For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 21th Episode: తులసి కొంప ముంచిన డ్రామా..పెళ్లికి ముందే లాస్యతో నందూ అలా!

  |

  తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది వస్తున్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మోహన్ - మాధవి విడాకుల డ్రామా అడినట్లు భాగ్య, లాస్యల ద్వారా నందూకి తెలిసిపోయింది. అంతేకాదు, తులిసిని ఇరికించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతాయి. ఆ తర్వాత లాస్యతో కలిసి అతడు ఇంట్లో పంచాయతీ పెడతాడు. అప్పుడు ఆ నాటకానికి సూత్రధారి తులసి అని భ్రమపడిపోయి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగుతాడు.

  వాళ్లిద్దరూ తులసికి క్షమాపణ చెప్పారు

  వాళ్లిద్దరూ తులసికి క్షమాపణ చెప్పారు

  శుక్రవారం జరగబోయే ఎపిసోడ్‌లో మాధవి, మోహన్ తాము ఆడిన విడాకుల డ్రామా వల్ల పెద్ద గొడవ జరిగినందుకు తులసికి క్షమాపణ చెబుతారు. నందూని మార్చడం కోసమే నాటకం ఆడామని, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాళ్లిద్దరూ ఎమోషనల్ అవుతారు. దీంతో తులిసి దీనిపై సాఫ్ట్‌గా స్పందిస్తూ మీరూ కూడా ఊహించలేదు కదా అంటూ వెళ్లిపోతుంది.

  నందూ ముందు లాస్య ఓవర్ యాక్టింగ్

  నందూ ముందు లాస్య ఓవర్ యాక్టింగ్

  ఒకవైపు బయట వాళ్ల మధ్య సంభాషణలు జరుగుతుండగానే.. లోపల గదిలో ఉన్న లాస్య, నందూ మధ్య వాడీ వేడీ చర్చలు జరుగుతాయి. ‘నువ్వు ఎప్పటికైనా తులసినే మంచిది అనుకుంటావ్. ఆమె ఎన్ని ప్లాన్లు వేసినా ఆమెనే నమ్ముతావు' అంటూ ఏడుస్తుంది. అప్పుడు నందూ ‘నేను ఎప్పటికీ అలా చేయను. కావాలంటే రా ఇప్పుడే నిరూపిస్తా' అంటూ ఆమెను హాల్‌లోకి తీసుకొస్తాడు.

  లాస్య విషయంలో నందూ సంచలనం

  లాస్య విషయంలో నందూ సంచలనం

  లాస్యతో కలిసి హాల్‌లోకి వచ్చిన నందూ అందరినీ లోపలికి రమ్మని కేకలు వేస్తూ పిలుస్తాడు. దీంతో అక్కడే ఉన్న తులసి, మాధవి, ప్రేమ్ సహా అందరూ ఇంట్లోకి చేరుకుంటారు. అప్పుడు ‘ఇకపై ఇంట్లో సర్వాధికారాలు లాస్యవే. ఆమెకు కోడలి హోదా ఇస్తున్నా. ఆమె చెప్పినట్లే అందరూ నడుచుకోవాలి. కాదని ఎదరు తిరిగితే నేను చచ్చిపోతా' అంటూ అందరినీ బెదిరిస్తాడు నందూ.

  నందూకి సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా

  నందూకి సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా

  తన భార్య తులసి ఉండగానే.. లాస్యకు సర్వాధికారాలు ఇస్తానని చెప్పిన నందూపై.. తండ్రి, మోహన్, మాధవి, ప్రేమ్‌లు ఫైర్ అవుతారు. అప్పుడు అందరూ తలో మాట అన్నప్పటికీ అతడు అస్సలు పట్టించుకోడు. అంతేకాదు, మరింత కటువుగా సమాధానాలు చెబుతాడు. అప్పుడు అక్కడే ఉన్న భాగ్య.. తులసి పరిస్థితిని చూసి లోలోపల సంతోషం వ్యక్తం చేయడాన్ని చూపించారు.

  అభికి ఇంట్లో గొడవ వివరించిన దివ్య

  అభికి ఇంట్లో గొడవ వివరించిన దివ్య

  ఈ గొడవ తర్వాత నందూ చెప్పాలనుకున్నదంతా చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దివ్య అక్కడ జరిగిన విషయాన్ని చెప్పేందుకు పెద్ద అన్నయ్య అభికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఏడ్చుకుంటూ విడాకుల డ్రామా నుంచి ఈరోజు జరిగిన గొడవ వరకూ అంతా పూసగుచ్చినట్లు వివరిస్తుంది. అప్పుడు అభి కూడా ‘పాపం మామ్' అంటూ ఎమోషనల్ అవుతుంటాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అన్నయ్యపై కోపాన్ని చూపించిన ప్రేమ్

  అన్నయ్యపై కోపాన్ని చూపించిన ప్రేమ్

  దివ్య.. అభితో ఫోన్ మాట్లాడుతోన్న సమయంలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ‘వాడికి ఎందుకు ఫోన్ చేశావ్? పెళ్లాం మాటలు విని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాడితో బాధలు చెప్పుకోవడం ఎందుకు? వాడు అన్నయ్యే అయినా బాధ్యత లేని వాడు. కాబట్టి వాడు ఉన్నా లేనట్లే' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అవన్నీ విన్న అభి.. ఆ తర్వాత కాల్ కట్ చేస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. ఈ సీరియల్ సమాచారం ఫిల్మీబీట్‌లో కొనసాగుతోంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 325: Madhavi along with her husband Mohan apologize to Tulasi. Nandu then announces Lasya as his wife.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X