రీతూ చౌదరీ లవ్ ట్రాక్.. కుర్ర కంటెస్టెంట్‌తో ముసుగులో గుద్దులాట!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9 సీజన్‌లో రెండో వారంలోనే లవ్ ట్రాక్స్ మొదలయ్యాయి. కుర్ర కంటెస్టెంట్ల మనసులు ఒకరికొకరు దగర చేసుకోవడంతో ప్రేమ వ్యవహారాలు మొదలైనట్టు స్పష్టమైంది. అయితే ఇంట్లోకి వచ్చిన యంగ్ కంటెస్టెంట్లు ఆకర్షంచుకోవడంలో ముందున్నారు. అందులో ముఖ్యంగా రీతూ చౌదరీ, డీమాన్ పవన్, అలాగే ప్రియా శెట్టితో కల్యాణ్ లవ్ ట్రాక్స్ ముదిరి పాకాన పడుతున్నట్టు కనిపించింది. అయితే ముఖ్యంగా రీతూ చౌదరీ ఇస్తున్న సిగ్నల్స్ షోలో హైలెట్‌గా మారుతున్నాయి. బిగ్‌బాస్ ఇంటిలో చోటు చేసుకొంటున్న రొమాంటిక్ సన్నివేశాల వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ యాక్టర్ రీతూ చౌదరీ, డీమాన్ పవన్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఎస్టాబ్లిష్ అవుతున్నది. రీతూ చౌదరీ అటెన్షన్ కోసం పవన్.. పవన్ కేరింగ్ కోసం రీతూ తంటాలు పడుతున్నారు. ఇద్దరు కూడా తమ మనసులోని మాటను బయటకు చెప్పుకోలేక ముసుగులో గుద్దులాటకు తెర లేపారు. లవ్ ట్రాక్ విషయంలో రీతూ ఓపెన్ కాలేక తన మనసును తెలుసుకో అంటూ పవన్‌ను ఓ రకంగా టార్చర్ పెడుతుంటే.. ఆ విషయాన్ని క్లారిటీతో చెప్పమని పవన్ లవ ట్రాక్‌ను సాగదీస్తున్నాడు. ఈ వ్యవహారం ఆడియెన్స్‌కు క్రేజీగా మారింది.

Jabardasth Ritu Chowdary

తాజా ఎపిసోడ్‌లో రీతూ చౌదరీకి బ్లూ కలర్ ఇష్టమని.. పవన్ అ రంగ టీషర్ట్ వేసుకొని వచ్చాడు. కానీ ఆమె మాత్రం పట్టించుకోక పోవడంతో చిన్నగా మనస్తాపానికి గురయ్యాడు. నీకు బ్లూ కలర్ ఇష్టమని టీషర్ట్ వేసుకొని వచ్చాను అని చెబితే.. మౌనంగానే రీతూ సమాధానం చెప్పింది. అయితే ఎందుకు నాపై నీకు కోపం అని పవన్ అడిగితే దానికి మౌనమే సమాధానం అయింది. అలా ఇంటిలో ఇద్దరి మధ్య ఓ రకమైన హైడ్ అండ్ సీక్ లవ్ గేమ్ కొనసాగుతున్నది.

రీతూ, డీమాన్ పవన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ఓ దశలో నీవే ఏం చేసినా నిన్నే చూడాలనిపిస్తున్నది. నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది. నువ్వు నవ్వితే నవ్వాలనిపిస్తున్నది అంటూ పవన్‌తో రీతూ చౌదరీ అనడం కనిపించింది. అయితే ఆమె మాటలకు పవన్ మాత్రం సిగ్గుపడి పోయాడు. ఇలా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ముదిరిపోయినట్టు కనిపించింది. వారిద్దరి కెమిస్ట్రీ చూసి ఇమ్ము కామెంట్ చేశాడు. రీతూతో మేమే నీకు తినిపిస్తాం. కానీ నువ్వు మాత్రం డీమాన్ పవన్‌కు తినిపిస్తున్నావు అంటూ కామెంట్ చేశాడు.

అయితే రీతూ చౌదరీ వెంట కల్యాణ్ పడటంతో ఆమె చిన్న వార్నింగ్ ఇచ్చింది. నీతో నాకు ఫ్రెండ్ షిప్ అవసరం లేదంటూ సిగ్నల్ ఇచ్చేసింది. నీ వల్ల నేను హర్ట్ అయ్యాను తన మనసులోని భావాలను చెప్పింది. అలా చెప్పడంతో కల్యాణ్ షాక్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఇక కల్యాణ్‌తో ప్రియా శెట్టి ట్రాక్ కూడా ఆసక్తికరంగా కనిపించింది. ఇక్కడ పెట్టి తీయగానే ఫీలయ్యావు అని చెప్పడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X