ఆ స్థితిలో అలా బస్టాండ్‌లో పడుకున్నా. స్టార్ యాంకర్‌కు కష్టాల గుండెకోత

Anchor Soumya Rao: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సౌమ్యా రావు. పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా యాంకర్‌గా వెండితెరపైకి వచ్చిన ఆమె, తన అందం, టాలెంట్, చలాకీతనంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. చాలా కాలం యాంకరింగ్‌ చేయకపోయినా, తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఆడియెన్స్ మదిలో నిలిచిపోయింది. ఈ అమ్మడు జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'కిసిక్క్ టాక్స్'లో పాల్గొని, తన వృత్తి, వ్యక్తిగత జీవితంలోని కష్టాలను, ఆసక్తికర విషయాలను పంచుకుంది.

కన్నడ భామ సౌమ్యా రావు 2018లో నటన వైపు అడుగుపెట్టింది. తొలుత తమిళ టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుని తన కెరీర్‌ను ప్రారంభించింది. సౌమ్యా నటించిన తొలి ప్రాజెక్ట్ తమిళ సీరియల్ 'రోజా'. ఈ సీరియల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పాటు నెంజమ్ మరప్పదిల్లై, వల్లి, మిన్నలే, తిరుమతి హిట్లర్, శ్రీమంతుడు వంటి పలు తమిళ సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో సక్సెస్ సాధించిన తర్వాత సౌమ్యా, తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. 'శ్రీమంతుడు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే, కామెడీ షో 'జబర్దస్త్' యాంకరింగ్‌తో ఒక్కసారిగా ఫుల్ పాపులారిటీని సంపాదించింది.

Jabardasth Anchor Soumya Rao Shares Emotional Childhood Struggles and Success

తన ఇంగ్లీష్ ప్రొనన్సియేషన్, సరదా మాటలు, స్పాంటేనియస్ కౌంటర్లతో ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా హైపర్ ఆది టీంతో చేసిన పంచులు, నెపాలు షోకు స్పెషల్ హైలైట్ అయ్యాయి. తక్కువ సమయంలోనే తెలుగు ఆడియెన్స్‌లోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సౌమ్యా రావు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన లైఫ్, కెరీర్, అనుభవాల గురించి ఇంటర్వ్యూల ద్వారా పంచుకుంటూ వస్తోంది. ఇటీవల 'జబర్దస్త్' సౌమ్యా రావు కిసిక్ టాక్ షోలో పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ సందర్భంగా సౌమ్యా రావు భావోద్వేగానికి లోనవుతూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కష్టాలను వివరించింది. వర్ష తెలిపిన దాని ప్రకారం, చిన్నప్పటి ఆర్థిక ఇబ్బందులు చాలా తీవ్రమైనవని, వాటి జ్ఞాపకం ఇప్పటికీ మరువలేనిదని చెప్పింది. ఒకసారి ఆమె తల్లి తిరుపతికి తీసుకువెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, "ఆ సమయంలో మా దగ్గర కేవలం 100 - 120 రూపాయలే ఉన్నాయి. రాత్రి రెండు గంటలకు అక్కడికి చేరుకున్నాం. డబ్బులు లేక బస్ స్టాండ్‌లోనే నిద్రపోవాల్సి వచ్చింది. రెండు రోజులు అన్నం తినకుండా ఉన్నాం. కనీసం వాష్‌రూమ్‌కి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డాం" అని తెలిపింది.

ఇక తనకు పిరియడ్స్ ఉన్న సమయంలోనే ఆ కష్టాలు రావడం, అలాంటి పరిస్థితిలో దేవుని దర్శనానికి వెళ్ళి కూడా అన్నం ఎప్పుడు పెడతారో అని ఎదురు చూసిన సందర్భాన్ని వర్ష కన్నీళ్లతో గుర్తు చేసుకుంది. "తిరుపతికి వెళ్తే అందరూ దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నేను మాత్రం ఎప్పుడు అన్నం పెడతారా అని ఆశగా చూస్తున్నాను. అప్పుల వల్ల మా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అప్పట్లో ఇంటికి రావద్దనిపించేది" అని ఆమె వెల్లడించింది. తన చిన్ననాటి కష్టాలు గుర్తుచేసుకున్న వర్ష, "నేను జీరో నుండి ఈ స్థాయికి వచ్చాను. పెన్ను, పెన్సిల్, పుస్తకం కొనడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ అమ్మాయి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అనిపించేది. కానీ నేను ఎదుర్కొన్న ప్రతి కష్టం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది" అని చెప్పింది. తన జీవితం ద్వారా అందరికీ ఒక సందేశం ఇస్తూ, కష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితేనే విజయం సాధించవచ్చని వర్ష చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Read more about: jabardasth soumya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X