నీ వల్ల మానం పోతోంది.. జబర్దస్త్ వర్షపై కమెడియన్ ఫైర్
దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో అలరిస్తూనే వస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులకు మంచి జీవితం వరించింది. ప్రస్తుతం హీరోలుగా, దర్శకులుగా, టాప్ స్టార్ యాంకర్లుగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇక 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుత జబర్దస్త్ టీమ్ లీడర్లు తమదైన కామెడీ స్కిట్లతో బుల్లితెర ప్రేక్షకులను మరింతగా అలరిస్తున్నారు. ఇక ప్రతి శని, ఆదివారాల్లో ఈ కామెడీ షోలో ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా సెప్టెంబర్ 19వ, సెప్టెంబర్ 20వ తేదిల ఎపిసోడ్స్‌కు సంబంధించిన ప్రోమోను జబర్దస్త్ టీమ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా మారింది. బుల్లెట్ భాస్కర్, ఆటో రామ్ ప్రసాద్, వెంకీ, ప్రవీణ్, చలాకీ చంటీ, రాఘవకు సంబంధించిన స్కిట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక ప్రోమోలో జబర్దస్త్ వర్షపై కమెడియన్ నరేష్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. స్కిట్ లో భాగంగా వర్షపై ఫైర్ అయ్యారు.

ఆ వివరాల్లోకి వెళితే.. స్కిట్ ప్రారంభం కాగానే జబర్దస్త్ వర్ష కమెడియన్ నరేశ్ చెంప మీద కొడుతుంది. ఏమండి కిటీకిలు ఓపెన్ చేసి ఏసీ ఆన్ చేశారు. విండోస్ నుంచి ఏసీ మొత్తం బయటికి వెళ్లి పోతోంది మీకేం బాధ లేదా అని కొట్టి మరీ అడుగుతుంది. దాంతో మండిపోయిన జబర్దస్త్ నరేశ్ ఆమె కట్టుకున్న చీరపై కామెంట్ పేల్చుతాడు. నువ్వు కిటికిలా జాకెట్ ధరిస్తే నీ వల్ల నా మానమే పోతోందని ఫైర్ అవుతాడు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చి నరేశ్ కు షాక్ ఇస్తాడు.
మరోవైపు రాఘవ స్కూల్ టీచర్ గా, ఆటో రామ్ ప్రసాద్ నెట్ కేఫ్ ఓనర్ గా, ప్రవీణ్ అమ్మాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే వెంకీ సుజాత భార్యభర్తల స్కిట్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ఈ శనివారం, ఆదివారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కానుంది. జబర్దస్త్ కామెడీ షోలకు టాలీవుడ్ సీనియర్ నటి ఖుష్బూ ఫీమేల్ జడ్జీగా, టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో మేల్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇక యాంకర్లుగా యంగ్ అండ్ టాలెంటెడ్ రష్మీ గౌతమ్, నటుడు మానస్ వ్యవహరిస్తుండటం విశేషం.
జబర్దస్త్ కామెడీ షోకు తొలుత మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, స్టార్ నటి రోజా జడ్జీలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వారి పీరియడ్ లో సుడిగాలి సుధీర్, అనసూయ, వేణు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, షకలక శంకర్, రచ్చ రవి, ధన్ రాజ్ చిత్ర పరిశ్రమలో సెటిట్ అయ్యారు. ఇక రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ పాపులర్ రియాలిటీ గే షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో హౌజ్ నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











