Bigg Boss Telugu 9: కంటెస్టెంట్‌పై ఇమ్మాన్యుయేల్ ముద్దుల వర్షం.. అందరి ముందే చిలిపిగా!

బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమై వారం రోజులు పూర్తయి, చూస్తుండగానే రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. రోజు గడిచేకొద్ది బిగ్‌బాస్ ఉత్కంఠగా మారుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య నిత్యం గొడవలు, కొట్లాటలు జరుగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత మజా అందిస్తున్నాయి. మూడు, నాలుగు వారాలు గడిచిన తర్వాత ఈసారి మరింత హాట్ హాట్‌గా బిగ్‌బాస్ షో సాగుతుందని అభిప్రాయపడుతున్నారు.

బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్
బిగ్‌బాస్‌లో ఎన్ని గొడవలు జరుగుతాయో, కంటెస్టెంట్స్ మధ్య ఫ్రెండ్‌షిప్ కూడా అదే స్థాయిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక రొమాంటిక్ సన్నివేశాలు, కంటెస్టెంట్స్ మధ్య ప్రేమలు కూడా ఇక్కడ హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. ప్రతి బిగ్‌బాస్ సీజన్‌లోనూ ఖచ్చితంగా రెండు మూడు జంటల మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది. సీజన్ 1 నుంచి ఇది కామన్‌గా జరిగేదే. దాంతో ఈసారి ఎవరి మధ్య ప్రేమాయణం మొదలవబోతోంది అంటూ ఉత్కంఠ నెలకొంది. పైగా ఈసారి కామనర్స్, సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా రావడం మరింత ఆసక్తిని కలిగించింది.

Jabardasth Emmanuel kisses to Tanuja Puttaswamy in Bigg Boss Telugu 9

రీతూ చౌదరి- కళ్యాణ్ మధ్య ఛాలెంజ్
మొదటి వారంలోనే ఇలాంటి గాసిప్స్‌కు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. యాంకర్ రీతూ చౌదరి, సోల్జర్ కళ్యాణ్ మధ్య లవ్ ట్రాక్‌కి పచ్చజెండా ఊపేశారు. కళ్యాణ్ వర్కవుట్స్ చేస్తుండగా రీతూ చౌదరి మధ్యలో దూరి అతనిని ఫ్లర్ట్ చేయడం మొదలు పెట్టింది. ఆ వెంటనే డిమోన్ పవన్‌కి కూడా రీతూ గోరుముద్ధలు తినిపించి, అతనిని ఇంప్రెస్ చేసే యత్నం చేసింది. ఓ టాస్క్‌లో భాగంగా కళ్యాణ్- రీతూ చౌదరిలు కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కువసేపు కళ్లు ఆర్పకుండా చూస్తే వాళ్లు గెలిచినట్లు. ఇందులో రీతూ చౌదరి ఓడిపోయినప్పటికీ ఇద్దరి మధ్య రొమాంటిక్ బాండింగ్ క్రియేట్ అయ్యిందని అంటున్నారు.

స్ట్రాటజీతో తనూజ
తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో మరో లవ్ ట్రాక్‌కి బీజం పడినట్లుగా తెలుస్తోంది. ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ పిల్ల తనూజ పుట్టస్వామి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్న స్ట్రాటజీతో గేమ్ ఆడుతోంది. హౌస్‌ను వణికిస్తున్న మాస్క్ మ్యాన్ హరిత హరీష్‌కు ఈ అమ్మాయి చుక్కలు చూపించింది. హుందాగా ఆడుతూ.. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేస్తోంది తనూజ. తోటి కంటెస్టెంట్ల వ్యూహాలను గమనిస్తూ.. వాటికి తగినట్లుగా తన స్ట్రాటజీ మారుస్తూ దూసుకెళ్తోంది. తాజాగా 10వ రోజుకు సంబంధించి స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో తనూజకు - జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌కు మధ్య లవ్ ట్రాక్‌కి శ్రీకారం చుట్టారు.

ఆమెపై ఇమ్మూ ముద్దులు
ఒక రోజు లేదా రెండ్రోజుల పాటు హౌస్‌కి కెప్టెన్‌గా, ఫ్రీజ్‌లో థమ్స్‌ప్ ఉంది సంపాదంచుకోవాలని ఇమ్మాన్యుయేల్‌కు కెప్టెన్ సంజన ఆఫర్ ఇచ్చింది. దీంతో బాగా ఆలోచించిన ఇమ్మూ.. గార్డెన్‌‌లో పడుకుని ఆలోచిస్తుంటాడు. ఆ వెంటనే తనూజతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. దాంతో తనూజ కాల్ కట్ చేసినట్లుగా పెట్టేస్తుంది. ఆ వెంటనే ప్లీజ్ కాల్ మీ బేబీ, నువ్వు కాల్ చేయలేదనుకో? మీ ఇంటికి డైరెక్ట్‌గా వచ్చేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఇమ్ము. దానికి భయపడిన తనూజ కాల్ చేయగా.. మళ్లీ ఇమ్ము ముద్దుల వర్షం కురిపిస్తాడు. అతని తీరుకు సిగ్గుపడిన తనూజ.. వాడు మాట్లాడటం లేదు, ఉమ్మా.. ఉమ్మా అంటున్నాడని మండిపడింది. ఆ తర్వాత మళ్లీ ఇమ్ము కాల్ చేసి మన విషయం ఇంట్లో తెలిసిపోయింది రమేశ్ అంటూ ఏడిపిస్తాడు. దాంతో అక్కడే ఉన్న సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, రాము రాథోడ్‌లు నవ్వేస్తారు. మరి తనూజ - ఇమ్మాన్యుయేల్ మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X