అల్లు అర్జున్‌తో అలా నటించను.. ఆ రెండు తప్పా ఆయనతో దేనికైనా రెడీ.. జబర్దస్త్ వర్ష
జబర్దస్త్ వర్ష తన జీవిత తత్వం, కెరీర్ ఒడిదుడుకులు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. బిగ్ బాస్, అనసూయ ఆదర్శం, ఇమ్మాన్యుయేల్‌తో బంధం, టాలీవుడ్ ఆకాంక్షలపై ఆమె మనసు విప్పింది. వర్ష తన వాచ్‌మెన్ కొడుకు చదువు గురించి కూడా మాట్లాడింది.
తెలుగులో టాప్ రియాలిటీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై దూసుకెచ్చిన యాక్టర్ వర్ష. రియాలిటీ షోలతో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు చేరువైన కొద్దికాలంలోనే హోస్ట్‌గా మారింది. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా కూడా రాణిస్తున్నారు. పలు బ్రాండింగ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఆమె తన గురించి, సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ గురించి, జబర్దస్త్ కమెడియన్ల గురించి తన అభిప్రాయాలను ఫిల్మీబీట్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ కార్తీక్, వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో పంచుకొన్నారు. ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ వర్ష అనగానే ఇమ్మాన్యుయేల్ గుర్తుకు వస్తాడు. వారిద్దరి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అంటే.. సుధీర్, రష్మీ గౌతమ్ జంట తర్వాత అంత గొప్ప పాపులారిటీ వచ్చింది. అయితే నిజంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారా? డేటింగ్ చేస్తున్నారా? అనేంతగా కలిసి కెమిస్ట్రీని పండిస్తారు. అలా పాపులారిటీని సాధించిన జబర్దస్త్ వర్ష.. ఇమ్మాన్యుయేల్ నాకు టీచర్ లాంటి వాడు అని అన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో నాకు గోల్స్ అంటూ ఏమీ లేవు. అలా గోల్స్ పెట్టుకొంటే ఏమీ చేయలేం. ఈ రోజు ఇక్కడున్నాం. రేపు ఎక్కడుంటామో అక్కడ ఎంజాయ్ చేయాలి. దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరిగిపోతుంది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు లేకుంటే జీవితం చాలా చప్పగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూశాను. వాటిని దాటుకొంటూ వెళ్తేనే ఎంజాయ్ ఉంటుంది అని అన్నారు.
అల్లు అర్జున్‌తో హీరోయిన్‌గా నటించాలనే కోరిక మనసులో ఉంది. కానీ ఆ రేంజ్ ఐకాన్ స్టార్‌తో నటించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఆయన నాతో నటించాలి కదా. అల్లు అర్జున్ స్టయిల్, డ్యాన్స్ అంటే నాకు ఇష్టం. ఆయన పక్కన చెల్లిగా, అక్కగా నటించడం నాకు ఇష్టం లేదు. ఆ రెండు పాత్రలు తప్ప మిగితా ఎలాంటి పాత్రల్లోనైనా నటించేందుకు రెడీ. అయితే రాంచరణ్, ఎన్టీఆర్‌కు చెల్లెలిగా నటించాలని ఉంది. ఎందుకంటే.. మా అన్నయ్యను చూస్తే ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉంటుంది అని ఆమె అన్నారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని ఉంది. నాలుగైదు సంవత్సరాలుగా ఆఫర్ వస్తూనే ఉంది. కానీ నేనే వెళ్లడం లేదు. నేను బాగా పుష్టిగా తయారై.. లావైన తర్వాత అందులోకి వెళ్తాను. ఇక ముందు కూడా అవకాశం వస్తే బిగ్‌బాస్‌లోకి తప్పకుండా వెళ్తాను. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాకు బిగ్ బాస్ షో అంటే ఇష్టం కూడా అని వర్ష ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
తెలుగు సినిమా పరిశ్రమలో నటించమని చాలా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం నేను టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాను. జబర్దస్త్‌లో ఎమోషనల్ కంటెంట్ ఇస్తాననే పేరు ఉంది. భావోద్వేగాలు బాగా పండిస్తానని నా ఫ్రెండ్స్ చెబుతుంటారు. కానీ నాకు గ్లామర్ రోల్స్ చేయాలని ఉంది. అనసూయ మాదిరిగా నేను గ్లామర్ రోల్స్‌లో నటించి ఆమె లాగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నాకు అనసూయ అంటే ఓ ఇన్సిపిరేషన్ అని జబర్దస్త్ వర్ష అన్నారు.


Click it and Unblock the Notifications











