For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Indian Idol 12 Grand Prize Money: అందరిచూపు తెలుగమ్మాయి పైనే.. గెలిస్తే జాక్ పాట్!

  |

  ఇండియన్ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షో ''ఇండియన్ ఐడల్ 2021'' గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం (ఆగస్టు 15)న ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈ రోజు కోసమే సంగీత ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ సారి గ్రాండ్ ఫినాలే మొదటి సారి ఒక తెలుగు అమ్మాయి పోటీ గా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె గెలవాలని రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఎంతో బలంగా కోరుకుంటున్నారు.

  Indian Idol 12 Grand Finale: Special Focus On Shanmukha Priya | Oneindia Telugu

  ఇదివరకే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆమెకు బెస్ట్ విషెస్ కూడా ఇచ్చాడు. ఆమె మరెవరో కాదు పాడుతా తీయగా రియాల్టీ షోలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న షణ్ముఖ ప్రియ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె పేరు వైరల్ గా మారింది.

  అంతకుమించి అనేలా..

  అంతకుమించి అనేలా..

  ఇండియన్ ఐడల్ 2021 గ్రాండ్ ఫినాలే పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే గత ఎపిసోడ్ లోనే భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకోవడంతో ఈసారి అంతకుమించి అనేలా రేటింగ్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. షో నిర్వాహకులు కూడా అదే తరహాలో గ్రాండ్ ఫినాలే కోసం గట్టిగానే సిద్ధమయ్యారు. ఇక ఇదివరకే షో కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ లో షూట్ చేసారు ఇక ఫైనల్ ఎపిసోడ్స్ ను ఈ రోజు కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి షో కొనసాగనుంది. మొత్తంగా 12గంటల పాటు ఈ గ్రాండ్ ఫైనల్స్ సోని టీవీలో ప్రసారం కానుంది.

  ప్రైజ్ మనీ ఎంత?

  ప్రైజ్ మనీ ఎంత?

  మొత్తానికి ఆగస్ట్ 15 న ఇండియన్ ఐడల్ 12 మెగా గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధమైంది. ఈ సింగింగ్ రియాలిటీ షోలో ఎవరు గెలుస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు, అదే విధంగా సింగింగ్ రియాలిటీ షో విజేతకి ఎంత మొత్తం వస్తుందో అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎవరు ఎంత గెలుచుకున్నారు అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో హాయ్ టాపిక్ గా మారుతున్నాయి.

  ట్రోఫీని గెలుచుకునే రేసులో..

  ట్రోఫీని గెలుచుకునే రేసులో..

  ట్రోఫీని గెలుచుకునే రేసులో పవణ్ దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, షముఖ ప్రియ, సాయిలీ కాంబ్లే, మొహమ్మద్ డానిష్ మరియు నిహాల్ టౌరో ఉన్నారు. ఇక ఆల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్‌తో సహా అనేక మంది గాయకులు, ప్రముఖులు, మాజీ పోటీదారులు కూడా గ్రాండ్ ఫైనల్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ముఖ్యంగా, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే కూడా గ్రాండ్ ఫినాలేకి హాజరవుతారని భావిస్తున్నారు. షేర్షా నటులు సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కూడా 'గ్రేటెస్ట్ ఫినాలే' లో ప్రత్యేకమైన అతిధులుగా పాల్గొనబోతున్నారు.

  విజేత ప్రైజ్ మనీ..?

  విజేత ప్రైజ్ మనీ..?

  ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఇండియన్ ఐడల్ 12 విజేతకు రూ. 25 లక్షల మొత్తాన్ని అందజేసే అవకాశం ఉందట. అంతే కాకుండా వారికి మరొక బంపర్ ఆఫర్ ను కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విజేతకు ఒక బడా మ్యూజిక్ సంస్థతో ఒప్పందం కూడా లభిస్తుంది. అందులో వారు ప్రయివేట్ సాంగ్స్ కూడా పాడుకోవచ్చు. ఈ మార్గం గతంలో చాలామంది సింగర్స్ కు ఉపయోగపడింది. ఇదే తరహాలో గెలిచిన వారు T సిరీస్ వంటి బడా సస్థలతో డీలింగ్స్ కూడా సెట్ చేసుకున్నారు.

  అందరిచూపు తెలుగు సింగర్ పైనే..

  అందరిచూపు తెలుగు సింగర్ పైనే..

  ఇక ప్రస్తుతం అందరిచూపు తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియపైనే ఉంది. ఎందుకంటే ఇంతవరకు తెలుగు ఫీమేల్ సింగర్స్ లలో ఎవరు కూడా ఇండియన్ ఐడల్ హిస్టరీలో గ్రాండ్ ఫైనల్స్ వరకు చేరుకోలేదు. అంతే కాకుండా అతి చిన్న వయసులోనే ఆమె సీనియర్ గాయని గాయకులతో పోటీగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. షణ్ముఖ ప్రియ గెలిచి తీరాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

  ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ తెలుగమ్మాయి పేరు ట్రెండింగ్ లిస్ట్ లో చేరింది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణకు చెందిన రెండు రాష్ట్రాల సంగీత ప్రియులు షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ 2021 టైటిల్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

  రౌడి స్టార్ విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  రౌడి స్టార్ విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  ఇక షణ్ముఖ ప్రియకి టాలీవుడ్ రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. గెలుపు ఓటమి అనే విషయాన్ని పక్కన పెట్టి నీ టాలెంట్ తో బ్లాస్ట్ చెయ్యి అంటూ షణ్ముఖ ప్రియకు మంచి బూస్ట్ ఇచ్చాడు. లైవ్ షోలో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ అలాంటి మాటలు చెప్పడంతో షణ్ముఖ ప్రియకు ఆనందం కట్టలు తెచ్చుకుంది. అంతే కాకుండా ఆమె హైదరాబాద్ కు వచ్చిన తరువాత విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా కలుసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక మరొక బంపర్ ఆఫర్ ఏమిటంటే.. విజయ్ దేవరకొండ తన సినిమాలో కూడా పాట పాడే ఛాన్స్ ఇప్పిస్తానని కూడా చెప్పేశాడు. దీంతో షణ్ముఖ ప్రియతో పాటు షోలో ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఆనందించారు.

  గతంలో ఎవరు ఎంత గెలుచుకున్నారు అంటే..?

  గతంలో ఎవరు ఎంత గెలుచుకున్నారు అంటే..?

  ఇక గతంలో ఇండియన్ ఐడల్ లో భారీగా ప్రైజ్ మని గెకుచుకున్న వారి వివరాల్లోకి వెళితే.. సీజన్ 1 విజేత అభిజీత్ సావంత్‌కు టి సిరీస్‌తో ఆల్బమ్ కాంట్రాక్ట్‌తో పాటు రూ.50 లక్షల బహుమతి మొత్తం ఇవ్వబడింది. ఇండియన్ ఐడల్ సీజన్స్ 2,3, 4 విజేతలకు - సందీప్ ఆచార్య, ప్రశాంత్ తమంగ్, సౌరభీ దెబ్బర్మ లకు ఒక్కొక్కరికి రూ.1కోటి వరకు ప్రైజ్ మనీ ఇచ్చారు. ఆగష్టు 15 న ఇండియన్ ఐడల్ 12 మెగా గ్రాండ్ ఫినాలే సోని టెలివిజన్‌లో 12 గంటలకు మొదలవుతుంది. ఇది 12 గంటల మహోత్సవం. అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. మరి ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

  English summary
  Biggest singing show Indian Idol 12 Grand Prize Money shanmukhapriya results.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X