twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth షో రేటింగ్ ఒకప్పుడు 18.. ఇప్పుడు ఎంతకు పడిపోయిందంటే.. అప్పారావు కామెంట్స్

    |

    తెలుగు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో నెంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపును అందుకున్న జబర్దస్త్ షో అప్పట్లో మంచి రేటింగ్ అయితే అందుకునేది. ఈ షోపై ఎంత కాంట్రవర్సీ క్రియేట్ అయినా కూడా ఒక విధంగా షోకు అయితే పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యేది. దీంతో మిగతా షోల కంటే జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ వెండితెరకు పరిచయమయ్యారు. వారికి జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు కూడా ఇండస్ట్రీలో వందల అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో కొంతమందితో బయటకు వెళ్లిపోవడమే కాకుండా అందులో జరిగే కొన్ని నెగటివ్ అంశాలను కూడా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ మోస్ట్ జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా జబర్దస్త్ రేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    నెంబర్ వన్ షోగా..

    నెంబర్ వన్ షోగా..

    జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు చాలామంది ఇప్పుడు భారీ స్థాయిలో పారితోషకం కూడా అందుకుంటున్నారు. 2013లో మొదలైన జబర్దస్త్ షో చాలా తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో రేటింగ్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక 2014 నుంచి నాన్ స్టాప్ గా ఈ షోకు భారీ స్థాయిలో రేటింగ్స్ అయితే దక్కుతోంది. నిర్మాణ సంస్థకు ఐదేళ్ల కాలం పాటు కాసుల వర్షం కురిసింది అనే చెప్పాలి.

     భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్

    భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్

    జబర్దస్త్ షో కి కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. సినిమాలో అవకాశాలు లేని వాళ్ళు మొదటి జబర్దస్త్ లోకి వచ్చి ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. మినిమమ్ షోలో ఒక్క చిన్న కమెడియన్ కూడా ఒక్కో ఎపిసోడ్ కు పదివేలకు పైగానే పారితోషికమిచ్చే విధంగా జబర్దస్త్ షోను కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఒకప్పుడు పదివేలు అందుకున్న వాళ్లు ఇప్పుడు టీమ్ లీడర్ గా మారి 2 లక్షలకు పైగానే పారితోషికం కూడా అందుకుంటున్నారు.

    అసంతృప్తితోనే..

    అసంతృప్తితోనే..

    అయితే భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటూ వచ్చిన కూడా షో కొన్నాళ్ల తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. షోలో నుంచి మెల్లగా సీనియర్ కమెడియన్స్ కూడా వెళ్ళిపోతూ ఉండడంతో జోరు కూడా తగ్గిపోయింది అనే చెప్పాలి. ఒకప్పుడు కనిపించిన జోరు అయితే ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కొంతమంది సీనియర్ కమెడియన్స్ కూడా అసంతృప్తితోనే బయటకు వచ్చారు.

    అప్పారావు అప్సెట్

    అప్పారావు అప్సెట్

    ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ మోస్ట్ జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా ఆ కామెడీ షో నుంచి కాస్త అసంతృప్తిగానే బయటికి వచ్చినట్లుగా తెలియజేశాడు. నేను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కనీసం నిర్వాహకులు ఒక్క మాట కూడా అడగలేదు అని.. ఒక సీనియర్ కమెడియన్ గా తనపై గౌరవం చూపించలేదు అని అప్పారావు వివరణ ఇచ్చాడు.

    దారుణంగా పడిపోయిన రేటింగ్

    దారుణంగా పడిపోయిన రేటింగ్

    అయితే ఒకప్పుడు చాలా మంచి సీనియర్ కమెడియన్స్ అందరూ కష్టపడి జబర్దస్త్ షో రేటింగ్స్ పెంచడంలో ముఖ్య పాత్ర పోషించారు అని.. అప్పట్లో జబర్దస్త్ షోకు అయితే దాదాపు అన్ని షోల కంటే ఎక్కువగా 18 టిఆర్పి రేటింగ్ వచ్చేది అన్నారు. అయితే ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయి నాలుగు నుంచి ఆరు రేటింగ్స్ కు పడిపోయినట్లుగా అప్పారావు వివరణ ఇచ్చారు. అయితే కొంతమంది దారుణమైన ప్రవర్తన తీరు కారణంగానే అక్కడ నుంచి చాలామంది కమెడియన్స్ వెళ్ళిపోతున్నట్లుగా కూడా అప్పారావు తెలియజేశారు.

    English summary
    Jabardasth senior most comedian apparao about jabardasth Downfall rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X