For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెలుగులోకి 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' మోసం... కేసు

  By Srikanya
  |
  Amitabh Bachchan
  పూనా: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ టివి కార్యక్రమం దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది. కాని ఆయన పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్న వైనం కూడా ఇటీవలే వెలుగులోనికి వచ్చింది. దీన్ని 'అడ్వాన్స్‌ ఫీ కుంభకోణం'గా పోలీసులు పేర్కొంటున్నారు.

  వివరాల్లోకి వెళితే.... పూనాలో నివాసముంటున్న 42 ఏళ్ల గృహిణికి కొద్దిరోజుల క్రితం ఒక కాల్‌ వచ్చింది. ప్రారంభంలో 2 సున్నాలతో మొత్తం 15 అంకెలు ఆ మొబైల్‌ నంబర్లో ఉన్నాయి. అందులో తనను తాను విజయకుమార్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి ఒక ఎర చూపాడు. కెబిసి నిర్వహించిన లక్కీడ్రాలో సదరు గృహిణికి కోటిరూపాయలు బహుమానంగా వచ్చాయి అని 50 మంది ఇతర అదృష్టవంతులతో కలసి ఆమె ప్రైజ్‌ పంచుకోవాల్సి ఉంటుందని అతడు వెల్లడించాడు. ఇందుకోసం అడ్వాన్స్‌ ఫీజుగా రూ.10,000వేలు ఒక బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేయాలని కోరాడు.

  ఆమె అపుడు సమాధానం ఇవ్వలేదు. తర్వాత కొద్దిరోజులకు మరో ఇద్దరు వ్యక్తులు ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేశారు. ఇది ప్రమాదకరంగా ఆమెకు కనిపించింది. 'మీ వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ మాకు తెలుసు. మీరు ఎవరో మాకు తెలుసు. అందువల్ల రూ.10,000 జమ చేయండి'' అని వారు ఆమె నంబర్‌ కూడవెల్లడించారు. దాంతో ఆమె భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత వివరాలు తెలిసినవారు ఏమైనా చేయవచ్చని ఆమె ఆందోళన చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.

  ఈ రియాల్టీ షో వల్ల అమితాబ్ తిరిగి కోల్పోయిన పూర్వవైభవం మరలా తిరిగిపోందారు. అంతేకాకుండా తనకంటూమరలా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు 4 కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోలు చేయడం జరిగింది. దీని ద్వారా అమితాబ్ యావత్ భారతదేశం ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది.

  స్టార్‌ప్లస్‌, సినర్జీ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టీవీషోలు సిద్ధార్థ్‌ బసు నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌ నేతృత్వం లో ఇవి అత్యంత జన మనోరంజకంగా వర్ధిల్లాయి. ఆ తర్వాత కారణాంతరాల వల్ల అమితాబ్‌బచ్చన్‌ ఈ షోల నుంచి విరమించు కోవడం, బాలీవుడ్‌ కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు ఈ షోలు కొనసాగినా, అవి అంతగా జనాన్ని ఆకర్షించలేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.

  English summary
  Advance fee fraud in the name of KBC is taking place in the city for the first time, say police. Puneites need to tread cautiously if they get any call informing that they have won lakhs of rupees as part of popular quiz show Kaun Banega Crorepati (KBC) and need to deposit a caution money to a certain bank account to claim the same.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X