జబర్దస్త్ 12 ఇయర్స్ పార్టీ... అందరినీ వదిలేసి రష్మీతో సుడిగాలి సుధీర్ అలా!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది తారలు పెళ్లి పీటలెక్కుతున్నారు. కానీ కొందరు మాత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఇంకా కొనసాగుతున్నారు. ఎప్పటికప్పుడు వారి పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా.. వారు మాత్రం లైల్ తీసుకుంటున్నారు. ఇక చాలామంది తమ కో స్టార్స్, ఇతర నటీనటులతో సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తూ.. ఈ విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు. ఏమైనా అడిగితే మా మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నారు. కానీ పార్టీలు, పబ్‌లు, రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతుంటారు. వెండితెర, బుల్లితెరపై ఇలాంటి జంటలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తారు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్. తాజాగా వీరిద్దరూ మరోసారి దొరికిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా సుధీర్
జబర్దస్ద్‌లో కమెడియన్‌గా అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్.. తన పంచ్ డైలాగ్స్, టైమింగ్‌తో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ఏకంగా హీరో అయిపోయాడు. అయినప్పటికీ బుల్లితెరను మాత్రం వదిలిపెట్టకుండా హోస్ట్‌గా అలరిస్తున్నాడు సుడిగాలి సుధీర్. మొత్తం మీద తెలుగు బుల్లితెరపై స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. ఇక తెలుగునాట మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీసుకొస్తే ఖచ్చితంగా సుధీర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. 40కి చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో సుధీర్ మ్యారేజ్‌పై ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి.

రష్మీ - సుధీర్ మధ్య ఎఫైర్
జబర్దస్త్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్‌కు సుధీర్‌కు మధ్య ఎఫైర్ ఉందని కొన్నేళ్లుగా గాసిప్స్ వస్తున్నాయి. జబర్దస్త్ స్కిట్స్ మధ్యలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు.. ఒకరికొకరు ఇష్టం చూపుకోవడం, సుధీర్ మాటలకు రష్మీ సిగ్గుపడిపోవడంతో జనాలు కూడా మురిసిపోయారు. ఇద్దరూ ఒక్కటైతే బాగుంటుందని ఆశపడ్డారు. అయితే ఇదంతా కేవలం డ్రామా మాత్రమేనని, షోలను హిట్ చేసేందుకు వీరిద్దరి మధ్య ఫేక్ లవ్ ట్రాక్ పెట్టారనే వాదనలు కూడా లేకపోలేదు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరూ ఖండించకపోవడం, ఇద్దరూ పెళ్లి మాట ఎత్తకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సుధీర్ కోసం రష్మి.. రష్మి కోసం సుధీర్ వెయిట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి.
జబర్దస్త్‌కే అంకితమైన రష్మీ
రష్మి గౌతమ్ విషయానికి వస్తే.. ఎంతమంది జడ్జిలు, కమెడియన్లు, యాంకర్లు మారినా తను మాత్రం ఈటీవీని, జబర్దస్త్‌ను వదిలిపెట్టడం లేదు. జబర్దస్త్‌తో పాటు మరికొన్ని కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మానసికంగా బాగా డిస్ట్రబ్ అయిన రష్మి గౌతమ్ కొన్నాళ్లు సోషల్ మీడియాకు, డిజిటల్ వస్తువులకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో పెళ్లి చేసుకుని త్వరలోనే సెటిల్ అయిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు.. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌లను ఒకే స్టేజ్‌పై చూసి చాలాకాలమే అవుతోంది. జబర్దస్త్‌ను వీడి ఓటీటీలు, సినిమాలు, ఇతర ఛానెల్స్‌లో పనిచేస్తున్నాడు సుధీర్. మధ్యలో పండగలు, ఇతర పర్వదినాల్లో ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల్లో మాత్రమే ఈ జంట తళుక్కున మెరుస్తోంది.
రష్మీతో సుధీర్ క్లోజ్‌గా
ఇదిలాఉండగా.. రష్మీ గౌతమ్‌పై తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కార్యక్రమం మొదలై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల మల్లెమాల సంస్థ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసి ఇప్పటి వరకు జబర్దస్త్‌లో పనిచేసిన యాంకర్లు, జడ్జిలు, కమెడియన్స్‌ను ఆహ్వానించింది. వీరంతా తమకు జీవితాన్నిచ్చిన వేదికపై తమ గురువులకు పాదపూజ చేసి మల్లెమాలకు, ఈటీవీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యాచ్ రీ యూనియన్ దావత్ పేరుతో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా భోజనాల దగ్గరికి రష్మీ గౌతమ్ వచ్చి తింటుండగా సుధీర్ వచ్చాడు. అందరినీ పలకరిస్తూ అంతమందిలోనూ రష్మీ గౌతమ్‌ని చూసి సంతోషించాడు. వెంటనే బిర్యానీని తీసుకుని ఆమె వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











