For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ సెట్‌లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని స్పందనతో దూసుకుపోతోంది జబర్ధస్త్. ఆరంభం నుంచే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో సత్తా చాటుతోన్న ఈ షో దాదాపు ఎనిమిదేళ్లుగా నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. ఇంతటి పేరున్న ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. అందుకే ఈ షో తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ సెట్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఓ పేరున్న ఆర్టిస్టు ఏకంగా టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

  కొన్ని వందల మందిని తీసుకొచ్చింది

  కొన్ని వందల మందిని తీసుకొచ్చింది

  సుదీర్ఘమైన ప్రస్థానంలో జబర్ధస్త్ ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుల్లితెరకు పరిచయం చేసింది. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా కొన్ని వందల మంది దీని ద్వారా ఫేమస్ అయ్యారు.. ప్రస్తుతం వీళ్లలో చాలా మంది ఆర్టిస్టులు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు.

  వాళ్లకు కూడా కలిసొచ్చిన కామెడీ షో

  వాళ్లకు కూడా కలిసొచ్చిన కామెడీ షో


  జబర్ధస్త్ షో కేవలం ఆర్టిస్టులకు మాత్రమే కాదు.. అందులో పని చేసిన ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా షో ఆరంభం నుంచి జడ్జ్‌లుగా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబుకు ఈ షో మరింత ప్లస్ అయింది. అలాగే, గ్లామరస్ బ్యూటీలు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ యాంకరింగ్ కెరీర్‌లకు బాగా ఉపయోగపడిందీ కామెడీ షో.

  వివాదాలు చుట్టుముట్టినా ఆగలేదుగా

  వివాదాలు చుట్టుముట్టినా ఆగలేదుగా

  జబర్ధస్త్ షోను ఆదరించేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మందే ఉన్నారు. అదే సమయంలో ఈ షోను వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. ఈ కామెడీ షోలో అశ్లీలతతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారని, మహిళలను కించపరుస్తున్నారని, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా స్కిట్లు చేస్తున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. దీంతో షోను నిషేదించాలన్న డిమాండ్లూ వినిపించాయి.

  ఇప్పుడు అతడిదే హవా.. లవ్ ట్రాక్‌తో

  ఇప్పుడు అతడిదే హవా.. లవ్ ట్రాక్‌తో


  జబర్ధస్త్ షో వల్ల పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో ఇమాన్యూయేల్ ఒకడు. ‘పటాస్' అనే షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన అతడు.. తనదైన శైలి కామెడీతో సందడి చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఆ షో ఆగిపోవడంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకుని, ఇప్పుడు సెకెండ్ లీడ్‌గా చేస్తున్నాడు. అదే సమయంలో వర్షతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు.

  జబర్ధస్త్ షో సెట్‌లో ఊహించని ఘటన

  వచ్చే గురువారం ప్రసారం కానున్న జబర్ధస్త్ షో ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో అన్ని టీమ్‌లకు సంబంధించిన స్కిట్లు చూపించారు. హైపర్ ఆది ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా స్ఫూఫ్‌తో అలరించగా.. మిగిలిన వాళ్లంతా తమ తమ టీమ్‌లతో సత్తా చాటారు. ఇక, చివర్లో ఓ ఊహించని సంఘటన జరిగింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.

  టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్

  టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్

  షోలో భాగంగా ఇమాన్యూయేల్.. తాగుబోతు రమేష్ స్కిట్‌లో చేశాడు. ఎంతో ఫన్నీగా సాగిన ఇందులో వీళ్లిద్దరూ అదిరిపోయే పంచులతో ఆకట్టుకున్నారు. అదే సమయంలో స్కిట్ కోసం తాగుబోతు రమేష్‌ను ఇమాన్యూయేల్ కొట్టాడు. అయితే, అది అతడిని నిజంగానే తగిలింది. దీంతో రోజాతో పాటు అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఆ తర్వాత అతడు సారీ కూడా చెప్పాడు.

  English summary
  Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X