For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. ఎన్నో టాలెంట్లు ఉన్న అతడు.. ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తెగ సందడి చేస్తున్నాడు. దీంతో అతడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుడిగాలి సుధీర్ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి రికార్డులు, రెమ్యూనరేషన్, నికర విలువ గురించి తెలుసుకుందాం!

  అక్కడి నుంచి జబర్ధస్త్‌లోకి ఎంట్రీ

  అక్కడి నుంచి జబర్ధస్త్‌లోకి ఎంట్రీ

  సుడిగాలి సుధీర్ మ్యాజిక్‌ షోలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే పలు చానెళ్లలో కూడా ట్రిక్స్‌ను చూపించే గేమ్ షోలను చేశాడు. అలా తెలుగు ప్రేక్షకుల గుర్తింపును అందుకున్నాడు. ఆ సమయంలోనే వేణు వండర్స్ టీమ్ ద్వారా జబర్ధస్త్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా వచ్చిన చాలా తక్కువ టైమ్‌లోనే టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను పట్టేసి సత్తా చాటేశాడు.

  యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

  యాంకర్ రష్మీతో సుధీర్ లవ్ ట్రాక్

  యాంకర్ రష్మీతో సుధీర్ లవ్ ట్రాక్

  తన టాలెంట్లతో సుడిగాలి సుధీర్ ఎంతలా పాపులర్ అయ్యాడన్నది పక్కన పెడితే... యాంకర్ రష్మీ గౌతమ్ కారణంగా మాత్రం బాగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తల వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు.

  సినిమాల్లోనూ సత్తా... హీరోగా ఫ్లాప్

  సినిమాల్లోనూ సత్తా... హీరోగా ఫ్లాప్

  సుడిగాలి సుధీర్ చాలా కాలం క్రితమే సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. అయితే, హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి. అయినా ప్రస్తుతం 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.

  మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్

  ఆ షోలకు గ్యాప్.. మరో ఛానెల్‌లో

  ఆ షోలకు గ్యాప్.. మరో ఛానెల్‌లో

  సుడిగాలి సుధీర్ సుదీర్ఘ కాలంగా ఈటీవీలోనే భాగం అయ్యాడు. అయితే, ఈ మధ్య కాలంలో అతడు 'ఢీ' షో నుంచి దూరం అయ్యాడు. అలాగే, గత వారం నుంచే 'జబర్ధస్త్‌'లోనూ మానేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కమెడియన్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోకు హోస్టుగా చేస్తున్నాడు. అంతేకాదు, స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సింగింగ్ షోకు కూడా యాంకర్‌గా చేస్తున్నాడు.

  జబర్ధస్త్‌లో ఎక్కువ తీసుకుంటూ

  జబర్ధస్త్‌లో ఎక్కువ తీసుకుంటూ

  సుడిగాలి సుధీర్‌కు ఎన్నో ఛానెళ్ల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, అతడు మాత్రం జబర్ధస్త్‌ షోను వీడడం లేదు. దీనికి కారణం అందరి కంటే అతడికే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్‌ ఇవ్వడమేనట. తాజా సమాచారం ప్రకారం... ఒక్కో ఎపిసోడ్‌కు సుధీర్‌ టీమ్‌‌కు జబర్ధస్త్‌ వాళ్లు రూ. 5 లక్షలు ఇస్తున్నారట. అలా ఒక నెలకు సుధీర్ రూ. 5 - 6 లక్షల వరకూ రాబడుతున్నాడు.

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  ఆ షోలకు ఎంతెంత వస్తుందంటే

  ఆ షోలకు ఎంతెంత వస్తుందంటే

  సుడిగాలి సుధీర్ జబర్ధస్త్‌తో పాటు 'ఢీ' షోలో మెంటర్‌గా, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్‌గా చేస్తున్నాడు. 'ఢీ' షోకు గానూ అతడు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 1.50 లక్షలు తీసుకునే వాడట. అలాగే, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల ఛార్జ్ చేస్తాడట. ఈ రెండు షోలు ద్వారా నెలకు రూ. 10 లక్షలు ఆర్జిస్తున్నాడని సమాచారం.

  సినిమాల రెమ్యూనరేషన్ డీటేల్స్

  సినిమాల రెమ్యూనరేషన్ డీటేల్స్

  షోల ద్వారా నెలకు దాదాపు రూ. 20 లక్షలు వరకూ సంపాదిస్తోన్న సుడిగాలి సుధీర్.. సినిమాల చేసే చిన్న చిన్న పాత్రలకు రూ. 2 - 3 లక్ష వరకూ తీసుకుంటాడట. ఇక, హీరోగా చేసే సినిమాలకు మాత్రం ఏకంగా రూ. 30 - 40 లక్షలు వెనకేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అతడు.. ఇప్పుడు ఏకంగా రెండు మూడు చిత్రాల్లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  సుడిగాలి సుధీర్ నికర ఆదాయం

  సుడిగాలి సుధీర్ నికర ఆదాయం


  సుడిగాలి సుధీర్‌కు హైదరాబాద్‌లో రెండు ఇళ్లులు ఉన్నాయి. ఈ రెండింటి విలువ దాదాపు రూ. 2 - 3 కోట్లు ఉంటుందట. ఇక, అన్ని షోలకు కలిపి సుడిగాలి సుధీర్ ఒక ఏడాదికి రూ. 2 - 3 కోట్లు ఆదాయాన్ని అందుకుంటున్నాడట. అలాగే, సినిమాల ద్వారా కూడా రూ. 1 - 1.50 కోట్లు సంపాదిస్తున్నాడట. మొత్తంగా ఏడాదికి అతడు రూ. 4 - 5 కోట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడట.

  యాంకర్‌గా, కమెడియన్‌గా, హీరోగా ప్రేక్షకులను అలరిస్తోన్న సుడిగాలి సుధీర్.. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు ఫిల్మీబీట్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

  English summary
  Comedian Sudigali Sudheer Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know His Assets and Remuneration Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X