నీ ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తా.. సుడిగాలి సుధీర్‌కు ఆ నటుడు వార్నింగ్

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో దాదాపు 12 ఏళ్లుగా తెలుగులో టాప్ షోగా కొనసాగుతోంది. దీనిని అనుకరిస్తూ ఎన్నో షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ రేంజ్‌లో అలరించలేకపోతున్నాయి. ఎంతోమంది ప్రతిభావంతులు ఈ షో ద్వారా పరిచయమై నేడు సినిమాలు, టెలివిజన్ రంగంలో స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఎంతోమంది యాంకర్లుగా, హీరోలుగా, దర్శకులుగా, రైటర్లుగా తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి వారిలో సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను, సన్నీలు కూడా ఉన్నారు.

జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్‌కి క్రేజ్
జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. స్కిట్లలో రకరకాల ప్రయోగాలు చేసే వీరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిత్రులైన సుధీర్, శ్రీను, రాంప్రసాద్, సన్నీలు జబర్దస్త్ వేదికపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 12 ఏళ్ల జబర్దస్త్ జర్నీలో వీరి జర్నీ దాదాపు 8 ఏళ్లకు పైగానే సాగింది. ఎప్పటికప్పుడు సరికొత్త అద్భుతాలు చేస్తూ వచ్చింది. అయితే వ్యక్తిగత కారణాలు.. సినిమాలు, ఇతర ఛానెల్స్‌లో అవకాశాలు రావడంతో సుడిగాలి సుధీర్, శ్రీను, రాంప్రసాద్‌లు ఎవరి దారులు వారు చూసుకున్నారు. కానీ ఎక్కడున్నా ఖచ్చితంగా కలుస్తూనే ఉంటారు.

Jabardasth Ram Prasad Blackmailing Sudigali Sudheer at Sarkaar Season 5 in Aha OTT

మిత్రుల్ని తలచుకుని రాంప్రసాద్ ఎమోషనల్
కొద్దినెలల క్రితం తన మిత్రులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లేకుండా రాంప్రసాద్ స్కిట్ చేస్తూ తన ఫ్రెండ్స్ లేకపోవడంతో ఒంటరిని అయిపోయానని ఎమోషనల్ అయ్యాడు. మొన్నామధ్య అనిల్ రావిపూడి జడ్జిగా వచ్చిన ఓ ఎపిసోడ్‌లోనూ రాంప్రసాద్‌ను ఇదే విషయం అడగ్గా స్నేహితులను తలచుకుని కంటతడి పెట్టాడు. ఆ సమయంలో రాంప్రసాద్‌ను దగ్గరకు తీసుకుని ఇంద్రజ ఓదార్చారు. మీ టీమ్‌కి దిష్టి తగిలిందంటూ నచ్చచెప్పారు. సుడిగాలి సుధీర్ టీమ్‌ సభ్యులు ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినా ఖచ్చితంగా తమ ఫ్రెండ్‌షిప్ గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. మేం ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మా మధ్య బంధం ముగిసిపోదని ఇటీవల సుడిగాలి సుధీర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

సర్కార్ 5లో సుధీర్ ఫ్రెండ్స్ సందడి
ఈ ముగ్గురు కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతం నవ్వులతో మారుమోగిపోతుంది. తాజాగా రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ, బుల్లెట్ భాస్కర్ కలిసి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సర్కార్ సీజన్ 5 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుధీర్ హోస్ట్ కావడం విశేషం. ఈ సందర్భంగా కిచెన్‌లో ఉండే ఓ పదార్ధానికి సంబంధించిన ప్రశ్నను సుధీర్ అడుగుతాడు. దానిని నలుగురిలో ఎవరైతే సరిగ్గా గెస్ చేసి పాడతారో వారి ఖాతాలో డబ్బులు యాడ్ అవుతాయి. శీను 25 వేలతో పాట ప్రారంభిస్తాడు.. ఈ ప్రశ్నకు ఆన్సర్ సౌతిండియాలో ఉండే ఓ స్టేట్ పేరు అని సుధీర్ క్లూ ఇవ్వగా.. ఒకేసారి లక్ష పాడతాడు రాంప్రసాద్, అయితే దానిని లక్షా పది వేలకు తీసుకెళ్తే దానిని ఫిజికల్‌గా చూపిస్తానని సుధీర్ చెప్పడంతో రాంప్రసాద్ అదే అమౌంట్ చెబుతాడు.

ఆ ఫోటోలతో సుధీర్‌ను బెదిరిస్తూ
ఆ వెంటనే లస్సీ అనే అమ్మాయి పళ్లెంతో వేదిక మీదకి వచ్చింది.. దాంతో పెరుగు ఎవరు తోడుపెట్టాడో లస్సీ అదిరిపోయింది అంటూ రాంప్రసాద్ పంచ్ పేల్చాడు. ఆ ప్లేట్‌ని తీసుకుని సుధీర్ వస్తుండగా.. లస్సీని తీసుకురమ్మను నువ్వెందుకు అంటాడు ప్రసాద్. నాకు నీ మీద సరిగా నమ్మకం లేదు అని సుధీర్ చెప్పడంతో .. నీ సంగతి ఇలా కాదని, దుబాయ్ ఫోటోలు చూపిస్తానంటూ రాంప్రసాద్ బెదిరించడంతో సుధీర్ వణికిపోతాడు. లస్సీని రాంప్రసాద్‌కి పరిచయం చేస్తాడు. ఆమె వెళ్లిపోతుండగా లస్సీ ఒక్కటేనా? ఇంకా గులాబ్ జాం లాంటిది ఏమైనా వస్తుందా? అని రాంప్రసాద్ అనడంతో అందరూ నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X