For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 10th Episode: తులసికి షాకిచ్చిన పిల్లలు.. మరో విడాకుల డ్రామాతో ట్విస్ట్!

  |

  తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విడాకులు మంజూరు అయిన తర్వాత దీపక్.. నందూను కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో కోర్టు ఆవరణలో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత తులసి దీపక్‌తో కలిసి అమ్మగారి ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడ వాళ్లందరూ కూర్చుని బాధ పడుతుంటారు. మరోవైపు, నందూ లాస్య మాత్రం విడాకులు వచ్చినందుకు తెగ సంతోష పడుతుంటారు.

  ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా అంటూ

  ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా అంటూ

  నందూ, తులసికి కోర్టు విడాకులు మంజూరు చేయడంతో ఇంట్లో వాళ్లంతా బాధ పడుతూ కూర్చుంటారు. అంతలో ఎంట్రీ ఇచ్చిన అనసూయ ‘ఎవరైనా చచ్చారా? అందరూ దిగాలుగా కూర్చున్నారేంటి?' అని అడుగుతుంది. దీంతో ఆమె భర్త ఎప్పటిలాగే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్, అభి కూడా నానమ్మపై ఫైర్ అవుతారు. దీంతో ఆమె సైలెంట్ అవుతుంది.

  తన కుటుంబం అంటూ వచ్చిన తులసి

  తన కుటుంబం అంటూ వచ్చిన తులసి

  ఈ గొడవ తర్వాత ప్రేమ్.. తులసికి ఫోన్ చేసి రమ్మంటాడు. దీంతో వెంటనే ఆమె ఇంటికి వచ్చేందుకు రెడీ అవుతుంది. అప్పుడు తల్లి, తమ్ముడు వద్దనగా ‘విడాకులు తీసుకున్నంత మాత్రాన ఆ ఇల్లు నా ఇల్లు కాకుండా పోదు. అత్తామామగారిని చూసుకోడానికి నేను వెళ్లాలి. నా పిల్లల కోసం ఉండాలి. విడాకులు అయింది ఆయనతోనే వాళ్లతో కాదు' అంటూ అక్కడికి బయలుదేరుతుంది.

  తులసి కోసం తండ్రిని వదులుకోమంటూ

  తులసి కోసం తండ్రిని వదులుకోమంటూ

  తులసి రావడానికి ముందు అభి, ప్రేమ్, దివ్యల మధ్య డిష్కర్షన్ జరుగుతుంది. అప్పుడు అభి ‘విడాకులు అయినంత మాత్రాన డాడ్‌కు దూరం అవడం నాకిష్టం లేదు. మామ్ కోసం ఆయనను వదులుకోలేను' అంటాడు. దీనికి దివ్య కూడా ఏకీభవిస్తుంది. వీళ్లిద్దరితో ప్రేమ్ వాదనకు దిగుతాడు. అప్పుడు తాత కూడా ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని దూరం చేసుకోకూడదు అంటూ చెబుతాడు.

  మామగారిని అవన్నీ ప్రశ్నించిన దీపక్

  మామగారిని అవన్నీ ప్రశ్నించిన దీపక్

  అక్కను తీసుకుని వచ్చిన దీపక్.. ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుంటాడు. అప్పుడు మామగారు వచ్చి లోపలికి రమ్మంటాడు. ఆ సమయంలో కోపంతో ఉన్న దీపక్ ‘ఎలా రమ్మంటారు మామయ్య గారు? మా అక్కకి ఈ ఇంట్లో జరిగిన అవమానాలను మర్చిపోవాలా? మీరు కూడా మీ కొడుక్కి చెప్పలేకపోయారు' అంటాడు. అప్పుడు ఆయన కూడా జరిగిన దానికి ఎమోషనల్ అవుతాడు.

  నందూ జీవితంపై జోష్యం చెప్పిన దీపక్

  నందూ జీవితంపై జోష్యం చెప్పిన దీపక్

  ఇంట్లో నుంచి వెళ్లిపోతోన్న సమయంలో దీపిక్‌కు ఎదురుగా లాస్య, నందూ కనిపిస్తారు. అప్పుడు అతడు కోపంతో రగిలిపోతుంటాడు. దీంతో నందూ ‘ఏంటి అలా చూస్తున్నావ్ కొడతావా' అంటాడు. దీనికి లాస్య ఎగతాళిగా మాట్లాడుతుంది. అప్పుడు దీపక్ ‘నిన్ను ఈ లాస్య ముంచే రోజు దగ్గరలోనే ఉంది' అని జోష్యం చెబుతాడు. ఇక, తులసి కూడా పరాయి వాళ్లతో మనకెందుకు అంటుంది.

  అనసూయకు విడాకులు.. మరో ట్విస్ట్

  అనసూయకు విడాకులు.. మరో ట్విస్ట్

  బట్టలన్నీ సర్ధుకుని ఎటో వెళ్లడానికి బయలుదేరుతుంది అనసూయ. అంతలో ఆమె భర్త ఎక్కడికెళ్తున్నావ్ అని ప్రశ్నించగా ‘నా కొడుకు దగ్గరకు వెళ్తున్నా. రెండు రోజులు ఉండి వస్తా. అయినా అక్కడా ఇక్కడా ఉంటాను' అంటుంది. అప్పుడు ఆమె భర్త ‘నువ్వు కూడా అక్కడికి శాశ్వతంగా వెళ్లిపో.. దానికి తగ్గట్లుగా విడాకుల ఏర్పాట్లు చేస్తా' అంటూ బిగ్ షాక్ ఇవ్వడంతో ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 368: Tulasi Came Her Home with Deepak. That Time Deepak Ask Some Questions to Nandu Father. Then He Warn's Nandu and Lasya In Front of Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X