twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hanu-Man సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ కంటే పవర్‌ఫుల్.. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ: ప్రశాంత్ వర్మ

    |

    టాలీవుడ్‌లో సక్సెస్‌పుల్ చిత్రాలతో దూసుకెళ్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హను మాన్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. యువ హీరో తేజా సజ్జా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లోని ఏంఎంబీ మాల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా హనుమాన్ శ్లోకాన్ని చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏం మాట్లాడారంటే?

     హనుమంతుడు కంటే గొప్ప సూపర్ హీరో: తేజా సజ్జా

    హనుమంతుడు కంటే గొప్ప సూపర్ హీరో: తేజా సజ్జా

    తేజా సజ్జా మాట్లాడుతూ.. మనకు హనుమంతుడు కంటే గొప్ప సూపర్ హీరో ఉన్నారా? వాయువు కంటే వేగంగా ప్రయాణించే శక్తి హనుమంతుడికే ఉంది. శ్రీరాముడి దూతగా ఉన్న హనుమంతుడి కంటే గొప్ప సూపర్ హీరో ఎవరు? అని అన్నారు. మన తరంలోని పిల్లలకు స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ మాత్రమే సూపర్ హీరోలు. ఎందుకంటే వారిని సినిమాల్లో చూపిస్తారు కాబట్టిది. ఆ సూపర్ హీరోలు కేవలం కల్పితాలు. హనుమంతుడు నిజమైన సూపర్ హరో. మన సంస్కృతికి, చరిత్రలో నిజమైన హీరో అంజనేయుడు అని అన్నారు.

     నన్ను నమ్మిందనుకు థ్యాంక్స్: తేజా సజ్జా

    నన్ను నమ్మిందనుకు థ్యాంక్స్: తేజా సజ్జా

    హనుమాన్ సినిమాలోని పాత్ర కోసం నన్ను నమ్మిందనుకు, ఆ పాత్రకు న్యాయం చేస్తానని భావించినందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్. ఆయనతో నాకు రెండో సినిమా. ప్రశాంత్ గొప్ప ఫిల్మ్ మేకర్. ప్రతీ రోజు చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఈ సినిమా కోసం చాలా నిజాయితీతో పనిచేశాం. ఈ సినిమాను బాగా ప్రేమించి.. సహకారం అందించిన నిర్మాత నిరంజన్ ప్యాషన్ చూస్తే ముచ్చటేసింది. ఆయనకు గొప్ప విజయం లభించాలి అని తేజా సజ్జా చెప్పారు.

     కథను నమ్మిన నిరంజన్ రెడ్డికి థ్యాంక్స్

    కథను నమ్మిన నిరంజన్ రెడ్డికి థ్యాంక్స్


    హను మాన్ టీజర్ ఆవిష్కరించిన తర్వాత ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. జై శ్రీరామ్. బాల్యం నుంచే నాకు హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరుతో ఇలాంటి గొప్ప సినిమాను చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. ఇలాంటి కథతో పెద్ద సినిమాను నిర్మించాలంటే.. నిర్మాత నమ్మాలి. ఈ కథను నమ్మిన నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్యకు థ్యాంక్స్. ఈ సినిమా ప్రారంభించినప్పటి కంటే.. 4, 5 రెట్లు పెరిగింది అని తెలిపారు.

     ప్యాన్ వరల్డ్ సినిమా ఇది..

    ప్యాన్ వరల్డ్ సినిమా ఇది..


    హనుమాన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయి‌లో నిర్మించమని నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రోత్సహించారు. హనుమాన్ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా. ప్రపంచంలోనే హనుమాన్ అతిపెద్ద సూపర్ హీరో. సూపర్ మాన్, బ్యాట్ మ్యాన్ కంటే పవర్‌ఫుల్.. మార్వెల్, డీసీ సూపర్ హీరో యూనివర్స్ కంటే మనకు గొప్ప సూపర్ హీరోలు ఉన్నారు అని ప్రశాంత్ వర్మ చెప్పారు.

    తేజా సజ్జానే ఎందుకు తీసుకొన్నా అంటే..

    తేజా సజ్జానే ఎందుకు తీసుకొన్నా అంటే..


    తేజ సజ్జాతో ఇంతకు ముందు జాంబిరెడ్డి చేశాను. బాలనటుడిగా నాకు బాగా తెలుసు. జాంబిరెడ్డితో మెయిస్ట్రీమ్ యాక్టర్ అయ్యారు. ఆ తర్వాత అద్బుతం సినిమాతో తనకు తాను నిరూపించుకొన్నాడు. హనుమాన్ సినిమాలో తేజా సజ్జానే ఎందుకు తీసుకొన్నావని అడిగారు. నా సినిమా కోసం అండర్ డాగ్ లాంటి నటుడు కావాలి. తేజ నా కథకు సరిగ్గా సరిపోయే హీరో అనుకొన్నాను.అతడు ఇంకా యాక్టర్‌గా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ప్రశాంత్ వర్మ అన్నారు.

    English summary
    Creative director Prashanth Varma is coming up with original Indian superhero film Hanu-Man. This is his second movie with the talented hero Teja Sajja, after the blockbuster Zombie Reddy. K Niranjan Reddy of PrimeShow Entertainment is producing the movie. In this occassion, Prashanth Varma says, Hanu Man more powerful than Superman and Batman, Its to be a Pan world film:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X