మెహబూబ్, సోహెల్ ఫ్రెండ్‌షిప్
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో ముఖ్యంగా మెహబూబ్ దిల్ సే, సయ్యద్ సోహెల్ ర్యాన్ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గేమ్‌లో హైలెట్ అయింది. ఒకరికోసం మరొకరు ఎంతకైనా తెగించడం కనిపించింది. టాస్కుల విషయంలో వారిద్దరి ఒకరికొకరు సపోర్టు చేసుకోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
అభిజిత్ నాకు పెద్దన్నయ్య అంటూ
ఇక సోహెల్‌తోపాటు అభిజిత్‌తో కూడా తనకు మంచి అనుబంధం ఉందనే విషయాన్ని మెహబూబ్ తన ఎలిమినేషన్ తర్వాత నాగ్‌కు వెల్లడించారు. అభిజిత్ నాకు పెద్దన్న లాంటి వాడు. నేను మానసిక సంఘర్షణకు గురైన ప్రతీసారి నాకు అండగా నిలిచారు అంటూ మెహబూబ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
మెహబూబ్ నిర్వాకంతో
అయితే అభిజిత్‌తో స్నేహాన్ని కొనసాగించినా మోహబూబ్ తన ప్రయారిటీ సోహెల్ అనే విషయాన్ని పలు సందర్భాల్లో తన హావభావాల్లో వ్యక్తంచేశారు. అయితే కీలకంగా మారిన బిగ్‌బాస్ ఫైనల్ డేకు ముందు రోజు మెహబూబ్ చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మెహబూబ్ అత్యుత్సాహం
టాప్ 4 కంటెస్టెంట్లు ఇంట్లో ఉండగా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో రీయూనియన్ సెలబ్రేషన్‌ను నిర్వహించారు. ఇంటిలోకి వచ్చిన సభ్యులు టాప్ కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. వారిలో ఉన్న టెన్షన్‌ను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మెహబూబ్ అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదంగా మారింది.
మెహబూబ్ మూడు వేళ్లతో సంకేతాలు..
ఇంటి సభ్యులందరూ మెహబూబ్‌తో మాట్లాడుతుండగా.. సోహెల్‌కు మెహబూబ్ సంకేతాలు అందించారు. మూడు వేళ్లు చూపించడం కనిపించించింది. అలాగే డబ్బు గురించి ఏదో సైగలు చేయడం కూడా స్పష్టమైంది. నీ స్థానం మూడోది. కాబట్టి డబ్బు ఆఫర్ చేస్తే తీసుకోవడమే కరెక్ట్ అనే విధంగా వేళ్లను చూపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మెహబూబ్ ఇంటిలో ఉన్నంత సేపు అతడి వేళ్లపైనే సోహెల్ దృష్టిపెట్టడం కనిపించింది. మెహబూబ్ అందించిన సంకేతాలతోనే ఫైనల్‌కు ముందే తన వ్యూహాన్ని పక్కాగా ఏర్పరుచుకొన్నారనే విషయం స్పష్టమైందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ బకరా.. సోహెల్ పక్కా ప్లాన్
ఇక అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటూనే సోహెల్ తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడని నెటిజన్లు అంటున్నారు. సోహెల్‌ను అఖిల్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే.. ఫైనల్‌లో తన వ్యూహాలతో అఖిల్‌ను సోహెల్ బకరా చేశాడు. రన్నరప్ కంటే ఎక్కువగా క్రెడిట్ కొట్టేసి రియల్ హీరో అయ్యేందుకు ప్రయత్నించాడనే మాటలను నెటిజన్లు, ప్రేక్షకులు అనుకోవడం వైరల్‌గా మారాయి.
పెద్దన్న అంటూనే అభిజిత్‌కు షాక్
అభిజిత్‌ను పెద్దన్న అంటూనే మెహబూబ్ హైడ్రామా ప్లే చేశాడు. తన స్నేహితుడు సోహెల్‌కు ముందే హింట్లు ఇచ్చి అప్రమత్తం చేశాడు. దాంతో అభిజిత్ ప్రైజ్‌మనీలో సోహెల్ కోత పెట్టేలా ప్లాన్ చేసుకొన్నాడు. మెహబూబ్ ఇచ్చిన సంకేతాలతోనే సోహెల్ ఇంట్లో తన ప్లాన్స్, వ్యూహాలకు పదనుపెట్టాడనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.