For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యంగ్ హీరోతో ‘గృహలక్ష్మి’ ఫేం లాస్య పెళ్లి: అప్పటి ఇప్పటి బాయ్‌ఫ్రెండ్.. ఈరోజు కోసమే మా నాన్న అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సరైన అవకాశాలు రాక మధ్యలోనే ఈ రంగాన్ని వదిలేస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి ప్రశాంతి ఒకరు. చాలా కాలం పాటు యాంకర్‌గా సందడి చేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్ల క్రితం హోస్టింగ్‌ను వదిలేసింది. అప్పటి నుంచి సినిమాలు, సీరియళ్లలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సక్సెస్‌ఫుల్ సీరియల్‌లో అదిరిపోయే రోల్ చేస్తోంది. ఇక, తాజాగా ప్రశాంతి ఓ సీరియల్ నటుడిని వివాహం చేసుకుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Karthika Deepam కార్తీక్ చేయిపట్టి లాగిన మోనిత.. నీ పెళ్లి పెటాకులే.. దీప వార్నింగ్.. హాస్పిటల్‌లో హైడ్రామా

  అలా మొదలైన కెరీర్.. పాపులరిటీ

  అలా మొదలైన కెరీర్.. పాపులరిటీ

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ప్రశాంతి. ఆకట్టుకునే అందంతో పాటు వాక్చాతుర్యంతో ఎన్నో షోలను నడిపించే అవకాశాన్ని అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమా ఫంక్షన్లను సైతం హోస్ట్ చేసింది. ఇలా చాలా కాలం పాటు వరుస ఆఫర్లతో సత్తా చాటిందామె.

  Raj Kundra రెండు రోజుల పోలీసు రిమాండ్లో ఎలా ఉన్నాడో చూడండి!

  సినిమాల్లోకి ఎంట్రీ.. దాంతో షాకిచ్చి

  సినిమాల్లోకి ఎంట్రీ.. దాంతో షాకిచ్చి

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ప్రశాంతి షాకింగ్ డెసీషన్ తీసుకుంది. అప్పట్లో సంచలనం అయిన ‘ఎఫైర్' అనే అడల్ట్ మూవీలో నటించింది. మొట్టమొదటి లెస్బీయన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో గీతాంజలి అనే అమ్మాయితో కలిసి ప్రశాంతి రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమా ఆమెకు బ్రేక్‌ ఇవ్వకపోగా చెడ్డపేరును తెచ్చింది. దీంతో అప్పట్నుంచి ఈ బ్యూటీ కనుమరుగైంది.

  న్యూడ్ ఫొటోపై సుమ సంచలన వ్యాఖ్యలు: ఆ స్థానంలో తను ఉంటే ఎలాగుండేదో అంటూ షాకింగ్‌గా!

  ఇంటింటి గృహలక్ష్మితో నటిగా ఎంట్రీ

  ఇంటింటి గృహలక్ష్మితో నటిగా ఎంట్రీ

  ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సీరియళ్లలో ‘ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఇందులో కోలీవుడ్ నటి కస్తూరి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ప్రశాంతి ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోంది. ఈమె పాత్రను బాగా హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈమె మునుపటి క్రేజ్‌ను మళ్లీ దక్కించుకుని బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది.

  లేలేత అందాలతో కవ్విస్తోన్న నభా నటేష్: అలాంటి ఫొటోలతో రచ్చ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ

  సుమ షోలోకి వాళ్లతో పాటు ప్రవేశం

  సుమ షోలోకి వాళ్లతో పాటు ప్రవేశం

  సుమ కనకాల హోస్ట్ చేసే ‘క్యాష్' వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శిరీష - సన్నీ, వాసుదేవ్ - కరుణ, పవన్ - అంజలి, విశ్వ - ప్రశాంతి జంటలుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లంతా కూడా ఈ టాప్ యాంకరమ్మకు ధీటైన ఆన్సర్లు చెబుతూ పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  Intinti Gruhalakshmi July 22 Episode: తులసికి సాయం చేస్తానన్న నందూ.. లాస్య మరో కన్నింగ్ ప్లాన్

  పంచులతో రచ్చ రచ్చ చేసిన లాస్య

  పంచులతో రచ్చ రచ్చ చేసిన లాస్య

  వచ్చే వారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌లో యాంకర్ ప్రశాంతిని బాగా హైలైట్ చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె పంచులు వేస్తూ సత్తా చాటింది. ఓ సందర్భంలో సుమ ‘ప్రశాంతి నీ బాయ్‌ఫ్రెండ్‌ను ఎంత కాలం దాచి పెట్టారు' అని అడిగింది. దీనికి ‘దాచి పెట్టుకుని పంపించిన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పాలా? దాచి పెట్టుకున్న బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పాలా' అని పంచ్ వేసింది.

  ఆ హీరోతో ప్రశాంతి పెళ్లి చేసిన సుమ

  ఆ హీరోతో ప్రశాంతి పెళ్లి చేసిన సుమ

  ఈ షోలో భాగంగా జంటలుగా వచ్చిన వాళ్లకు దండలు మార్పించింది సుమ. ఇందులో యాంకర్ ప్రశాంతికి విశ్వకు కూడా ఉత్తుత్తిగా పెళ్లి చేసింది. ఇందులో ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో సెలెబ్రిటీ ఫొటోలు కూడా తీశారు. ఇక, పెళ్లి తర్వాత ప్రశాంతి.. విశ్వ సుమ కాళ్లకు నమస్కారం చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ సందడిగా జరిగినట్లు కనిపిస్తోంది.

  ఈరోజు కోసమే మా నాన్న అంటూ

  ఈరోజు కోసమే మా నాన్న అంటూ

  ఈ ఉత్తుత్తి పెళ్లి జరుగుతోన్న సమయంలో ప్రశాంతి ‘ఈరోజు కోసమే మా నాన్న ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాడు' అని ఎమోషనల్ అయింది. అప్పుడు సుమ ‘ఈ నాన్నలు హమ్మయ్యా మా అమ్మాయి సెటిల్ అయింది' అని అనుకుంటారు అంటుంది. ఇక, చివర్లో ‘ప్రశాంతి ఇప్పుడు ఏడిస్తే ఐలాష్ పోతుందని వెయిట్ చేసింది. మేకప్ తీసేశాక ఏడ్చేస్తుంది' అంటూ అందరినీ నవ్వించింది.

  English summary
  hirisha, Sunny, Vasu Dev, Karuna, Praven, Anjali, Vishwa and Prashanthi participants in Anchor Suma Cash Show Upcoming Episode. Vishwa Prashanthi Got Married In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X