For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi May 25th Episode: భార్య ముందే నందూ కొత్త కాపురం.. తులసి ప్రేమ అర్థమయ్యే ఘటన

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది వస్తున్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో తులసి ఉగ్రరూపం చూపిస్తుంది. తనకు జరుగుతున్న అవమానాల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఆమె.. లాస్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్పుడు నందూతో ఓ రేంజ్‌తో గొడవ పడుతుంది. ఆ తర్వాత అతడు కూడా లాస్యతో పాటే బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత అనసూయ, భాగ్యకు కూడా తులసి గట్టి వార్నింగ్ ఇస్తుంది.

  అభితో గొడవకు దిగిన భార్య అంకిత

  అభితో గొడవకు దిగిన భార్య అంకిత

  సోమవారం మొత్తం తులసికి సంబంధించిన కథను చూపించగా.. మంగళవారం జరిగే ఎపిసోడ్‌లో అంకిత - అభి మధ్య సన్నివేశాలను హైలైట్ చేశారు. అప్పుడే ఆస్పత్రి నుంచి వచ్చిన భర్తతో అంకిత బయటకు వెళ్దాం అంటుంది. దీనికి అభి నిరాకరిస్తాడు. దీంతో ఆమె అతడితో గొడవకు దిగుతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేనోడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావని ప్రశ్నిస్తుంది.

  అత్తింట్లో అభికి అతిపెద్ద అవమానం

  అత్తింట్లో అభికి అతిపెద్ద అవమానం


  అంకితతో జరిగిన గొడవ తర్వాత ఇంట్లోకి వెళ్లిపోతాడు అభి. ఆ తర్వాత కొద్ది సేపటికి డైనింగ్ టేబుల్ వద్దకు వస్తాడు. కానీ, అక్కడ పాత్రలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. దీంతో భార్యను వంట ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తాడు. దీనికి బయటకు వెళ్తామేమోనని వండినవన్నీ కుక్కుకు వేశానని సమాధానం చెబుతుంది. దీంతో కాసేపు డిస్కర్షన్ తర్వాత ఏమీ తినకుండానే ఉండిపోతాడు అభి.

  తల్లి ప్రేమను గుర్తు చేసుకున్న అభి

  తల్లి ప్రేమను గుర్తు చేసుకున్న అభి


  అంకితతో జరిగిన గొడవ తర్వాత అభి.. తన తల్లి తులసి గురించి ఆలోచిస్తాడు. ఇంట్లో నుంచి వచ్చేసి ఎంత తప్పు చేశానో అని గుర్తు చేసుకుంటాడు. అదే సమయంలో తన తల్లి ప్రేను అర్థం చేసుకుంటాడు. అత్తగారింట్లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ.. అదే తన ఇంట్లో అయితే తల్లి ఎంతలా తాపత్రేయ పడేదో ఊహించుకుంటాడు. దీంతో చాలా సేపు అతడు బాధ పడతాడు.

  మరోసారి నందూని రెచ్చగొట్టిన లాస్య

  మరోసారి నందూని రెచ్చగొట్టిన లాస్య

  అభి - అంకిత గొడవ తర్వాత సీరియల్ లాస్య - నందూ దగ్గరకు వెళ్తుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన వీళ్లిద్దరూ కలిసి మందు తాగుతూ కనిపిస్తారు. ఆ సమయంలోనే ఆ గొడవను గుర్తు చేసుకుంటాడు నందూ. అప్పుడు మరోసారి కన్నింగ్ ప్లాన్ వేసిన లేడీ విలన్ లాస్య.. ‘నీకు ఈ భార్య వల్ల పెద్ద అవమానం జరిగింది' అంటూ గుచ్చి గుచ్చి అతడిని మరింతగా రెచ్చగొడుతోంది.

  దాన్ని వదలిపెట్టనంటూ నందూ రచ్చ

  దాన్ని వదలిపెట్టనంటూ నందూ రచ్చ

  లాస్య మాటల వల్ల మరింత రెచ్చిపోయిన నందూ కోపంతో ఊగిపోతాడు. ఆ సమయంలోనే ‘ఏం చేసినా తులసి చేసిన అవమానం మర్చిపోలేకపోతున్నా. నన్ను చూస్తేనే భయపడిపోయేది. అలాంటిది నాకే ఎదురు తిరిగింది. ఆఖరికి దివ్య మనసును కూడా మార్చేసింది. అందరినీ తన వైపునకు తిప్పుకుంది. దాన్ని వదిలి పెట్టను. బాగా బాధ పెడతా' అంటూ లాస్యతో చెబుతాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  భార్య ముందే నందూ కొత్త కాపురం

  భార్య ముందే నందూ కొత్త కాపురం

  దొరికిందే అవకాశం అనుకున్న లాస్య.. నందూని మరింతగా రెచ్చగొడుతుంది. ఈ క్రమంలోనే ‘మనం మనం ఈ గదిలో ఉండి ఏడవడం కాదు నందూ.. తులసి చూసి కుళ్లుకునేంతగా మనం ఎదగాలి. అలా జరగాలి అంటే మీ ఇంటి దగ్గరలోనే మనం అద్దెకు దిగాలి. మనిద్దరిని చూసి తులసి ఏడవాలి. అలా చేస్తేనే నీ విలువ ఆమెకు తెలుస్తుంది' అంటూ కాపురం పెట్టేలా ప్లాన్ చేస్తుందామె.

  English summary
  Intinti Gruhalakshmi Episode 328: Ankitha Do Fighting with Abhi for Refusal to go to Dinner. After big fight in house.. Abhi Feeling Bad for his wife Attitude. Then he Remember his Mother Love.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X