»   » ‘జబర్దస్త్’ వినోద్ ఆత్మహత్యాయత్నం: బలవంతపు పెళ్లే కారణం....

‘జబర్దస్త్’ వినోద్ ఆత్మహత్యాయత్నం: బలవంతపు పెళ్లే కారణం....

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బుల్లితెర హిట్ షో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా లేడీ గెటప్ లో పాపులర్ అయిన నటుడు వినోద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసే ప్రయత్నం చేయడంతో వినోద్ ఈ చర్యకు పాల్పడ్డాడు.

కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో వినోద్ కు బలవంతంగా పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించగా, అది ఇష్టం లేని వినోద్ తన చేతి మణికట్టును కత్తితో కోసుకుని గాయపర్చుకున్నాడు.

తల్లి ముందే

తల్లి ముందే

తన ఇష్టం లేకున్నా తన తల్లి శిరోమణి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని ప్రయత్నించడంతో.... అటు తల్లిదండ్రులను ఎదురించలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోసుకోలేక వినోద్ చావడానికి సిద్ధమవ్వడం అందరినీ షాక్ కు గురి చేసింది.

రంగంలోకి పోలీసులు

రంగంలోకి పోలీసులు

వినోద్ ఆత్మహత్యయత్నం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పెళ్లిని ఆపేశారు. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు

ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు

పెళ్లి ఇష్టం లేకుంటే ఆ విషయం ధైర్యంగా చెప్పాలి, అప్పటికీ వినక పోతే పోలీసులను ఆశ్రయించాలి.... క్షణికావేశంలో ఆత్మహత్య లాంటి పిచ్చి పనులు చేయవద్దని జబర్దస్త్ అభిమానులు సూచిస్తున్నారు.

వినోదిని అలియాస్ వినోద్

వినోదిని అలియాస్ వినోద్

తెలుగులో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్త్ కామెడీ'. ఈ కార్యక్రమంలోని దాదాపు ప్రతి స్కిట్ లో లేడీ క్యారెక్టర్లు తమదైన కామెడీ, అభినయంతో ఎంటర్టెన్ చేస్తుండటం అందరికీ తెలిసిందే. అలాంటి వాటిలో... వినోదిని క్యారెక్టర్ ఒకటి. వినోదిని పేరుతో ఈ క్యారెక్టర్ చేస్తుంది మరెవరో కాదు నటుడు వినోద్.

English summary
Jabardasth actor Vinod mom Seromani arranged a marriage for him powerfully in the Bondaladinne village of Sanjamala Mandal in Kurnool. Vinod did not like the marriage the forceful marriage and tried to commit suicide
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu