For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్ష పక్కనుండగానే విష్ణుప్రియ చెల్లితో ఇమ్మాన్యుయేల్ సాంగ్.. వర్ష రియాక్షన్ మాత్రం!

  |

  తెలుగులో నిరాటంకంగా కొనసాగుతున్న కామెడీ షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ అని చెప్పక తప్పదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ జబర్దస్త్ షో ఇప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తూనే ఉంది.. ఇక ఈ షోలో లవ్ స్టోరీల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్ - రష్మి గౌతమ్ జోడి. వీరి తరువాత మరో జోడీ కూడా అంతే ఫేమస్ అయింది. ఇమ్మానియేల్ - వర్ష జోడీ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఇమ్మానియేల్ చేసిన ఒక పనికి వర్ష రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  తక్కువ కాలంలోనే

  తక్కువ కాలంలోనే

  టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయడానికి షో నిర్వాహకులు సహా ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లో చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. అలా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఇమ్మానియేల్ ఒకడు. చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా హైపర్ ఆది లాగా ఇన్స్టెంట్ పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.

  వర్షతో కెమిస్ట్రీ

  వర్షతో కెమిస్ట్రీ

  బేసిక్ గా నల్లగా ఉండే ఇమ్మానియేల్ ఆ కలర్ విషయంగానే ఎక్కువ ఫేమస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో ఈ మధ్య లేడీ గెటప్స్ తగ్గించి నిజమైన ఆడవాళ్ళను వాడేస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వర్షతో మనోడి లవ్ ట్రాక్ బాగా నడుస్తోంది. గతంలో సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ షో సహా ఈ టీవీ చేస్తున్న అనేక ఈవెంట్స్ లో కనిపిస్తోంది.

  నిజంగా ప్రేమే

  నిజంగా ప్రేమే

  ఎక్కువగా ఇమ్మానియేల్ సరసన నటిస్తూ వీళ్ళిద్దరి ఒక జోడి అన్నట్లు జనాన్ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇక ఆన్ స్క్రీన్ లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందేమో అనే లాగా వాళ్ల పర్ఫామెన్స్ ఉంటోంది. ఆ మధ్య వాళ్ళిద్దరూ కలిసి వావ్ ప్రోగ్రాం కి అతిథులుగా వెళ్ళిన సమయంలో వాళ్ళ కెమిస్ట్రీ చూసి గెస్ట్లుగా వచ్చిన తాగుబోతు రమేష్, రఘు సైతం వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందేమో అంటూ కామెంట్లు చేశారు.

  ఆన్ స్క్రీన్ ఏనా

  ఆన్ స్క్రీన్ ఏనా

  దానికి తగ్గట్టు వర్ష తల్లిని అత్తమ్మ అంటూ కొన్ని షోలలో ఇమ్మానియేల్ సంభోదించడం ఇమ్మానియేల్ తల్లిని అత్తమ్మ అంటూ వర్ష సంబోధించడం కూడా వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే కామెంట్స్ వచ్చేలా చేశాయి. అయితే కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు మాత్రం వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం సిద్ధం చేసిన జంట మాత్రమే అని చెబుతూ ఉంటారు.

  విష్ణు ప్రియ చెల్లెలితో

  విష్ణు ప్రియ చెల్లెలితో

  కానీ తాజాగా ఇమ్మానియేల్ చేసిన ఒక ఇంస్టాగ్రామ్ రీల్ ఆసక్తికరంగా సాగింది. ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ సోదరి పావని కూడా ఈవెంట్స్ లో కనువిందు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో కలిసి రెడ్డి గారి అమ్మయిరా అనే సాంగ్ కు ఇమ్మానియేల్ రీల్ చేయటం మొదలు పెట్టాడు.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu

  వర్ష రియాక్షన్ అదుర్స్

  వీళ్ళిద్దరూ కలిసి రీల్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన వర్ష మధ్యలో దూరి ఇద్దరినీ వెక్కిరించింది. దీంతో ఇమ్మానియేల్ కి ఏం చేయాలో తెలియక బిక్క మొహం పెట్టాడు. ఆ బిక్కమొహం చూసి పావని ఇమ్మానుయేల్ ని ఒక దెబ్బ వేస్తే వర్ష కూడా తానేమీ తక్కువ కాదని ఇమ్మానియేల్ మీద సరదాగా మరో దెబ్బ వేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  jabardasth emmanuel and varsha is most talkable couple in jabardasth. recently emmanuel shares an intresing reel with vishnupriya sister and watch varsha reaction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X