For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam పీక పిసికి చంపేస్తా.. మోనిత‌కు దీప మరోసారి జబర్దస్త్ వార్నింగ్

  |

  డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్బంగా కార్తీక్‌ను టార్గెట్ చేసుకొని మోనిత షాకింగ్‌గా కామెంట్లు చేయడంతో అందరూ కంగారుపడిపోయారు. తనను పెళ్లి చేసుకొంటానని చెప్పి మోసగించిన వ్యక్తికి అధ్యక్ష పదవులు కట్టబెడుతారు. అన్యాయం జరిగిన నాకు న్యాయం చేయరా అంటూ మోనిత స్టేజ్‌పై తన వాదనలను బలంగా వినిపించేందుకు ప్రయత్నించారు. అయితే కార్తీక్‌పై మోనిత చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించలేని దీప.. ఆమె మాటలకు అడ్డుపడుతూ చప్పట్లు కొడుతూ స్టేజ్ పైకి వెళ్లారు. మైక్ ముందు నిలుచున్న మోనితన పక్కకు జరిపి మాట్లాడటం ప్రారంభించారు. కార్తీకదీపం సీరియల్‌లో డిసెంబర్ 2వ తేదీ 1212 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  బంగారం ఎక్కువ శబ్దం చేయదు అంటూ

  బంగారం ఎక్కువ శబ్దం చేయదు అంటూ

  మోనిత మాటలకు అడ్డుపడుతూ నేను డాక్టర్ కార్తీక్ భార్యను. ఎందుకంటే తాళి కట్టి చేసుకొన్నందున భార్యను అని చెప్పాల్సి వస్తున్నది. ఈ వేదిక డాక్టర్లు మాత్రమే మాట్లాడాలి. కానీ కొందరు ఆరోపణలు, అవాకులు, చెవాకులు పేలుతున్న వారికి సమాధానం చెప్పాలి. ఈ మోనిత గారు.. వేదిక మీద చాలానే మాట్లాడారు. కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటారు. బంగారం మాత్రం ఎక్కువగా శబ్దం చేయదు. మోనిత చెప్పినవన్నీ అందమైన అబద్దాలు. కార్తీక్, మోనితకు మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది. ఇద్దరు డాక్టర్లు. ఆ చనువుతో ఆమె ఇంటికి వెళ్లి ఉంటారు అని దీప చెప్పడంతో మోనిత కంగారుపడిపోయింది.

  కిడ్నాపులు, మనుషుల మాయం అంటూ

  కిడ్నాపులు, మనుషుల మాయం అంటూ

  నాకు, నా భర్త కార్తీక్‌కు అపోహలు, మనస్పర్ధలు వచ్చాయి. కానీ అవన్నీ కొందరు కల్పించినవే. భార్యాభర్తల మధ్య అలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు నేను మా వారు కలిశాం. సంతోషంగా ఉన్నాం. ఒళ్లు కొవ్వెక్కి, కళ్లు నెత్తికి ఎక్కి తాను ఆడదాన్ని అనే విషయాన్ని మరిచిపోయి.. నీచమైన, హేయమైన పని చేసి గర్భం దాల్చింది. ఇలాంటి పనులు చేసే దానినిక మా ఊళ్లో ఏమంటారంటే.. అని.. అలా చెబితే సభ్యత కాదు. అందరి ముందు సిగ్గులేకుండా అబద్దాలు చెబుతుంది. నీ గురించి అన్ని నిజాలు చెప్పాలా? కిడ్నాపులు, మనుషులను మాయం చేయడం. చాలా నీచమైన నులు పనిచేస్తుంది. అవన్నీ చెప్పడం సరికాదు. నాకు సంస్కారం అడ్డు వస్తున్నది అని దీప చెప్పారు.

   జైలుకు వెళ్లి వచ్చి నీతి పాఠాలు

  జైలుకు వెళ్లి వచ్చి నీతి పాఠాలు

  డాక్టర్ కార్తీక్ ప్రసిడెంట్‌గా పనికిరాదని మోనిత అంటున్నది. ఈవిడ అసలు డాక్టర్ వృత్తికే కలంకం. పెద్దలు ఆలోచించండి. తప్పు ఎవరిదో. తనంతటా తానే బురద గుంటలో పడి.. బురద అంటిందంటున్నాను. చేయలేని పని చేసి జైలుకు వెళ్లి వచ్చి.. నీతి పాఠాలు కన్నీటితో చెబుతున్నదంటే.. అందులో నిజం ఎంత ఉందనేది మీరే అర్దం చేసుకోవాలి అంటూ మోనితను కడిగిపడేసింది. దాంతో అవమాన భారంతో కోపంగా అక్కడి నుంచి మోనిత వెళ్లిపోయింది.

  కంగారు పడిన ప్రియమణి

  కంగారు పడిన ప్రియమణి

  మోనితకు దీప ఇచ్చిన స్ట్రోక్‌తో ప్రియమణి కంగారు పడిపోయింది. అమ్మా అంటూ ఏదో చెప్పబోయేలోగా.. ఏంటి ప్రియమణి.. భయపడ్డావా అంటూ మోనిత ప్రశ్నించింది. అయితే వాళ్లు అందరూ ఉన్నారు. మీరు ఒక్కరే ఉన్నారు అని గుబులుగా చెప్పింది. దాంతో నావైపు ధర్మం, న్యాయం ఉన్నాయి. వాటితో నేను గెలువనా? అని మోనిత అంటే.. ఎందుకమ్మ వాళ్లతో గొడవలు అంటూ ప్రియమణి అన్నారు. ఎందుకా? అని ప్రశ్నిస్తే.. మీరు ఎప్పుడూ కార్తీక్ పేరును జపిస్తుంటారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు అని ప్రియమణి అంది. అయితే ఆనందరావును పెంచుతూ.. నా ఖర్మ ఇంతే అంటూ రోజు ఏడుస్తూ కూర్చోవాలా? అంటూ మోనిత చిరాకు పడింది.

  ప్రియమణికి సీరియస్ వార్నింగ్

  ప్రియమణికి సీరియస్ వార్నింగ్

  అయితే మోనితకు నచ్చచెప్పేందుకు ప్రియమణి ప్రయత్నిస్తూ.. ఎలాగు కార్తీక్ అయ్యా ఒప్పుకోరు కదా.. ఎందుకు పరువు తీసుకోవడం అని అంటే.. ప్రియమణి చెంప పగలకొట్టబోయింది. నా బిడ్డ నీ ఒడిలో ఉన్నావు కాబట్టి కొట్టలేదు. చాలా సార్లు చెప్పాను.. కార్తీక్ విషయంలో సలహాలు ఇవ్వవద్దని, ఎప్పటికీ కార్తీక్‌ను వదలను. దీప కాదన్నా.. దేవుడు వద్దన్నా.. కార్తీక్ నా సొంతం కావాల్సిందే అని మోనిత ఆగ్రహం వ్యక్తం చేసింది.

  కార్తీక్ కుటుంబానికి మోనిత శాపం

  కార్తీక్ కుటుంబానికి మోనిత శాపం

  అంతలోనే కార్తీక్ కుటుంబ అటువైపుగా వస్తుండటంతో.. కార్తీక్.. ప్రసిడెంట్‌గా ఎన్నికైనందుకు కంగ్రాట్స్ అని మోనిత అంటే.. కార్తీక్ కొట్టబోగా సౌందర్య ఆపింది. వాళ్లు అక్కడి నుంచి వెళ్తుంటే.. కార్తీక్.. నీకు ఆడపిల్లలు ఉన్నారు. నన్ను క్షోభ పెడుతున్నావు. నేను శాపం పెడుతున్నాను. ఎన్ని రోజులు తప్పించుకొంటావో చూస్తాను. నీ పిల్లల బతుకు కూడా నాలాగే అని మోనిత అని అంటుండగా.. దీప పరుగున వెళ్లి కొట్టేంత పనిచేసింది. ఇంకోసారి నా పిల్లలు, కుటుంబ జోలికి వస్తే పీక పిసికి చంపేస్తా. వెళ్లు.. వెళ్లు అంటూ గుడ్లు ఉరిమి కోపంగా వార్నింగ్ ఇచ్చింది. దాంతో రండమ్మా.. రండి అంటూ మోనితను ప్రియమణి తీసుకెళ్లే పని చేసింది. దాంతో ఆగు అని మోనిత అంటే.. నీకు దండం పెడుతాను. వెళ్లిపోదాం అని ప్రియమణి అంటే.. వెళ్లడానికి కాదు.. ఇదంతా చేస్తున్నది.. పర్మినెంట్‌గా మీ ఇంట్లోనే ఉండటానికి. ఉంటాను. గుర్తుపెట్టుకొండి అని కార్తీక్ కుటుంబాన్ని చూస్తూ మోనిత హెచ్చరించింది.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  కార్తీక్‌పై మరో కుట్రకు తెరలేపిన మోనిత

  కార్తీక్‌పై మరో కుట్రకు తెరలేపిన మోనిత


  ఇంట్లోకి వెళ్లిన మోనిత అవమాన భారంతో ఊగిపోయింది. అంతలోనే లాయర్ సురేష్ ఫోన్ మోగింది.. మేడమ్.. అనుకున్నదంతా పని అయిపోతుంది. ఒకట్రెండు రోజుల్లో పని పూర్తవుతుంది. నేను చాలా కష్టపడ్డాను అని లాయర్ అంటే.. నీ కష్టానికి సంబంధించి ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని చెప్పింది. తప్పకుండా పని అయిపోతుందా అని అడిగితే.. తప్పకుండా అంటూ లాయర్ చెప్పారు. దాంతో ప్రియమణిని పిలిచి మనకు అంతా అనుకూలంగానే ఉన్నాయి అంటూ తెగ సంబరపడిపోయింది. అయితే మోనిత అనుమానంగా చూడటంతో.. ఏంటి ప్రియమణి అన్నింటికి ఒకే రియాక్షన్ ఇస్తున్నావు అంటూ మోనిత ప్రశ్నించింది. అలా మోనిత మరో కుట్రకు తెరలేపింది. రానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

  English summary
  Highest rated Telugu serial Karthika Deepam's December 2nd Episode number 1211:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X