Just In
- 27 min ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 38 min ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
- 40 min ago
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారే..
- 1 hr ago
‘రౌడీ’తో అభిజిత్ రచ్చ.. పిక్ వైరల్
Don't Miss!
- News
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్‌పై నోయల్ సంచలన వ్యాఖ్యలు: అలా మోసం చేయడం వల్లే ఇలా రియాక్ట్!
సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి తనలోని ఎన్నో రకాల టాలెంట్లను బయటపెడుతూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నోయల్ సీన్. అద్భుతమైన నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన అతడు.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కొద్ది రోజుల పాటు మంచి ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు.. అనివార్య కారణాలతో షో నుంచి బయటకు వచ్చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆ షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో నోయల్ కామెంట్స్ వెనుక అసలు రహస్యం ఇదేనంటూ ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చాడు.. ఇలా ఫేస్ అయ్యాడు
కెరీర్ ఆరంభంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు నోయల్ సీన్. అక్కడ కొన్ని షోలకు మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు. ఆ తర్వాత ర్యాప్ సాంగులతో బాగా ఫేమస్ అయ్యాడు. పాటల రచయితగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో ఎన్నో సినిమాలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించాడు.

వైవాహిక జీవితంలో భారీ కుదుపులు
ఆల్‌రౌండ్ నైపుణ్యంతో కెరీర్‌ను సూపర్‌గా ప్లాన్ చేసుకున్న నోయల్.. వైవాహిక జీవితాన్ని మాత్రం చక్కగా నడిపించుకోలేకపోయాడు. హీరోయిన్ ఎస్తర్‌తో చాలా రోజుల పాటు ప్రేమాయణం సాగించిన అతడు.. గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. ఇటీవలే వీళ్లిద్దరూ న్యాయపరంగా విడిపోయారు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. మంచోడిగా పేరు
ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నోయల్. వచ్చీ రావడంతోనే తన మార్క్ చూపించి సత్తా చాటాడు. ప్రతి విషయాన్ని ముందే గ్రహించి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లతో కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సమయంలోనే పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఊహించని విధంగా బయటకొచ్చాడు
బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ అప్పుడప్పుడే రక్తి కడుతోన్న సమయంలో నోయల్ అనారోగ్య కారణాలతో షో నుంచి బయటకు వచ్చేశాడు. అంతేకాదు, వచ్చేటప్పుడు అవినాష్, అమ్మ రాజశేఖర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో అభిజీత్, లాస్య, హారికలకు సపోర్ట్ చేస్తానని.. వీళ్ల ముగ్గురిలో ఒకరికి గెలిపించేందుకు బయటి నుంచి పని చేస్తానని చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్‌పై నోయల్ సంచలన వ్యాఖ్యలు
ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో నోయల్‌ను టైటిల్ ఫేవరెట్ అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బయటకు వచ్చాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అసలు బిగ్ బాస్‌కు ఎందుకు వెళ్లానో అర్థం కావట్లేదు. అసలు ఆ షో మనకి అవసరమే కాదు. బయటికొచ్చాక అది చూడడమే మానేశాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిపోయాడు.

మోసం చేయడం వల్లే ఇలా రియాక్ట్
ఉన్నట్లుండి బిగ్ బాస్‌పై నోయల్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. నోయల్‌ను బిగ్ బాస్‌లోకి మళ్లీ తీసుకుంటామని, రీఎంట్రీకి సిద్ధంగా ఉండమని షో నిర్వహకులు చెప్పారట. కానీ, లాస్ట్ మినిట్‌లో రీఎంట్రీపై యూటర్న్ తీసుకున్నారట. ఈ కారణంగానే నోయల్ అలా రియాక్ట్ అయి ఉంటాడన్న టాక్ వినిపిస్తోంది.