Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వైరల్ పిక్ : భార్యతో బీచ్‌లో.. లాక్ డౌన్‌లో ఎంజాయ్ చేస్తోన్న జబర్దస్త్ మహేష్
జబర్దస్త్ మహేష్ అని కొందరు అంటే.. రంగస్థలం మహేష్ అని ఇంకొందరు అంటారు. ఎలా పిలిచినా సరే అతని నటనకు ఎవ్వరైనా ముగ్దులు కావాల్సిందే. నవ్వించడంలోనూ, ఏడ్పించడంలోనూ, కోపం తెప్పించడంలోనూ మహేష్ నటన ఓ లెవెల్‌లో ఉంటుంది. కమెడియన్, విలన్, సైడ్ ఆర్టిస్ట్ పాత్రల్లో మహేష్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం మహేష్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. లాక్ డౌన్‌లో వివాహం చేసుకున్న మహేష్ ఓ ఇంటి వాడయ్యాడు. భార్యతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

బుల్లితెరపై నవ్వులు..
జబర్దస్త్ వేదికపై నవ్వులు పూయించిన ఆర్టిస్టుల్లో మహేష్ ఒకడు. స్కిట్లలో సైడ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. తానే స్కిట్స్‌ను నడిపించే స్థాయికి వెళ్లాడు. అక్కడ వచ్చిన పాపులార్టీతో వెండితెరపైనా మెరిశారు. చిన్న చిన్న పాత్రలతో మొదలై.. మెయిన్ క్యారెక్టర్స్ చేసే వరకు ఎదిగాడు.

రంగస్థలంతో క్రేజ్..
జబర్దస్త్ మహేష్ పేరు రంగస్థలం మహేష్‌గా రూపాంతరం చెందింది. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కనే ఉంటూ అద్భుత నటనను ప్రదర్శించాడు. నవ్వించడమే కాదు ఎమోషనల్ సీన్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఇక మహానటి, గుణ 369 వంటి చిత్రాల్లో నెగెటివ్ పాత్రను పోషించి మెప్పించాడు.

లాక్ డౌన్‌లో పెళ్లి..
లాక్ డౌన్‌లో మన సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ మహేష్ సైతం ఎంతో నిరాడంబరంగా వివాహాం చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరభించాడు. అయితే ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బంధువుల అమ్మాయి పావనిని మే 14వ తేదీన వివాహం చేసుకున్నాడు.

ఫోటోలతో రచ్చ..
మహేష్
పెళ్లికి
సంబంధించిన
ఫోటోలేవీ
బయటకు
రాలేదు.
జబర్దస్త్
ఆర్టిస్ట్‌లు
వివాహానికి
హాజరైన
సందర్భంలో
దిగిన
ఫోటోలే
బయటకు
వచ్చాయి.
పెళ్లి
తంతు
ముగిసిన
అనంతరం
శ్రీమతితో
దిగిన
ఫోటోలను
షేర్
చేశాడు.
ఆ
మధ్య
ఇంట్లో,
బీచ్‌లో
సరదాగా
దిగిన
ఫోటోలను
షేర్
చేశాడు.
అవి
సోషల్
మీడియాలో
తెగ
సందడి
చేశాయి.
Recommended Video

బీచ్‌లో సరదాగా..
తాజాగా మహేష్ మరో ఫోటోను షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోను చూస్తుంటే అది ఫోటో షూట్‌లానే కనిపిస్తోంది. ఇద్దరూ బీచ్‌లో సరదాగా ముచ్చట్లు పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఫోటో మహేష్ అభిమానులను ఆకర్షిస్తోంది. అన్నవదినలు అని సంబోధిస్తూ సంతోషంగా ఉండాలని విష్ చేస్తున్నారు.