Hyper Aadi కి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్.. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటి?

టెలివిజన్, సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు తనదైన హాస్యం, కామెడిని జబర్దస్త్‌ షోతో ప్రదర్శించిన హైపర్ ఆది.. విశేషమైన అభిమానులను సంపాదించుకొన్నారు. అయితే కొద్దికాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ.. పరోక్షంగా, ప్రత్యక్షంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. గత కొద్దికాలంగా పరోక్షంగా స్పందించిన హైపర్ ఆది ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్టు వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. హైపర్ ఆది వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ జీవితంలోకి వెళితే..

పంచ్ డైలాగ్స్‌తో జబర్దస్త్

పంచ్ డైలాగ్స్‌తో జబర్దస్త్


సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన హైపర్ ఆది.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకు డైలాగ్స్ రాస్తూ వినోదరంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రాణించారు. స్వయంగా రాసుకొన్న పంచ్ డైలాగ్స్‌తో అన్ని వర్గాలను ఆకట్టుకొన్నారు. జబర్దస్త్ కామెడీ షోకు బ్రాండ్ అంబాసిడర్ అనేంత రేంజ్‌కు తన క్రేజ్ పంచుకొన్నాడు.

టాలీవుడ్, టెలివిజన్‌లో

టాలీవుడ్, టెలివిజన్‌లో


జబర్దస్త్ కామెడీ షోతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన హైపర్ ఆది తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌లో ప్రేక్షకులను తనదైన హాస్యంతో మెప్పించే ప్రయత్నం చేశారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు హాస్య ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇలా టెలివిజన్, సినీ రంగాల్లో తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు.

మెగా అభిమానిగా గుర్తింపు

మెగా అభిమానిగా గుర్తింపు


అయితే కమెడియన్‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది మెగా అభిమానిగా ముద్ర వేసుకొన్నాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు అభిమానిని పలు సందర్బాల్లో చెప్పుకొన్నారు. కొందరు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతూ వస్తున్నారు. అలాగే పలు వేదికలపై మెగా బ్రదర్స్‌కు తన అభిమానాన్ని చాటుతూ ప్రేమను సంపాదించుకొన్నాడు. అలాగే జనసేన ఆవిర్బావం నుంచి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో మద్దతు తెలియజేస్తూ వస్తున్నారు.

జనసేన పార్టీకి అభిమానిగా

జనసేన పార్టీకి అభిమానిగా


గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం, గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. జనసేన అభ్యర్థుల కోసం తన స్నేహితులు, సన్నిహితులతో కలసి ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే వారిపై ఘాటుగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. అలా జనసేనపై అభిమానంతో రాజకీయం రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దమవుతున్నారు.

ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్‌తో కలిసి

ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్‌తో కలిసి


ఇక ఇటీవల ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే వారిపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ విజన్, జనసేన పార్టీని గెలిపిస్తే.. ఏం చేస్తారో సవివరంగా చెప్పారు. హైపర్ ఆది ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అసెంబ్లీ సీటుపై పవన్ క్లారిటీ?

అసెంబ్లీ సీటుపై పవన్ క్లారిటీ?


అయితే తాజాగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్త ప్రకారం.. హైపర్ ఆది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే హైపర్ ఆదికి టికెట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. అయితే వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆదికి దర్శి, లేదా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్త వైరల్ అవుతున్నది. గతంలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఆ స్థానం నుంచి హైపర్ ఆదికి టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X