RJ Kajal ఎలిమినేషన్ తప్పదా? చేతులు కాలిన తర్వాత ఆకులా.. కాజల్‌పై వీజే సన్నీ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో పదో వారం నామినేషన్ల ప్రక్రియ మరోసారి ఇంటి సభ్యుల్లో చిచ్చు పెట్టింది. బిగ్‌బాస్ ఆదేశాలతో నలుగురిని కెప్టెన్ అనీ మాస్టర్ జైల్లో పెట్టిన తర్వాత ఇంటి సభ్యులతో గేమ్ ఆడించాడు. జైల్లో ఉన్న వారిని బయటకు తీసి నామినేషన్ నుంచి ఫ్రీ చేసే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చాడు. దాంతో తమకు నచ్చిన కంటెస్టెంట్లను ఇంటి సభ్యులు బయటకు తీసుకువచ్చి నామినేషన్ నుంచి సేవ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే మానస్‌, సన్నీతో క్లోజ్ ఉంటున్న ప్రియాంక, కాజల్ మాత్రం వారిని జైలు నుంచి బయటకు తీసుకు రాకపోవడంతో ఆ ఇద్దరు కోపంతో ఉన్నారు. ఈ సందర్బంగా కాజల్ తన విషయంలో ఏం జరిగిందనే చెప్పడానికి ప్రయత్నిస్తూ...

ఈ ఒక్క వారమే ఉంటా నేను..

ఈ ఒక్క వారమే ఉంటా నేను..

నామినేషన్ ప్రక్రియ తర్వాత కోపంతో ఉన్న మానస్, వీజే సన్నీ వద్దకు కాజల్ వచ్చి మెల్లగా కూర్చున్నది. దాంతో వాట్ కాజల్ అంటూ సన్నీ మందలించాడు. దాంతో ఈ ఒక్క వారమే కదా.. నాతో మంచిగా మాట్లాడండి. నేను ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ. కాబట్టి నాతో మంచిగా ఉండండి అంటూ దీనంగా ముఖం పెట్టి కాజల్ ప్రాధేయపడింది.

కాజల్ నీవు ఎలిమినేట్ అవుతావా?

కాజల్ నీవు ఎలిమినేట్ అవుతావా?

అయితే నేను ఎలిమినేట్ అవుతానని చెప్పడంపై వీజే సన్నీ సెటైర్లు వేశాడు. నీవు ఎలిమినేట్ అవుతావా? బిగ్‌బాస్ నుంచి నువ్వు ఎలిమినేట్ అవ్వడం ఏమిటి కాజల్ అంటే... అవును నేను ఎలిమినేట్ అవుతానని నాకు అనిపిస్తున్నది అని కాజల్ చెప్పింది. దాంతో నువ్వు ఎలా ఎలిమినేట్ అవుతావు కాజల్.. నీవు నామినేట్ అవుతావనే నీకు తెలియదు. ఎలా ఎలిమినేట్ అవుతావు అని కాజల్ ప్రశ్నించాడు.

నన్ను దూరం పెట్టకండి అంటూ

నన్ను దూరం పెట్టకండి అంటూ

సన్నీ మాటలకు కాజల్ జవాబిస్తూ.. నేను నామినేట్ అవుతానని నాకు తెలుసు అని సమాధానం ఇస్తే.. మరి నన్ను .. సన్నీనా? మానసా? ఎవరో ఒకరు డిసైడ్ అవ్వమని ఎందుకు అడిగావు అని సన్నీ అడిగాడు. దాంతో నన్ను ఇలా దూరం పెట్టకండి. మీరు ఇద్దరు నాకు ఒకటే అని కాజల్ సమాధానం ఇచ్చింది. దాంతో ఆ విషయం పక్కన పెట్టు అంటూ వీజే సన్నీ సీరియస్‌గా బదులిచ్చాడు.

నీకు సపోర్ట్ చేస్తే... మాకు అన్యాయమా?

నీకు సపోర్ట్ చేస్తే... మాకు అన్యాయమా?

మమ్మల్ని సేఫ్ చేయకుండా నీవు గేమ్ ఆడావు. కొన్ని వారాలుగా నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నీకు అండగా ఎవరు ఉన్నారు అనే విషయం గుర్తు ఉందా? టాస్క్ సమయంలో రాత్రిపూట అర్ధరాత్రి పురుగుల మధ్య ఎవరు పడుకొన్నారనే విషయం గుర్తు ఉంటే.. నీవు ఇలా బిహేవ్ చేయవు. నీకు తోడుగా ఉన్నది ఎవరు? నీకు సమస్యలు ఉంటే ఎవరు సపోర్ట్ చేశారు. నీతో ట్రావెల్ అయ్యింది ఎవరు? ఇలాంటివి నీకు గుర్తుకు రాలేదా? అంటూ కాజల్‌ను సన్నీ కడిగిపడేశాడు.

కాజల్‌కు క్లాస్ పీకిన వీజే సన్నీ

కాజల్‌కు క్లాస్ పీకిన వీజే సన్నీ

షణ్ముఖ్ ఏదో లెటర్ ఇచ్చాడనే కారణంతో అతడిని సేవ్ చేస్తావా? అని వీజే సన్నీ గట్టిగా క్లాస్ పీకాడు. దాంతో నాకు పే బ్యాక్ టైమ్ వచ్చిందని సేవ్ చేశాను అని అని కాజల్ చెబితే.. సన్నీ, మానస్ పట్టించుకోలేదు. అయితే పే బ్యాక్ అని ప్రియాంక అడిగితే.. కాజల్ ఇవన్నీ వద్దు.. ఈ వారాంతం వరకు ఓపికపట్టు. ఎవరు వెళ్లిపోతారో చూడండి.. అంటే.. అలా అనకు మానస్ అని ప్రియాంక బుజ్జగించే ప్రయత్నం చేసింది.

 కాపాడే శక్తి ఉన్నా.. మానస్‌ను కాపాడలేకపోయి..

కాపాడే శక్తి ఉన్నా.. మానస్‌ను కాపాడలేకపోయి..

మానస్‌ను కాపాడకుండా కాజల్ చేసిన నిర్వాకంపై వీజే సన్నీ మండిపడ్డాడు. నీకు కాపాడే శక్తి ఉన్నప్పుడు కాపాడకుండా.. ఇప్పుడు నీకు పూజలు చేస్తా.. అది చేస్తా అంటే కుదరదు అని వీజే సన్నీ అంటే.. నాకు కాపాడే అవకాశం ఉందా అని పింకీ సమాధానం ఇచ్చింది. దాంతో నిన్ను ఎవడు అంటున్నాడు అని సన్నీ ఘాటుగా స్పందించాడు.

వాళ్ల గేమ్ ప్లాన్ నీవు ఫిక్స్ అంటూ

వాళ్ల గేమ్ ప్లాన్ నీవు ఫిక్స్ అంటూ

అయితే మానస్ మాటలకు నొచ్చుకొన్న కాజల్ మాట్లాడుతూ.. నేను వెళ్లిపోతే అంటూ ఏదో చెప్పబోయింది. అయితే నీకు మమ్మల్ని కాపాడే ఛాన్స్ ఉన్నప్పుడు.. మేము ఎవరు ఉన్నా సరే.. మాతో ఉన్నట్టే.. మనం ముగ్గురు సేఫ్ అవుతాం. కానీ వాళ్ల గేమ్ ప్లాన్‌లో నీవు చిక్కుకుపోయావు. మన ముగ్గురిలో ఒక్కరు అవుట్ అవ్వాలని ప్లాన్ చేశారు. అందులో నీవు ఫిక్స్ అయ్యావు అని మానస్ అన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : ఈ వారం ట్విస్ట్ ఇదే..!! || Filmibeat Telugu
చేతులు కాలిన తర్వాత ఆకులు అంటూ

చేతులు కాలిన తర్వాత ఆకులు అంటూ

అయితే కాజల్ చేసిన పనికి వీజే సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొంటే లాభం ఏమిటి? ఇప్పుడు వచ్చి సారీ అంటే దాని వల్ల లాభం ఏమిటి? నీవు చేయాల్సిన సమయంలో చేయకుండా.. నీకు కాపాడే శక్తి ఉన్నప్పుడు కాపాడకుండా ఇప్పుడు వచ్చి మాటలు చెప్పడం ఏమిటి అంటూ వీజే సన్నీ గట్టిగా క్లాస్ పీకుతూ కనిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X