Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
నా పెళ్లి కాకపోతే మీరే కారణం.. శ్రీముఖి, యాంకర్ ఝాన్సీపై జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఫైర్
జబర్దస్త్ కామెడీ షో టెలివిజన్, సినీ ఇండస్ట్రీలకు ఎంతో మంది ప్రతిభావంతులైన యాకర్లను, యాంకర్లను అందించింది. అలా తెరపైకి వచ్చిన కమెడియన్లలో జబర్దస్త్ అవినాష్ ఒకరు. చాలా తక్కుకాలంలో తన టాలెంటెడ్‌తో అన్ని వర్గాలను ఆకట్టుకొని సెలబ్రిటీ స్టాటస్‌ను సంపాదించుకొన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వంతో కనిపించే రాకేష్ వివిధ ఛానెల్స్‌లో పలు షోలలో పాల్గొని ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా యాంకర్ ఝాన్సీ నిర్వహించే లవ్ యూ జిందగీ అనే కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ చేసిన ఆసక్తికరమైన కామెంట్లు ఏమిటంటే..
Recommended Video

అవినాష్ స్కిట్లకు మంచి రెస్పాన్స్
జబర్దస్త్ కామెడీ షోలో అవినాష్ స్కిట్‌కు విశేష ఆదరణ ప్రేక్షకుల నుంచి ఉంది. తాను మాట్లాడే తీరు.. చేసే మిమిక్రీ, ప్రదర్శించే హావభావాలు ఆయన అందరికీ ఫేవరేట్‌గా మారిపోయారు. ముక్కు అవినాష్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన ఏ షోలో ఉన్నా అక్కడ సందడి సందడిగా మారిపోతుంటుంది. అందుకే పలు చానెల్స్‌లో పలు కార్యక్రమాల హోస్ట్‌లు రాకేష్ ఉండేటట్టు చూసుకొంటారు.

అవినాష్‌ను ఆటపట్టిస్తూ..
యాంకర్ సుమ గానీ, ఝాన్సీ గానీ, మరెవరైనా గానీ.. అవినాష్‌ను ఆటపట్టిస్తూ ఫన్నీగా ఏడిపిస్తుంటారు. తనపై వేసే సెటైర్లు మరో కమెడియన్ మీద వేసి ఉండరనే ఫీలింగ్ కలుగుతుంది. తను జోవియల్‌గా, స్పోర్టివ్‌గా ఉండటమే అందుకు కారణమనే మాట వినిపిస్తుంటుంది. అవినాష్ తన లాంగ్వేజ్ ఎవరినైనా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా లవ్ యూ జిందగీలో
అలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ అవినాష్ తాజాగా ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించే లవ్ యూ జిందగీ అనే షోలో కనిపించారు. అక్కడ కూడా ఝాన్సీ, శ్రీముఖి, విష్ణుప్రియ అల్లరి చేస్తూ పెళ్లి, బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ టాపిక్‌లో అవినాష్‌ను ఆటపట్టించారు. అవినాష్‌కు పెళ్లి, అవినాష్‌కు స్వయంవరం, అవినాష్‌కు పెళ్లి ఎప్పుడు అంటూ ఝాన్సీ పాటలు పాడుతూ అవినాష్‌పై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా అవినాష్ వారిపై సరదాగా మండిపడ్డారు.

శ్రీముఖి, ఝాన్సీపై అవినాష్
శ్రీముఖి, ఝాన్సీ, విష్ణు ప్రియ నా క్యారెక్టర్‌ను డామేజ్ చేస్తున్నారు. ఒకవేళ నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం శ్రీముఖి, ఝాన్సీ అక్కనే అని చెబుతాను. నన్ను ఇలా ఎందుకు ఆడుకొంటున్నారో అర్థం కాదని అవినాష్ ఫన్నీగా వారిపై కామెంట్లు చేశారు. దాంతో శ్రీముఖి, ఝాన్సీలు నవ్వుతూ మరింత ఏడిపించే ప్రయత్నం చేశారు.

ఫన్నీ కార్యక్రమంగా లవ్ యూ జిందగీ
ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించే లవ్ యూ జిందగీ తాజా ఎపిసోడ్ శుక్రవారం అంటే జూన్ 12వ తేదీ రాత్రి జీ తెలుగులో ప్రసారమైంది. ఈ షోలో చిలిపి, సరదా సంఘటనలో ఆద్యంతం వినోదంగా సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీముఖి, విష్ణు ప్రియ చేసిన అల్లరి, చిలిపి చేష్టలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. అవినాష్ ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.