Elimination: బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్? భారీ ట్విస్ట్‌తో రణరంగం!
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో తొలివారం అంచనాలు మించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ షోలో ఊహించని విధంగా సెలబ్రిటీలకు ధీటుగా కామన్ మ్యాన్స్ తమ ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్లు ముప్పు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలే నామినేట్ కావడంతో ఈ వారం వారి నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎలిమినేషన్ విషయంలో షాకింగ్ అంశాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. దాంతో ఈ వారం హోస్ట్ నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన ట్విస్టు వివరాల్లోకి వెళితే..
తొలివారం నామినేషన్ల ప్రక్రియ రంజుగా తీవ్ర వాగ్వాదాల మధ్య ముగిసింది. బిగ్‌బాస్ ఇంటిలో తొలివారం నామినేట్ అయిన వారిలో తనూజ గౌడ, ఫ్లోరా సైనీ,ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, డెమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నారు. వీరందరూ నామినేషన్ ప్రక్రియను ముగించుకొని ఈ వారం ఎలిమినేట్ కావడానికి అవకాశం ఉన్న వారి జాబితాలో చేరారు.

ఇక ఈ వారం అందరి అంచనాలు మించి కెప్టెన్సీ ఎంపిక జరిగింది. హోరా హోరీగా సాగిన టాస్క్‌లో శ్రీజ దమ్ము ధాటిగా ఆడి సంజన గల్రానీకి కెప్టెన్సీని సాధించి పెట్టింది. దాంతో బిగ్‌బాస్ తెలుగు 9 షోలో తొలి కెప్టెన్‌గా సంజన ఎంపికైంది. అయితే తాత్కాలికంగా ఆమె ఇంటికి ఓనర్‌గా మారింది. కెప్టెన్సీతో కొన్ని సౌలభ్యాలు ఆమెకు దక్కాయి. కెప్టెన్సీ పదవి రావడంతో తన మార్కు ఆటను చూపించడం మొదలుపెట్టింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల మధ్య ఎలిమినేషన్‌కు తెర లేపారు.
అయితే తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం జరిగిన ఓటింగ్ విషయంలో ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకు వచ్చాయి. ఇంటిలో టాప్ 5 కంటెస్టెంట్లుగా భావించిన ఇద్దరు టాప్ సెలబ్రిటీలు ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచారు. అయితే గత వారం రోజుల్లో ఇంటిలో తన ఉనికిని చాటుకోలేకపోయిన శ్రష్టి వర్మ ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు. దాంతో ఆమె ఫ్యాన్స్‌కు కొంత అసంతృప్తిగానే ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో స్పష్టమైంది.
ఇక ఈ వారం ఎలిమినేషన్ అవ్వడానికి అవకాశం ఉన్న సెలబ్రిటీలలో ఆశా సైనీ అలియాస్ ఫ్లోరా సైనీ. అయితే సీనియర్ హీరోయిన్‌గా ఆమె పెద్దగా ఆట తీరును ప్రదర్శించలేకపోయింది. ఎక్కువగా ఆమె సంజన గల్రానీతో విభేదించడానికే మొగ్గు చూపింది. దాంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది.
అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో శ్రష్టీ వర్మ గానీ.. లేదా ఫ్లోరా సైనీ గానీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో సంచలన నిర్ణయం తీసుకొనే ఛాన్స్ లేకపోలేదనే ప్రచారం జరుగుతుంది. ఈ సారి ఆట చదరంగం కాదు.. రణరంగం అంటూ సంకేతాలిచ్చిన నాగార్జున.. డబుల్ ఎలిమినేషన్‌తో భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ విషయాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











