For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 26 Episode: జగతి గురించి నిజం తెలుసుకున్న రిషి.. ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి!

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫణేంద్ర, మహేంద్ర, వసుధారలు బలవంతం చేయడంతో పుట్టినరోజు వేడుకలు జరపడానికి జగతి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ, దీనికి రిషి మాత్రం అంగీకరించడు. శిరీష్ అర్జెంట్ పని మీద వెళ్లిపోవడంతో వసు.. రిషితో కలిసి బేకరీకి వెళ్తుంది. ఆ సమయంలో పుట్టినరోజు ఎవరిదో తెలుసుకోకుండానే తన తల్లి జగతి కోసం కేక్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు రిషి.

  రిషి నుంచి తప్పించుకున్న వసుధార

  రిషి నుంచి తప్పించుకున్న వసుధార

  కేక్ మీద ఏ పేరు రాయాలన్న సస్పెన్స్‌తో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. బేకరీ అతను అడగ్గానే రిషి అసలు పుట్టినరోజు ఎవరిది? అని వసుధారను అడుగుతాడు. ఆమె ఏం చెప్పకుండా నసుగుతుంది. అంతలో రిషికి ఫోన్ వస్తుంది. దీంతో అతడు పక్కకు వెళ్తాడు. అప్పుడు వసుధార ఒక పేపర్ మీద జగతి పేరును రాసి ఇస్తుంది. దీంతో వసుధార తెలివిగా తప్పించుకుంటుంది.

  Intinti Gruhalakshmi July 26th Episode: నందూ తండ్రికి గుండెపోటు.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్

  చీరతో బుక్కైన మహేంద్ర.. ఇంట్లో రచ్చ

  చీరతో బుక్కైన మహేంద్ర.. ఇంట్లో రచ్చ

  జగతికి కొన్న చీరను ధరణికి చూపిస్తాడు మహేంద్ర. అప్పుడు రిషి దాన్ని చూసి తండ్రిని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె పుట్టినరోజు అని తెలుసుకుంటాడు. అప్పుడు మనసులో వసుధార తనను మోసం చేసిందని అనుకుంటాడు. ఆ తర్వాత చీర విషయంలో పెద్ద గొడవ చేస్తాడు. అప్పుడు దేవయాని కూడా రావడంతో గొడవ పెద్దదవుతుంది. దీంతో రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  రిషి కేక్ సెలెక్ట్ చేయడంపై జగతి హ్యాపీ

  రిషి కేక్ సెలెక్ట్ చేయడంపై జగతి హ్యాపీ

  ఇంటికి వచ్చిన వసుధార.. జగతికి తాను తీసుకొచ్చిన కేక్ ఫొటోలను చూపిస్తుంది. అప్పుడామె తనకెంతో నచ్చిందని మెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఈ కేక్‌ను సెలెక్ట్ చేసింది రిషి సార్ అని చెబుతుంది. దీంతో జగతి ఎంతగానో సంతోషిస్తుంది. అనంతరం ‘నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే రిషి నీ మీద అరుస్తాడేమో' అని అంటుంది. అప్పుడు వసుధార ఆమెకు ధైర్యం చెబుతుంది.

  కోపంగా వచ్చిన రిషి.. మోసం చేశావని

  కోపంగా వచ్చిన రిషి.. మోసం చేశావని

  వసుధార, జగతి మధ్య సంభాషణలు జరుగుతోన్న సమయంలోనే రిషి ఫోన్ చేస్తాడు. ‘ఏంటి వసుధార ఎవరిదో పుట్టినరోజు అని నాకు చెప్పకుండా మోసం చేస్తావా?' అంటూ కోప్పడతాడు. అంతేకాదు, ఇంటి ముందు ఉన్నా బయటకు రమ్మంటాడు. అప్పుడు ఆమె రానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. దీంతో రిషి కోపంతో రగిలిపోతుంటాడు.

  రిషిని వెంట తీసుకుని వెళ్లిన మహేంద్ర

  రిషిని వెంట తీసుకుని వెళ్లిన మహేంద్ర

  ఎన్నిసార్లు ఫోన్ చేసినా వసుధార లిఫ్ట్ చేయకపోవడంతో రిషి ఏకంగా జగతి ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అవుతాడు. అంతలో మహేంద్ర అక్కడకు వచ్చి కొడుకును కారులో తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో రిషికి ఎన్నో మంచి మాటలు చెబుతాడు. కానీ, అతడు మాత్రం కోపంతో ఊగిపోతూనే ఉంటాడు. అప్పుడు ‘మీరంటే గౌరవం డాడ్.. అందుకే వస్తున్నా' అని మహేంద్రతో చెబుతాడు.

  తన కోసం చేస్తున్నా... అది నీ ఇష్టమే

  తన కోసం చేస్తున్నా... అది నీ ఇష్టమే

  ఎంత చెప్పినా రిషిలో కోపం తగ్గకపోవడంతో మహేంద్ర కారును ఆపుతాడు. అప్పుడు ‘జగతి నాకు ఎదురైన తర్వాత తెలిసిన బర్త్‌డే ఇది. నేను తన కోసం చేస్తున్న సెలెబ్రేషన్స్ ఇవి. మిషన్ ఎడ్యూకేషన్ గురించి ఐడియా ఇచ్చిన తనను సన్మానించడం నా కోరిక. అర్థం చేసుకో రిషి. నువ్వు ఆ పార్టీకి వస్తావా? రావా? అన్నది మాత్రం నీ ఇష్టం' అని సర్ధి చెప్పి ఇంటికి వెళ్లిపోతాడు.

  యాంకర్ సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్: వయసు పెరిగినా తీరు మారలేదు.. చాలా అసూయ అంటూ!

  వసును అనుమానించిన దేవయాని

  వసును అనుమానించిన దేవయాని


  ఉదయం అవ్వగానే వసుధార.. రిషి ఇంటికి వస్తుంది. అప్పుడు ధరణి ‘ఇంత పొద్దున్నే వచ్చావేంటి వసు' అని అడుగుతుంది. దానికి ‘రిషి సార్ రమ్మన్నారు' అని బదులిస్తుంది. ఆ తర్వాత దేవయాని వచ్చి ‘నీ తీరు నాకు నచ్చడం లేదు. వాడు రమ్మంటే వచ్చేస్తావా? అయినా రూమ్‌లోకి వెళ్లిపోతున్నావేంటి' అని అడుగుతుంది. అప్పుడు రిషి వచ్చి వసును లోపలికి తీసుకెళ్తాడు.

  English summary
  Guppedantha manasu Serial Episode 199: Rishi has Knows The Truth about Birthday Celebrations. Then He Argue with his Father. After That Rishi Went Jagathi House for Fight with Vasudhara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X