30 ఏళ్లు దాటినా పెళ్లికాకపోవడమే.. కామంతో కాదు.. హైపర్ ఆది కామెడీ పంచ్‌

తెలుగు బుల్లితెరపై అత్యంత వినోదాన్ని అందిస్తున్న రియాలిటీ కామెడీ షోలో శ్రీదేవీ డ్రామా కంపెనీ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన కమెడియన్లు, కొత్తగా పరిచయమైన ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తో ఈ షో అందర్నీ ఆకట్టుకొంటూ ముందుకు సాగుతున్నది. అయితే ఈ షోలో టాప్ కమెడియన్ హైపర్ ఆది చుట్టు అల్లిన పెళ్లి చూపులు ఎపిసోడ్ ఫుల్లుగా నవ్వులు పూలు పూయించింది. ఈ సందర్భంగా సహజంగానే ఆది వేసే పంచులు మరోసారి అదిరిపోయాయి. ఈ షోలో ఆది పెళ్లి చూపులు ఎలా జరిగాయనే విషయంలోకి వెళితే..

30 ఏళ్లు దాటినా పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో హైపర్ ఆది కనిపించాడు. పెళ్లి చూపుల్లో మగ, ఆడ కుటుంబాలు చేసిన అల్లరి ఈ ఎపిసోడ్‌కు హైలెట్‌గా మారింది. పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి తరఫున వాళ్లు రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. అబ్బాయికి ఆస్తి, పాస్తి ఏమైనా ఉందా? అంటే.. ఆస్తులు లేవు కానీ.. పాస్తులు ఉన్నాయి అంటూ తిక్కగా సమాధానాలు చెబుతారు. అలాగే ఉద్యోగం ఉందా? అని అమ్మాయి వాళ్లు అడిగితే.. 30 ఏళ్లు వచ్చాయి కానీ.. అంటూ అబ్బాయి వాళ్లు ఏదో చెప్పబోతుండగా.. హైపర్ ఆది తిక్కలేసి.. నా వయసు గురించి అడిగారా? అంటూ చిరాకు పడుతాడు.

Jabardasth Hyper Aadi comedy Punches

అయితే ఇలాంంటి ప్రశ్నలతో సరదాగానే కాకుండా ఫుల్ ఫన్‌తో ఎపిసోడ్ పంచులతో పేలిపోయింది. ఇక అమ్మాయి, అబ్బాయి తరుఫు వాళ్ల ప్రశ్నలకు విసిగిపోయిన హైపర్ ఆదికి ఇక జరిగింది.. చాలూ.. అమ్మాయితో నేను అంటూ ఏదో అడుగుతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అదే.. మాట్లాడాలి అని చెప్పగానే.. ఒకే అంటూ పర్మిషన్ ఇస్తారు.

అయితే అమ్మాయిని హైపర్ ఆది రకరకాల ప్రశ్నలు వేసిన తర్వాత.. నీ ఫోన్ ఇవ్వు అంటూ అతడి వద్ద నుంచి అమ్మాయి తీసుకొంటుంది. ఫోన్ చూసి ఇది అండ్రాయిడ్ ఫోనా? కాండ్రాయిడ్ ఫోనా అంటుంది. ద అయితే ఆ ఫోన్‌లో శృంగారపరమైన వీడియోలు చూసి షాక్ అవుతారు. అయితే 200 వీడియోలు.. పూర్తి స్పృహతో తలుపులు, కిటీకీలు వేసుకొని మ్యూట్‌లో పెట్టుకొని చూశాను. కారణం కామం కాదు సారు.. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం సార్.. కొన్ని వీడియోలు చూసినంత మాత్రాన వాడి గుణం, కులం మంచిది కాదంటరా? దేశద్రోహిని చూసినట్టు చూస్తారా? అంటూ హైపర్ ఆది ఆవేదన చెందాడు.

నాకు 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోతే.. ఏ ఒక్క ఆంటీ అయినా.. అంకులైనా నా బిడ్డను చూసుకోమని అన్నారా? పెళ్లి కాని వాళ్ళకి ఎవరూ వాల్యూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు పిల్లని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కొంచెం వాల్యూ ఇవ్వండి సార్ అంటూ హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేశాడు.

హైపర్ ఆది పెళ్లి చూపుల ఎపిసోడ్ కామెడీ పంచులతో ఫుల్ ఫన్‌గా సాగింది. చివరకు ఎపిసోడ్‌లో హైపర్ ఆది కి పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరిస్తారు. నా కూతుర్ని నీకే ఇస్తాను అల్లుడు అంటూ ఒక నాటకీయ ముగింపుని ఇస్తారు. ఈ స్కిట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో హైలైట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్‌లో నరేష్, బుల్లెట్ భాస్కర్, ఇంద్రజ, రష్మీ గౌతమ్, జబర్దస్త్ వర్ష తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X