For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12 Final.. దుమ్మురేపిన కియారా అద్వానీ.. టైటిల్ రేసులో తెలుగు అమ్మాయి.. ఓటు ఎలా వేయాలంటే!

  |

  సంగీత ప్రపంచానికి ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం Indian Idol 12 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఫైనల్‌ సమీపిస్తుండటంతో సంగీత ప్రియులు, బుల్లితెర ప్రేక్షకులకు ఉత్కంఠ పెరిగింది. ఈ ఫైనల్‌ను కనీవిని ఎరుగని విధంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన జరిగే ఫైనల్‌లో బాలీవుడ్ తారల తళుకుబెళుకులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. తాజాగా విడుదల చేసిన ఫైనల్‌కు సంబంధించిన ప్రోమోతో ఫీవర్ మొదలైంది. ఈ వివరాల్లోకి వెళితే..

  ఆశా భోంస్లే, ఇతర మ్యూజిక్ లెజెండ్స్ ముఖ్య అతిథిగా హాజరు

  ఆశా భోంస్లే, ఇతర మ్యూజిక్ లెజెండ్స్ ముఖ్య అతిథిగా హాజరు

  గత కొద్ది నెలలుగా Indian Idol 12 ఉత్తేజం, ఉత్కంఠతో సాగుతున్నది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకొంటున్నారు. ఈ షోలో పలువురు బాలీవుడ్ అగ్ర నటులు, నటీమణులు, మ్యూజిక్ లెజెండ్స్ పాల్గొన్నారు. లెజెండ్ ఆశా భోంస్లే, రణధీర్ కపూర్, కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి, కరీనా కపూర్, అల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ లాంటి ప్రముఖులు ఇండియన్ ఐడల్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.

  Bigg Boss OTT ఫేమ్ దివ్య అగర్వాల్.. గ్లామరస్, బ్యూటీఫుల్.. ఎప్పుడూ చూడని ఫోటోలు

  Indian Idol 12 టైటిల్ రేసులో ఆరుగురు

  Indian Idol 12 టైటిల్ రేసులో ఆరుగురు

  ఇలాంటి పరిస్థితుల మధ్య Indian Idol 12 తుది దశకు చేరుకొన్నది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంగీత ప్రపంచానికి మరో టాలెంటెడ్ స్టార్ సింగర్ పరిచయం కాబోతున్నారు. ఈ ఫైనల్ బరిలో దిగిన 6 గురు కంటెస్టెంట్లపైన అందరి దృష్టి ఉంది. ఆరుగురు కంటెస్టెంట్లు పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, షణ్ముఖ ప్రియ బరిలో ఉన్నారు.

  Indian Idol 12 టైటిల్ రేసులో తెలుగు అమ్మాయి

  Indian Idol 12 టైటిల్ రేసులో తెలుగు అమ్మాయి

  Indian Idol 12 ఫైనల్‌కు చేరుకొన్న షణ్ముఖ ప్రియ అచ్చ తెనుగు అమ్మాయి. వైజాగ్‌కు చెందిన షణ్ముఖ ప్రియ హిందీ పాటలను అలవోకగా పాడుతూ ఉత్తరాది సంగీత ప్రియులనే కాకుండా సినీ మ్యూజిక్ లెజెండ్స్, బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇప్పటికే షణ్ముఖ ప్రియ టైటిల్ రేసులో ముందున్నారు. ఆశా భోంస్లే, రణ్‌ధీర్ కపూర్, కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను లాంటి ప్రముఖులు భారీగా ప్రశంసలు కురిపించారు.

  Happy Birthday Jacqueline Fernandez.. బికినీలో బాలీవుడ్ భామ విశ్వరూపం!

  షణ్ముఖ ప్రియకు భారీగా ప్రశంసలు

  షణ్ముఖ ప్రియకు భారీగా ప్రశంసలు

  హాలీవుడ్ స్థాయి గాయకురాలు అంటూ ప్రశంసలు అందుకొన్న షణ్ముఖ ప్రియ ఇప్పుడు టైటిల్‌ను గెలుచుకొనేందుకు సిద్ధం అయ్యారు. తనకు ఓటు వేసి గెలిపించమని కోరుతున్నారు. సోనీ లివ్ యాప్‌ ద్వారా, లేదా Firstcry.com వెబ్‌సైట్ ద్వారా ఓటు వేయమని కోరుతున్నారు. తెలుగు సంగీత ప్రియులు ఓటు వేస్తే తెలుగు తేజం షణ్ముఖ Indian Idol 12 టైటిల్‌ను గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదనిపిస్తున్నది.

  షణ్ముఖ ప్రియ ఎవరంటే..

  షణ్ముఖ ప్రియ ఎవరంటే..

  షణ్ముఖ ప్రియ వ్యక్తిగత జీవిత విషయాలకు వస్తే.. సంప్రదాయ తెలుగు కుటుంబంలో 2003లో వైజాగ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రమాలత, శ్రీనివాస్ కుమార్ ఇద్దరు కళాకారులే. తల్లి మ్యూజిక్ టీచర్ కాగా, తండ్రి వీణ, మాండలిన్, గిటార్, కీబోర్డ్, వయోలిన్ వాయిద్యకారుడు. దీంతో చిన్నప్పటి నుంచే మ్యూజిక్, సంగీతంపై ఆమెకు మక్కువ పెరిగింది. కర్ణాటక సంగీతం. జాజ్‌లో షణ్ముఖ ప్రావీణ్యం సాధించింది. తేజం సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.

  అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలతో షాకిచ్చిన రుహానీ శర్మ: సినిమాల్లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  12 గంటలపాటు Indian Idol 12 ఫైనల్

  12 గంటలపాటు Indian Idol 12 ఫైనల్

  Indian Idol 12 ఫైనల్ గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గంటల మారథాన్‌గా సాగనున్నది. ఇది రియాలిటీ షోలో ఒక రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తార కియారా అద్వానీ తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి సందడి చేశారు. వేదికపై ఆకర్షణీయంగా మారి హంగామా చేశారు. Indian Idol 12 వేదికపై తాము నటించిన షేర్షా మూవీని ప్రమోట్ చేస్తూ కనిపించారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సిద్దార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ.. నా తల్లి ఈ షోకు బిగ్ ఫ్యాన్ అంటూ చెప్పడం కనిపించింది.

  Indian Idol 12 ఫైనల్‌లో మెరిసిన కియారా అద్వానీ

  Indian Idol 12 ఫైనల్‌లో మెరిసిన కియారా అద్వానీ

  ఇక Indian Idol 12 ఫైనల్‌లో కియారా అద్వానీ వేదికపై వేడిపుట్టించింది. అందంగా మెరిసిపోతూ అందర్నీ ఆకట్టుకొన్నది. కియారా అద్వానీతో కలిసి ఫైనలిస్టు పవన్‌దీప్ రాజన్ బూర్జ్ ఖలీఫా పాటకు స్టెప్పులేసి అతిథులను, హోస్టులను, కంటెస్టెంట్లను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో గతంలో Indian Idol విజేతలుగా, కంటెస్టెంట్లుగా నిలిచిన వారు కూడా హాజరయ్యారు. అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు. ఖవ్వాలీ ప్రొగ్రాం, ఇతర బాలీవుడ్ గాయకుల పాటలు హైలెట్‌గా ప్రోమోలో కనిపించాయి.

  షణ్ముఖ, పవన్‌దీప్‌ పైనే అందరి దృష్టి

  Indian Idol 12 ఫైనల్‌ ఉత్తేజ, ఉద్విగ్న పరిస్థితులను కలబోసుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నది. టైటిల్ గెలుచుకొంటామని ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లలో ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే పోటీ మాత్రం షణ్ముఖ ప్రియ, పవన్‌దీప్ రాజన్ మధ్యే ఉన్నట్టు కనిపిస్తున్నది. మరికొద్ది గంటల్లోనే సీజన్ 12వ విజేత ఎవరో తేలనుండటంతో ఈ పోటీపై అందరిలోను ఉత్కంఠ నెలకొన్నది.

  English summary
  Indian Idol 12 Final is set ready fire on August 15th. Kiara Advani dance moments in promo goes viral, Telugu girl Shanmukhapriya in title race of this season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X