నాని ఎఫైర్ సీక్రెట్స్.. బయట పెట్టిన జగపతి బాబు.. షాకింగ్ కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ లో, యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న నాని, ఇప్పుడు మాస్ ఆడియెన్స్ పై గురి పెట్టారు. ఈ క్రమంలో తన సినిమాల విషయంలో రూటు మార్చుకున్నారు. దీంతో ప్రస్తుతం భారీ యాక్షన్, మాస్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే దసరా చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రీసెంట్ గా నాని హిట్ 3 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ లుక్, యాక్షన్, వయలెన్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. తన టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించడం విశేషం. మే 01 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక నెక్ట్స్ నాని మరోసారి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్యారడైజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూట్ వేగంగా కొనసాగుతోంది.

Jagapathi Babu Shocking Comments about Nani Love Stories

ఈ క్రమంలో ప్రస్తుతం నాని తన రాబోయే చిత్రం ప్యారడైజ్ తో బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా లేటెస్ట్ ఎపిసోడ్ కు హాజరయ్యారు. ఇప్పటికే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున, శ్రీలీలా హాజరై సందడి చేస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలు, కాంట్రవర్సీల విషయాలపైనా కూడా స్పందించారు. జగపతి బాబు అడిగిన షాకింగ్ ప్రశ్నలకు నిర్మోహమాటంగా, నిర్భయంగా సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా నాని ఈ షోకు హాజరయ్యారు.

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు నాని లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోకు సంబంధించిన విషయానికొస్తే.. జగపతి బాబు మాట్లాడుతూ నువ్వు నన్ను మొదటి సారిగా ఎక్కడ కలిశావో, మనం ఎలా కలిశామో తెలుసా అని నానిని అడుగుతాడు. నాకు గుర్తుకు లేదు సార్ అని నాని బదులిస్తాడు. దీంతో జగపతి బాబు దెబ్బ తిన్నది నేనే కదా నాకు మాత్రమే గుర్తుకు ఉంటుందిలే అని అంటాడు. ఆ తర్వాత నాకు సంబంధించిన ఒక ఐడీ కార్డును చూపిస్తాడు. అది చూసి నాని షాక్ అవుతాడు. ఇదేలా దొరకబట్టారు సార్ అని అడుగుతాడు.

ఆ తర్వాత నాని క్లోజ్ ఫ్రెండ్ ఒకరిని పిలిపించి నాకి రష్మి అనే అమ్మాయి గురించి తెలుసుకోవడానికి అతన్ని పిలిపించామని జగపతి బాబు అంటాడు. ఆ తర్వాత ఇక నానినే ఏకంగా నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలకు ఐ లవ్ యూ అని చెప్పావని జగపతి బాబు ప్రశ్నిస్తాడు. దాంతో నాని ఎలాంటి సమాధానం ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వచ్చే ఆదివారం రాత్రి 9 గంటలకు ఫుల్ ఎపిసోడ్ జీ సినిమాలు ఛానెల్ లో ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X