శోభనం గదిలో ఆ పని నేను చేయాలి మామ.. నువ్వు కాదు అంటూ హైపర్ ఆది
Sridevi Drama Company: తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడి షో 'జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ షోల ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.. తమదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆది టీం చేసిన 'వర్షం లో ఆది పెళ్లి చూపులు' అనే స్కీట్ వైరల్ మారింది.
తెలుగు ఎంటర్టైన్‌మెంట్ రంగంలో ఎప్పుడూ తనదైన కామెడీ టైమింగ్‌తో పంచులు పేలుస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. మొదటగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆది, ఇప్పుడు టీవీ షోల నుంచి సినిమాల వరకు తనకంటూ ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన చేసే కామెడీ, ఆటపాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది వేసిన పంచులు వైరల్ గా మారుతున్నాయి.

తాజా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ప్రారంభం కానీ, 'వర్షంలో ఆది పెళ్లి చూపులు'సన్నివేశంతో మొదలవుతుంది. స్కిట్‌లో మొదటగా బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ ప్రత్యేక ఎంట్రీ ఇస్తాడు. సన్నివేశంలో ఆది వర్షంలో తడిసిన పరిస్థితిలో ఉన్నప్పుడు, జెస్సీ "అన్నయ్య, నీ ఒంట్లో వేడి లేదు. కాబట్టి ఎంతైనా తడుస్తావ్" అంటూ తిమ్మతిరిగిపోయే పంచ్‌ను వేస్తాడు. ఈ పంచ్‌తో ప్రేక్షకులని వెంటనే నవ్వులలో ముంచెత్తి, ఆ తరువాత సైలెంట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
స్కిట్ లో తన ఫ్యామిలీని పరిచయం చేస్తూ.. మా అమ్మ నగలు ఎక్కువ.. మా నాన్న నకరాలు ఎక్కువ.. అంటూ బుల్లెట్ భాస్కర్ పై పంచ్ వేస్తాడు. ఆ తరువాత 'మా మరదలు కు ఆరటం ఎక్కువే పోరాటం ఎక్కువే' అంటూ శాంతి స్వరూప్ పై అదిరిపోయే పంచ్ వేస్తాడు. మిగతావాళ్లు అంతా పేమెంట్లు ఎక్కువ పర్ఫామెన్స్ తక్కువ అంటూ ఇతర కంటెస్టెంట్ల గాలి తీసేస్తాడు . ఇక ఈ రోజు నా పెళ్లి చూపులు కొంచెం భయంగా ఉందని ఆది అంటాడు. 'ఎందుకురా భయం సీమ సింహంలా ఉండాలి'అని బుల్లెట్ భాస్కర్ అనగా 'అమ్మానాన్నలు సీమ పందుల్లాగా ఉంటే.. నేను సీమ సింహంలా ఎలా ఉంటాను.. గ్రామ సింహం లాగానే ఉంటాను'అంటూ బుల్లెట్ భాస్కర్ గాలి తీసేస్తాడు.
ఆ తరువాత శాంతి స్వరూప్ వచ్చి.. అయినా వర్షానికి భయపడకూడదని, "చప్పట్లు కొడితే ఆగిపోతుంది' అంటాడు. 'ఇది ట్రైన్ కాదు, రైన్" అంటూ తిమ్మతిరిగిపోయే పంచ్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. వర్షం ఇలానే ఉంటే.. మరో నాలుగు టెంట్లు వేయించండని శాంతి స్వరూప్ అనగానే.. ' ఎందుకు టెంట్ల వెనుక స్టంట్స్ ఉంటాయా? "అని సెటైర్ చేసిన సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్కిట్‌లో ఇతర కమెడియన్లు కూడా పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు.
ఇక బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ ఆది పెళ్లి, ఫిజిక్, గ్లామర్‌పై నిలదీస్తారు, "నీకు పెళ్లి ఏంటి.. నాలాగా ఫిజిక్ ఉందా.. నాలాగా గ్లామర్ ఉందా.'అని ఆదిని ప్రశ్నిస్తాడు. 'నీ దగ్గర లేనిది.. నా దగ్గర ఒకటి ఉంది' అనడంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆర్జే కాజల్ "అరె తమ్ముడు.. నీలాగా నేను కూడా ఆగి చేసుకుంటే.. మహేష్ బాబు లాంటి పెళ్ళికొడుకు వచ్చేవాడు కాదా'అని అంటుంది. వెంటనే హైపర్ ఆది రియాక్ట్ అవుతూ..'నువ్వు హీరోయిన్ కాజల్ కాదు.. కేవలం ఆర్జే కాజల్' అంటూ గాలి తీసేస్తాడు.
తదుపరి సీన్‌లో గడ్డం నవీన్ వచ్చి.. "అల్లుడు పెళ్లిచూపుల్లో హడావిడి చేస్తా.. పెళ్లిలో హడావిడి చేస్తా.. శోభనం గదిలో కూడా హడావిడి చేస్తాడా?"అనగా.. "రేయ్, ఆపరా... అక్కడ నేను హడావిడి చేయాలి, నువ్వు కాదు" సెటైర్ చేయగా, ఆది అని జవాబు ఇచ్చాడు. చివరగా, చిన్నప్పుడు బియ్యం తింటే వర్షం పడుతుందంటూ తండ్రిని అడిగి, తుఫాను వర్షాన్ని సెటైర్‌గా ప్రదర్శించడం హాస్యాన్ని మరింత పెంచింది. ఈ స్కిట్ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా, హైపర్ ఆది ప్రత్యేక కామెడీ టైమింగ్ వల్ల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.


Click it and Unblock the Notifications











