రీతూ చౌదరీ రంజుగా రొమాన్స్.. బిగ్‌బాస్ ఇంటిలో మొదలైన లవ్ ట్రాక్!

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో క్రేజీగా ప్రారంభమైంది. 6 గురు కామన్ మ్యాన్ కేటగిరీ, 9 మంది సెలబ్రిటీలతో మొత్తంగా 15 మంది ఇంటిలోకి అడుగుపెట్టారు. ఇక ఇంటిలో సభ్యుల మధ్య ఎప్పటిలానే సన్నిహిత సంబంధాలు, గొడవలు, కొట్లాటలు, లవ్ ట్రాక్‌లు తొలి రోజు నుంచే కనిపించాయి. అలాగే ఇంటిలో బిగ్‌బాస్ వార్నింగులు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఇలాంటి గొడవలు, వాగ్వాదాల మధ్య జబర్దస్త్ రీతూ చౌదరీ తనదైన శైలిలో కంటెంట్‌ను డెలివరీ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్న సరదా సన్నివేశం అందరితో ఆకట్టుకొంటున్నది. రీతూ చౌదరీ లవ్ ట్రాక్ విషయంలోకి వెళితే..

జబర్దస్త్ రియాలిటీ షో ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకొన్న రీతూ చౌదరీ.. కొద్దికాలంలోనే సెలబ్రిటీగా మారింది. అంతేకాకుండా కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ స్కామ్‌లో ఆమె పేరు వినిపించింది. నిత్యం ఏదో రకంగా సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపును, గ్లామర్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. దాంతో ఆమెను బిగ్‌బాస్ రియాలిటీ షో వెతుక్కొంటూ వచ్చింది.

Jabardasth Ritu Chowdary

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో గత రెండు రోజులుగా హుందాగా ఆడుతూ.. తన స్ట్రాటెజీని పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఇతర కంటెస్టెంట్ల వ్యూహాలను గమనిస్తూ.. తనదైన శైలిలో తన గేమ్ స్ట్రాటెజీని అమలు చేస్తుందనే విషయం స్పష్టంగా కనిపించింది. తనదైన శైలిలో చలాకీగా, ఫన్ లాంటి అంశాలను క్రియేట్ చేస్తూ ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నది.

ఇక తాజాగా తనదైన శైలిలో లవ్ ట్రాక్‌కు బీజం వేసింది. కామన్ మ్యాన్‌గ ఎంట్రీ ఇచ్చిన పవన్ పడాలతో చిన్న రొమాంటిక్ సన్నివేశాన్ని క్రియేట్ చేసింది. ఇద్దరు కళ్లలోకి చూసుకొంటూ ఉండాలి. కన్నార్పకుండా ఎవరు ఎక్కువ సేపు చూసుకొంటూ ఉంటే.. వారు గెలిచినట్టు అని రూల్ పెట్టారు. అలా రీతూ కళ్లలోకి కల్యాణ్ చూస్తూ ఉండిపోయాడు. అలా చాలా సేపు వారిద్దూ చూస్తుంటే.. పక్కన ఉన్న ఇంటి సభ్యులు పాటలు పాడుతూ హుషారెత్తించారు. ఏం చేస్తున్నారో వీళ్లు.. ఏం చేస్తారో ముందు.. మున్ముందు.. నిన్ను కలిశాకే.. అంటూ యానిమల్ పాటను పాడుతూ వారిని ఉత్తేజ పరిచారు. అయితే చివరకు ఈ రొమాంటిక్ పాటలో రీతూ చౌదరీ ఓడిపోయాడు. అలా రీతూ, కల్యాణ్ మధ్య ఓ క్లోజ్ అండ్ రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ అయింది అని నెటిజన్లు ఓ నిర్ణయానికి వచ్చారు.

ఇదిలా ఉండగా, తొలివారానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లు మొత్తం 9 మంది సెలబ్రిటీలు చేరారు. వారిని ఓనర్లుగా మారిన కామన్ మ్యాన్ నామినేట్ చేశారు. దాంతో ఈ వారం రీతూ చౌదరీ నామినేషన్‌లో ఉన్నట్టు సమాచారం.

ఈ వారం నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు వీరే.. బిగ్‌బాస్ ఇంటిలో తొలివారం నామినేషన్‌కు గురైన వారిలో తనూజ గౌడ, ఫ్లోరా సైనీ,ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, డెమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న రీతూ ఎలిమినేషన్ నుంచి ఎంత మెజారిటీతో బయటపడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X