Just In
- 1 hr ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 2 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 2 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కష్టాలను వివరిస్తూ హైపర్ ఆది భావోద్వేగం: తండ్రి చనిపోయాడని చెబుతూ కమెడియన్ కన్నీరు
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కామెడీ షోలలో జబర్ధస్త్‌ది ప్రథమ స్థానం అనే చెప్పాలి. అంతలా ఈ షో దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రభావం చూపిస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ఇలా.. అన్ని రకాలుగా ఆకట్టుకుంటోన్న జబర్ధస్త్ అరుదైన మైలురాయిని అందుకోబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కమెడియన్లు హైపర్ ఆది, వెంకీ విషాదకర విషయాలను వెల్లడించారు. యాంకర్ అనసూయ కూడా కన్నీటి పర్యంతం అయింది. ఆ వివరాలు మీకోసం!

400 మార్క్‌కు చేరువ.. తొలి షోగా ఘనత
తెలుగు బుల్లితెరపై దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది జబర్ధస్త్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ షో.. వచ్చే వారంతో 400వ ఎపిసోడ్ పూర్తి చేసుకోనుంది. తద్వారా తెలుగులో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న మొదటి షోగా రికార్డును క్రియేట్ చేయబోతుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

స్పెషల్ గెస్టుగా యాంకర్.. ఎంతో స్పెషల్‌గా
400వ ఎపిసోడ్ కావడంతో దీన్ని ఎంతో స్పెషల్‌గా రూపొందించారని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో సాగే దీనికి ప్రముఖ యాంకర్ ప్రదీప్ స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, అతడు ఓ స్కిట్‌లో కూడా భాగమయ్యాడు. ఈ ఎపిసోడ్‌లో తమ ఎదుగుదలకు జబర్ధస్త్ ఎలా కారణం అయిందో ప్రతి ఒక్క టీమ్ లీడర్ వివరించినట్లు చూపించారు.

ఎమోషనల్‌గా సాగిన ప్రత్యేకమైన ఎపిసోడ్
టాలెంట్ల కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తాము ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం జబర్ధస్త్ అంటూ అందరు కమెడియన్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొందరికి సన్మానం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎంతో సందడిగా సాగాల్సిన ఈ ఎపిసోడ్.. భావోద్వేగాల మధ్య ప్రసారం కాబోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కష్టాలను వివరిస్తూ హైపర్ ఆది భావోద్వేగం
ముందుగా తన జర్నీ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నాలుగు సంవత్సరాల క్రితం మా ఫ్యామిలీ మొత్తం జీరో. వంద రూపాయల కోసం పక్కింటికి వెళ్లి అడగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు మా ఫ్యామిలీ మంచి పొజిషన్‌లో ఉందంటే దానికి కారణం జబర్ధస్త్. నేను ఈ షోలో ఉన్నానంటే దానికి కారణం అభీ అన్న' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఈ టాప్ కమెడియన్.
తన తండ్రి చనిపోయాడని చెబుతూ కన్నీరు
ఆ తర్వాత వెంకీ స్పందిస్తూ.. ‘నన్ను వేలెత్తి చూపించిన నా ఫ్రెండ్స్, బంధువులు జబర్ధస్త్‌లోకి వచ్చాక మావాడు అని చెప్పుకుంటున్నారు. మొదట్లో నేను బాగా తడబడ్డాను. అప్పుడు నా టీమ్ ఉంటుందా ఉండదా అని అంతా అనుకున్నారు. ఆ సమయంలో మా నాన్న ధైర్యం చెప్పాడు. ఇప్పుడు నేనీ స్టేజ్‌లో ఉన్నప్పుడు చూడ్డానికి మా నాన్న లేడు' అని కన్నీటి పర్యంతం అయ్యాడు.

వీళ్లందరూ నా కుటుంబం అని అనసూయ
ఇదే ఎపిసోడ్‌లో కమెడియన్లతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మాట్లాడింది. ‘ఈ షోలో ఉన్న వాళ్లందరూ నా ఫ్యామిలీ. నా వాళ్లే అన్న స్వార్థం ఉంటుంది' అంటూ బాగా ఎమోషనల్ అయింది. వీళ్లు మాత్రమే కాదు.. జడ్జ్‌లు రోజా, మను కూడా బాధ పడినట్లు కనిపించింది. అదే సమయంలో వచ్చే వారం అందరి స్కిట్లు అదిరిపోయే పంచులతో సాగనున్నాయి.