For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోయిన్‌తో హైపర్ ఆది మాల్దీవులు టూర్: టిఫిన్, లంచ్ అంటూ రచ్చ.. సుధీర్ కూడా ఆమెను తీసుకెళ్లి!

  |

  చాలా కాలంగా తనదైన శైలి కామెడీతో సందడి చేస్తూ.. తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. అద్భుతమైన టైమింగ్‌తో నవ్వులు పూయిస్తోన్న అతడు వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా హీరోయిన్ ప్రియమణితో కలిసి ఈ యంగ్ కమెడియన్ మాల్దీవులు టూర్‌కు వెళ్లాడు. ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న సమయంలో సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. మరో హీరోయిన్‌తో కలిసి వచ్చిన అతడు.. హైపర్ ఆదికి చుక్కలు చూపించాడు. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   అలా పరిచయమైన ఆది... ఫేమస్

  అలా పరిచయమైన ఆది... ఫేమస్

  డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు ఆది. ఈ క్రమంలోనే అదిరే అభి ద్వారా జబర్ధస్త్‌లోకి స్క్రిప్టు రైటర్‌గా ప్రవేశించాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అనంతరం ఆర్టిస్టుగానూ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. దీంతో అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి తనదైన శైలి కామెడీతో సందడి చేస్తున్నాడు.

  అదే హైపర్ ఆది ప్రధానమైన బలం

  అదే హైపర్ ఆది ప్రధానమైన బలం

  ప్రస్తుతం జబర్ధస్త్‌లో ఉన్న కమెడియన్లు అందరిలోనూ హైపర్ ఆది టాప్‌లో వెలుగొందుతున్నాడు. దీనికి కారణం అతడి అద్భుతమైన టైమింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, పంచుల వర్షం కురిపిస్తూ ఎదుటి వారిపై దండయాత్ర చేస్తున్నాడు. ఫలితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. దీనివల్లే అతడి స్కిట్లకు టీవీలో, యూట్యూబ్‌లో భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

   ఆ షోలోనూ ఆది రచ్చ చేస్తోన్నాడు

  ఆ షోలోనూ ఆది రచ్చ చేస్తోన్నాడు

  జబర్ధస్త్‌లో చాలా కాలంగా సందడి చేస్తోన్న హైపర్ ఆది.. మరెన్నో షోలలోనూ భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే అదే ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ' డ్యాన్స్ షోలోనూ పని చేస్తున్నాడు. ఇందులో ఓ టీమ్‌కు మెంటర్‌గా ఉన్న అతడు.. అక్కడ కూడా అద్భుతమైన పంచులతో అలరిస్తున్నాడు. అదే సమయంలో తనలోని వైవిధ్యాలను కూడా చూపిస్తూ మెప్పిస్తున్నాడు.

  హీరోయిన్‌తో కలిసి మాల్దీవులు ట్రీప్

  హీరోయిన్‌తో కలిసి మాల్దీవులు ట్రీప్


  వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ‘ఢీ' కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆదిని బాగా హైలైట్ చేశారు. ఈ వీడియోలో అతడు జడ్జ్, ప్రముఖ హీరోయిన్ ప్రియమణితో కలిసి మాల్దీవుల్ టూర్ వెళ్లినట్లు చూపించారు. ఈ సందర్భగా అతడి పెర్ఫార్మెన్స్ హైలైట్ అయింది. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

  టిఫిన్, లంచ్ అంటూ రచ్చ చేశాడు

  టిఫిన్, లంచ్ అంటూ రచ్చ చేశాడు


  ఈ ప్రోమో ఆరంభంలోనే హైపర్ ఆది.. ప్రియమణి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఆమె బావ అని పిలవడం.. అతడు ప్రియ అనడంతో ఇది రొమాంటిక్‌గా మొదలైంది. ఇక, ‘ప్రియ ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. నన్ను హగ్ చేసుకో' అంటూ ఆది అనడం హైలైట్ అయింది. అలాగే, నీకు ఏ టిఫిన్ కావాలని అతడు అడగగా.. ‘నీకు ఏది ఇష్టమో నాకు అది కావాలి' ప్రియమణి చెప్పింది.

  సుధీర్ కూడా ఆమెతో కలిసి ఎంట్రీ

  ఇదే స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్.. మరో జడ్జ్ సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణతో కలిసి మాల్దీవులు టూర్ వెళ్లాడు. అయితే, అతడు ఆదిలా కాకుండా తనదైన శైలిలో అలరించాడు. ఇందులో పూర్ణ ‘నాకు ప్రాన్స్ కావాలి' అని అడగగా.. ‘వాళ్లలా మనకు బ్రేక్‌ఫాస్ట్‌లు లేవు. మెయిన్ కోర్సులే మొత్తం' అంటూ షాకిచ్చాడు. ఆ తర్వాత కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు.

  Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
  హైపర్ ఆదికి చుక్కలు చూపించాడు

  హైపర్ ఆదికి చుక్కలు చూపించాడు

  ప్రియమణితో ఎంజాయ్ చేసే అవకాశం రావడంతో హైపర్ ఆది రెచ్చిపోయాడు. ఇందులో భాగంగానే తరచూ ఆమెను పట్టుకోవడం.. ప్రియా ప్రియా అని పిలవడం.. రొమాంటిక్ డైలాగులు చెప్పడం వంటివి చేశాడు. అయితే, పక్కనే ఉన్న సుడిగాలి సుధీర్ మాత్రం తరచూ ఆదిని డిస్టర్బ్ చేశాడు. పదే పదే మధ్యలో దూరి వాళ్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఇది సందడిగా సాగిపోయింది.

  English summary
  Jabardasth Comedians Hyper Aadi and Sudigali Sudheer Went Maldives Tour with Priyamani and Shamna Kasim in DHEE 13 - Kings vs Queens Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X