Bigg Boss: ఆ గదిలో తనూజ 40 నిమిషాలు.. ప్రతీవారం అలా అంటూ బండారం బయటపెట్టిన శ్రీజ దమ్ము
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోపై కామన్ మ్యాన్ కేటగిరిలో పాల్గొన్న శ్రీజ దమ్ము తీవ్రమైన ఆరోపణలు చేసింది. అత్యంత పాపులారిటీ షోగా పేరున్న రియాలిటీ గేమ్ షోలో నిర్వాహకుల మానిపులేషన్ గురించి ధ్వజమెత్తింది. ఈ షోలో ఓ కంటెస్టెంట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. తాను ఇంటిలో ఉన్న రోజుల్లో గమనించిన విషయాలను బట్టి నేను తాను ఈ ఆరోపణలు చేస్తున్నాను అని ఆమె తాజాగా వీడియోను రిలీజ్ చేసింది. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా ఓ కంటెస్టెంట్ కోసం నిర్వాహకులు, షో రన్నర్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై శ్రీజ దమ్ము ఏం చెప్పిందంటే..
బిగ్‌బాస్ రియాలిటీ షొ అంటే తనకు ఎంతో ఇష్టం. అయితే స్క్రిప్టు ప్రకారం నడుస్తుందనే ఆరోపణలను, విమర్శలు నమ్మేదానిని కాదు. ఈ గేమ్ షోపై తనకు నమ్మకంతోనే అగ్నిపరీక్షలో పోటీ పడి బిగ్‌బాస్‌కు వెళ్లాను. అయితే అక్కడ తనకు జరిగిన అన్యాయంతో నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి నన్ను ఎలిమినేట్ చేసి పంపిన విధానం బాగాలేదు. కనీసం జర్నీ చూపించకుండా సాగనంపారు. బిగ్‌బాస్ చరిత్రలో అలా అవమానానికి గురైన వారిలో నేనే అనుకొంటా అని శ్రీజ అన్నారు.

ఇక రెండోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ఆహ్వానించి.. అప్పుడు కూడా నన్ను ఎలిమినేట్ చేశారు. ఆ సమయంలోనైనా నా జర్నీ చూపించలేదు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? అలా కాకుండా నా కంటెంట్ విషయంలో తప్పుగా చూపించారు. తనుజా తప్పు చేసినా.. కంటెంట్‌ను తప్పుగా ఎడిట్ చేసి నాదే తప్పు అనే విధంగా చూపించారు. ఇలా నాకు చాలా అన్యాయం జరిగింది అని శ్రీజ దమ్ము వాపోయింది.
బిగ్‌బాస్ హౌస్‌లో పక్షపాతం గురించి శ్రీజ మాట్లాడుతూ.. నేను చాలా వారాలు ఇంట్లో ఉన్నాను. కానీ ఒక్క రోజు కూడా కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లలేదు. కానీ ప్రతీ వారం తనూజ మాత్రం ఆ గదిలోకి వెళ్తుంది. వెళ్లిన ప్రతీసారి 30 నుంచి 40 నిమిషాలు ఉంటుంది. టాపిక్ లేకున్నా గానీ ఆమె మాట్లాడుతుంది. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ప్రతీ వారం వెళ్తుంది అని శ్రీజ బట్టబయలు చేసింది.
శ్రీజ చేసిన కామెంట్స్, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆమె చెప్పిన విషయాలు చూస్తే తనూజకు షో నిర్వహకులు పూర్తిగా సహకారం అందిస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతా స్క్రిప్టు ప్రకారమే తనూజను నడిపిస్తున్నారు అనే వాదనకు బలం చేకూరేలా కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే బిగ్‌బాస్ షోలో జరుగుతున్న విషయాలపై ముఖ్యంగా తనూజకు ఫేవరిజం చూపిస్తున్న తీరుపై మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, అనలిస్ట్ ఆదిరెడ్డి, ఇతర కామెంటేటర్లు కూడా అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనూజా తప్పు చేసినా వాటిని పట్టించుకోవడం లేదు. అందుకు కారణం ఆమె స్టార్ మా ఛానెల్‌కు ముద్దుబిడ్డ అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











