Bigg Boss Telugu 9: బిగ్ బాస్ లోకి ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ.. నాగార్జునకు సర్‌ప్రైజ్ ఇచ్చిన కమెడియన్
జబర్దస్త్ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతగానో క్రేజ్ దక్కించుకున్నారు. ఏడెనిమిది ఏళ్లుగా స్మాల్స్ స్క్రీన్ పై సందడి చేశారు. కమెడియన్ గా జబర్దస్త్ వేదిక నుంచి నవ్వులను పంచుతూ వస్తున్నారు. తనదైన శైలిలో కామెడీ స్కిట్లను ప్రదర్శిస్తూ వచ్చారు. బుల్లితెర ప్రేక్షకుల్లో కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమతో పాటు టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు. ఆయనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇక ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ వేదికపై ఎంతగానో నవ్వులు పంచుతూనే ఉన్నారు. అయితే ఆయన వేదికపై కనిపించడాని కంటే ముందే జీవితంలో ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అడ్డంకులు దాటుకొని టెలివిజన్ రంగంలో అవకాశం దక్కించుకున్నారు. తన టాలెంట్ తో ఎదుగుతూ వస్తున్నారు. ఇక ఇమ్మాన్యుయేల్ తన చదువు పూర్తైన తర్వాత ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత బుల్లితెరపై గతంలో ప్రారంభమైన పటాస్ షోతో ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం అయ్యారు.

పటాస్ షోలో చేరిన తర్వాత ఇమ్మాన్యుయేల్ తన కామెడీ స్కిల్ ను చూపిస్తూ వచ్చారు. తనదైన శైలిలో పంచులు పేల్చుతూ నవ్వులు పూయించారు. అప్పటి నుంచి తన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడాదికి ఇమ్మాన్యుయేల్ పాపులర్ రియాలిటీ గేమ్ షో జబర్దస్త్ లో చేరి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల ఇమ్మాన్యుయేల్ స్టార్ మాలో కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలోనూ కంటెస్టెంట్ గా పాల్గొని పేరు సంపాదించుకున్నాడు. చివరిగా వెండితెరపై గం గం గణేశా చిత్రంలో అద్భుతమై కామెడీ పాత్రలో అలరించారు.
ఇక తాజాగా ఇమ్మాన్యుయేల్ పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ఎంట్రీ ఇచ్చారు.సెలబ్రెటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 4వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ కు నాగార్జున గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ కు సంబంధించిన పరిచయ వీడియోను ప్రదర్శించారు. అయితే తన చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగిన విధానం, తన చదువు, కుటుంబ విషయాలను చెప్పుకొచ్చారు.
అయితే తన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకకపోవడంతో ఊర్లోనే పనులకు వెళ్లే వాడినని చెప్పుకొచ్చారు. అలా చిత్ర పరిశ్రమపై తనకున్న ఆసక్తితో కామెడీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పారు. అలా 3 ఏళ్లు కష్టనష్టాలను ఓర్చుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అవకాశం వచ్చిందని తప్పకుండా అలరిస్తానని హామీనిచ్చాడు. ఆ తర్వాత తన మిమిక్రీ స్కిల్ తో నాగార్జునను సర్ ప్రైజ్ చేశారు. చిరంజీవి, విజయ్ దేవరకొండ వాయిస్ లను ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఫీమేల్ వాయిస్ లో అమ్మఅమ్మా అనే సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ పరిచయం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











