For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV Hyper Aadi: ఫస్ట్ నైట్ ఓ ఉద్యమం.. రాంగోపాల్ వర్మ, ఆషురెడ్డిపై హైపర్ ఆది పంచులు

  |

  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి తన కామెడీ స్టైల్ తో, కౌంటర్ పంచ్ లతో ఒక వర్గం అభిమానులను సంపాదించుకున్నాడు కమెడియన్, టెలివిజన్ నటుడు హైపర్ ఆది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా స్కిట్ లో ఒక కంటెస్టెంట్ గా పరిచయం అయిన హైపర్ ఆది ఇప్పుడు సినిమాలకు డైలాగ్స్, స్కిట్స్ రాసే రేంజ్ కి ఎదిగాడు. ఇప్పుడు హైపర్ ఆది అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. తన కమెడియన్ జీవితంలో అనేక సినిమా స్పూఫ్స్ చేస్తూ, సినీ యాక్టర్స్ ను ఇమిటేట్ చేస్తూ ఎంతో ఎంటర్టైన్ చేశాడు హైపర్ ఆది. తాజాగా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేస్తూ తన కామెడీ కోసం తెగ వాడేశాడు.

  పంచ్ లు, ప్రాసల స్పెషలిస్ట్ గా..

  పంచ్ లు, ప్రాసల స్పెషలిస్ట్ గా..


  బుల్లితెర కమెడియన్ గా సినీ కెరీర్ ను ఆరభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ప్రతి ఫెస్టివల్ కి కానీ, సినీ సెలబ్రేషన్స్ కి కానీ స్పెషల్ ఈవెంట్ లు, ప్రోగ్రామ్స్ లో తనదైన కామెడీ పంచులతో అట్రాక్ట్ చేస్తాడు హైపర్ అది. ఎంతో కాలంగా హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై హవాను చాటుతూ టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ కమెడియన్ అనేక షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా..

  సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా..

  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన హైపర్ ఆది.. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లోకి రైటర్ గా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించాడు. అనేక సినిమా స్పూఫ్ స్కిట్లతో పేరు సంపాదించుకున్న ఆది.. ఆ తర్వాత ఆర్టిస్టుగా అంటే కమెడియన్ గా మారి అదరగొట్టాడు. తను కనిపించిన ప్రతి స్కిట్లలో తన మార్క్ చాటాడు. దీంతో హైపర్ ఆదిగా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.

  ధమాకా సినిమాకు రైటర్ గా..

  ధమాకా సినిమాకు రైటర్ గా..

  బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అందులోనూ తన మార్క్ చూపించాడు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్న హైపర్ ఆది ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఈ క్రమంలోనే కమెడియన్, నటుడు అల్లరి నరేష్ నటించిన 'మేడ మీద అబ్బాయి' మూవీతో సినిమాల్లోనూ డైలాగ్ రైటర్‌గానూ మారాడు. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధమాకాకు కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశాడు హైపర్ ఆది.

  ఆర్జీవీ, అషురెడ్డికి కౌంటర్లు..

  ఆర్జీవీ, అషురెడ్డికి కౌంటర్లు..

  ఇదిలా ఉంటే హైపర్ ఆది స్కిట్స్, స్పూఫ్ వీడియోలకు పెట్టింది పేరు. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి ఇంటర్వ్యూ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఇంటర్వ్యూపై స్పూఫ్ స్కిట్ చేసి నవ్వించాడు హైపర్ ఆది. అంతేకాకుండా ఈ స్కిట్ తో నవ్వించడమే కాకుండా డైరెక్టర్ ఆర్జీవీకి, అషు రెడ్డికి పరోక్షంగా సెటైర్లు, పంచ్ లు వేశారని నెటిజన్లు భావిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసే ట్వీట్స్ కు కౌంటర్ ఎటాక్ చేశాడని కూడా పలువురు భావిస్తున్నారు.

  ఎక్కడ చూస్తున్నావ్ రాము..

  ఎక్కడ చూస్తున్నావ్ రాము..

  హైపర్ ఆది చేసిన స్కిట్ లోకి వెళితే.. రామ్ గోపాల్ వర్మగా అదే గెటప్ తో హైపర్ ఆది చేయగా.. అషు రెడ్డిగా తను వేసుకున్నటువంటి డ్రెస్సు ధరించి మరి నరేష్ చేశాడు. రాము గారికి కుర్చి వేయండని నవీన్ అంటే.. నాకు కుర్చీ వద్దు.. నాకు కింద కూర్చూంటేనే కంఫర్ట్ అంటూ నవ్వించాడు ఆది. ఈరోజు నీ అందాన్ని ఆస్వాదించేందుకు వచ్చాను అని ఆది అంటే.. ఎక్కడ చూస్తున్నావ్ రాము అని నవీన్ అన్నాడు. అప్పుడు నవీన్ కాలు తీసుకుని నీ లెగ్స్ నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఆది. అప్పుడు కాలు చెప్పును నవీనే తీసి కోపరేట్ చేస్తున్నట్లుగా కామెడీ చేశాడు.

  చీర అయితే నడుము మాత్రమే..

  చీర అయితే నడుము మాత్రమే..

  అప్పుడు సేమ్ రామ్ గోపాల్ వర్మ చేసినట్లుగానే నవీన్ పాదాన్ని తీసుకుని మైమరిచిపోయినట్లు చేశాడు హైపర్ ఆది. ఎలా ఉందని నవీన్ అడిగితే.. చాలా బాగుంది.. నువ్ స్నానం చేసుంటే ఇంకా బాగుండేది అని కౌంటర్ వేశాడు ఆది. తర్వాత నువ్ చీరలు కట్టుకోవు.. ఇలాంటి డ్రెస్సులే ఎందుకు వేస్తావ్ అని ఆది అడిగాడు. చీర అయితే ఒక నడుము మాత్రమే కనిపిస్తుంది.. ఈ డ్రెస్సులు అయితే మొత్తం కనిపిస్తుందని నవీన్ చెబుతూ అషు రెడ్డికి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేసినట్లుగా ఉంది.

  ఫస్ట్ నైట్ ఒక ఉద్యమం..

  అనంతరం ఫస్ట్ నైట్ మీద నీ అభిప్రాయం అని నవీన్ అడిగితే.. ఫస్ట్ నైట్ అనేది ఒక రాత్రిలో అయ్యేది కాదు. అది ప్రతిరోజు జరిగే ఓ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని అలాగే కొనసాగించాలన్నదే నా తాపత్రయం అని ఆది అంటే.. మంచి నిర్ణయం అని నవీన్ అని కామెడీ పండించాడు. నాకు దెయ్యంతో రొమాన్స్ చేయాలని ఉందని, హరర్ లో రొమాన్స్ బాగుంటుందని ఆది అంటే.. దొంగ దా.. అని నవీన్ కౌగిలించుకుంటాడు. ఇలా ఆర్జీవీ చేష్టలకు పంచ్ లు ఇస్తూనే అతన్ని అషురెడ్డి కౌగిలించుకోవడంపై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. ఈ స్కిట్ మొత్తం ఆర్జీవీ, అషురెడ్డికి పంచ్ లు వేసినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  English summary
  Jabardasth Hyper Aadi Naveen Latest Skit In Sridevi Drama Company. And Hyper Aadi Satires To Ram Gopal Varma And Ashu Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X