే చెప్పకూడదు. ధరణి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ ఓకేనా.. అని దేవయాని అంటుంది.

    సమాధానం చెప్పలేను..

    సమాధానం చెప్పలేను..

    దేవయాని అలా అనడంతో మీరు అవసరానికి భలే మాట్లాడతారు అని మనసులో అనుకుంటుంది ధరణి. ఏదేమైనా ఏదో జరగబోతోందని భయం వేస్తోంది అత్తయ్య గారు అని ధరణి అంటుంది.. ఏం జరగదు. నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలు అని దేవయాని చెబుతుంది. మరోవైపు జగతికి వసుధార సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు వసుధార ఇవన్నీ అనడంతో మీకు సేవ చేసుకోనివ్వండి మేడమ్ అని వసుధార అంటుంది. మేడమ్ ఈ మధ్య మీ మాటలు, మీ ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏం అర్థం కావడం లేదని వసుధార అంటుంది. కొన్ని ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పలేం వసు. కొన్ని కొన్నిసార్లు కొన్ని బాధ్యతలకు ఇంకొందరిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని జగతి సమాధానం ఇస్తుంది.

    మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా..

    మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా..

    మీరు ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎలా ఉన్నారో అని చాలా టెన్షన్ పడ్డాం. బాధపడ్డాం మేడమ్ అని వసుధార అంటే.. మేము వెళ్లామని మీరు బాధపడుతున్నారు కదా.. మేము అక్కడ ఎంత బాధపడి ఉంటామే మీకేం తెలుసు వసుధార అని జగతి అంటుంది. మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా అని వసుధార అడుగుతుంది. కారణాలు అడగొద్దు. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కదా అని అంటుంది జగతి. దీనికి ఏం సర్దుకున్నాయి మేడమ్..రిషి సార్, మహేంద్ర సార్ ని వదిలి హాస్పిటల్ నుంచి వెళ్లాలి అంటేనే భయపడుతున్నారని వసుధార అంటుంది. అనంతరం భార్య ఎలా ఉండాలో చెబుతుంది జగతి.

    నేను వెళ్లగొట్టబడ్డాను..

    నేను వెళ్లగొట్టబడ్డాను..

    ఇంత చెబుతున్న నేను అప్పుడు రిషిని ఎందుకు వదిలేసి వెళ్లానని అడుగుతావేమో.. నేను వెళ్లలేదు.. వెళ్లగొట్టబడ్డాను అని చెబుతుంది జగతి. రిషి అడిగితే నా నోటి నుంచి నో అనే మాట రాదు. అందుకే నీ ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ పెట్టగానే ఆగలేక వచ్చేశానని చెప్పడంతో వసుధార చాలా సంతోషపడుతుంది. తర్వాత ఇద్దరు రిషిని పొగుడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రిషి, మహేంద్ర వస్తారు. డాక్టర్ తో మాట్లాడాను డిశ్చార్జ్ చేస్తానన్నారని జగతికి మహేంద్ర చెప్పడంతో సంతోషిస్తుంది. అక్కడికి వచ్చిన గౌతమ్ ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి అని అనడంతో బిల్ కట్టావా అని అడుగుతాడు రిషి.

    నువ్వెప్పుడు రిషిని వదులుకోవద్దు..

    గౌతమ్ ని రిషి బిల్ కట్టావా అని అడిగితే లేదురా అని అంటాడు. దీంతో ఇదిగో నా కార్డుతో కట్టు అని మహేంద్ర అంటే.. వద్దు నా కార్డుతో బిల్ కట్టేసెయ్ అని గౌతమ్ కి కార్డు ఇస్తాడు రిషి. అది చూసి జగతి చాలా సంతోషిస్తుంది. మేడమ్ మీరు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మీకోసం ఒక స్పెషల్ గా నర్సుని పెడదామనడంతో సరే రిషి అని కొడుకువైపు చూస్తూ ఉంటుంది జగతి. రిషి నాకు దూరమైన వసు నువ్వెప్పుడు వదులుకోవద్దని జగతి మనసులో అనుకుంటే.. ఈ జెంటిల్ మెన్ ని ఎప్పటికీ వదులుకోనని వసుధార అనుకుంటుంది. అనంతరం అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. రిషి, వసుధార కలిసిపోయారని మురిసిపోతుంటుంది జగతి.

    English summary
    Guppedantha Manasu Serial November 29 2022 Today Full Episode 620..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X