Just In
Don't Miss!
- News
Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంట్లో టైం దొరకడం లేదా?.. లైట్లు ఆర్పేయాలా.. జాకీ, హరితపై అలీ నాటు కామెంట్స్
బుల్లితెరపై జంటలుగా నటించే కొంత మంది సెలెబ్రిటీలునిజ జీవితంలోనూ జంటలుగా మారారు. సీరియల్‌లో నటిస్తూ అలా స్నేహం, ప్రేమ మొదలై చివరకు పెళ్లి బంధంతో ఒక్కటైన వారు కూడా ఉన్నారు. అందులో జాకీ, హరితలు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే సీరియల్‌లో జంటలుగా నటిస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరూ అలీతో సరదాగా షోలో గెస్ట్‌లు విచ్చేశారు. ఎంట్రీతోనూ అలీకి పెద్ద షాక్ ఇచ్చారు.

రొమాన్స్‌లో మునిగి..
జాకీ హరితలు షోలోకి ఎంట్రీ ఇస్తూనే రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అదిరిపోయే పాటకు స్టెప్పులు వేస్తూ అన్నీ మరిచిపోయారు. ఇక అలీ పక్కనే ఉండి అన్నీ చూస్తున్నాడు. కానీ వారు ఎంతకీ డ్యాన్సులు ఆపడం లేదు. ఇక ఎంతసేపైనా చేసుకోండన్నట్టుగా వారిద్దరినీ వదిలేశాడు.

ఇంట్లో టైం లేదా?
జాకీ హరితల డ్యాన్సు చూసిన అలీ పంచ్ వేశాడు. ఇంట్లో మీకు టైం దొరకడం లేదా? అంటూ రొమాన్స్‌పై కౌంటర్ వేశాడు. లైట్లు ఆపేయమంటారా? అని మరో పంచ్ వేశాడు. లైట్లు ఆర్పేయడంతో ఇద్దరూ పగలబడి నవ్వేశారు. ఇంత యంగ్‌గా ఉండటానికి కారణమేంటంటూ జాకీపై అలీ పంచ్ వేశాడు.

ప్రేమ కథపై...
‘ఎవరు ఎవరికి మొదట ప్రపోజ్ చేశారు' అని ఆలీ అడగ్గా.. ‘ఇద్దరికీ ఇద్దరం ఇష్టమని తెలుసు. అయితే, ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండేవాళ్లం. అమ్మాయిని లవ్‌లో పడేసే క్రమంలో ‘ఇంట్లో నాకూ సంబంధాలు చూస్తున్నారు. నేను ఓకే చెప్పడం లేదు' ఇలా చాలా కబుర్లు చెబుతాం కదా. అలానే నేను కూడా చెప్పేవాడిని' అంటూ జాకీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

హరిత సమాధానం..
‘మన' అనుకున్నప్పుడే భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయని హరిత చెప్పుకొచ్చింది. మా ఆయనకే లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.. ఆ విషయంలో నేను గర్వపడతాను అంటూ హరిత సెటైర్ వేసింది. మొత్తానికి ఈ ఇద్దరి ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాలో అందరినీ ఆక్టటుకుంటున్నాయి.